Game Changer : ఈ ఏడాదిలో మొదటి పాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజర్.. ఈ మూవీ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. జనవరి 10 న సంక్రాంతి కానుకగా ఈ మూవీ రాబోతుంది. గతంలో డిసెంబర్ లో రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేశారు. కానీ షూటింగ్ ఇంకా పెండింగ్ ఉండటంతో ఈ మూవీ సంక్రాంతికి షిఫ్ట్ అయ్యింది. ట్రిపుల్ ఆర్ తర్వాత రామ్ చరణ్ చేస్తున్న మూవీ కావడంతో దీనిపై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. కేవలం కొద్ది రోజుల్లోనే సినిమా థియేటర్లలోకి రాబోతుంది. దీంతో సినిమాను జనాల్లోకి తీసుకెళ్లేందుకు శంకర్ టీమ్ గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీ నుంచి రీసెంట్ గా దోప్ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఆ మూవీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో పాటుగా యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది. ఇప్పుడు తాజాగా మూవీ నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు.
గేమ్ చేంజర్ ట్రైలర్ ను ఏఎంబిలో లాంచ్ చేశారు. టాలీవుడ్ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు అందరూ ఈ ట్రైలర్ కోసం వెయిట్ చేశారు. మొత్తానికి ట్రైలర్ ను రిలీజ్ చేశారు గేమ్ ఛేంజర్ టీమ్. తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ లో.. రామ్ చరణ్ యాక్టింగ్ అదిరిపోయింది. యాక్షన్, పొలిటికల్ సన్నివేశాలను చూపిస్తూ ట్రైలర్ ను కట్ చేశారు. ముఖ్యంగా రామ్ చరణ్ హెలికాప్టర్ నుంచి దిగే సీన్ మాత్రం కేక పుట్టిస్తుంది. కడుపునిండా వంద ముద్దలు తినే ఏనుగు ఒక్క ముద్ద వదిలేస్తే ఏం కాదు.. లక్షల చీమలకు ఆహారం అవుతుంది. అంటూ పవర్ ఫుల్ డైలాగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. తండ్రి కొడుకులు ఎక్కడా తగ్గకుండా ప్రజలను న్యాయం చెయ్యాలని చూస్తారు. ఆ కాన్సెప్ట్ బాగుంది. ఇక ఎస్జే సూర్య, రామ్ చరణ్ మధ్య సాగే డైలాగులు ఓ రేంజులో ఉన్నాయి.. ప్రతి సీన్ గూస్ బంబ్స్ వస్తుందని చెప్పాలి. రామ్ చరణ్ మరో బ్లాక్ బాస్టర్ కొట్టేలా ఈ సినిమా ఉండబోతుందని ట్రైలర్ ను చూస్తుంటే అర్థమవుతుంది.. మొత్తానికి ట్రైలర్ తో సినిమా పై మరోసారి భారీ అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. తాజాగా ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ సినిమా 165 నిమిషాల నిడివితో రాబోతున్నట్టుగా దీనితో ఖరారు అయ్యింది. ఇక ఈ మూవీ స్టార్టింగ్ లో టైటిల్ కార్డ్స్ లో కూడా తెలుగు పదాలు ఇవ్వడం మానేశారు. ఇపుడు గేమ్ ఛేంజర్ లో కూడా ఈ టైటిల్ కార్డుని తెలుగులో కూడా పెట్టాలని సూచించారని తెలుస్తుంది..
గతంలో ఈ మూవీ నుంచి సాంగ్స్ రిలీజ్ చేశారు. శంకర్ సినిమాల్లో సాంగ్స్ కు ఒక మార్క్ ఉంటుంది. భారీ బడ్జెట్ తో భారీ సెట్ లో సాంగ్స్ ను చేస్తారు. అలాగే గేమ్ మూవీకి కూడా ప్లాన్ చేశారు. మొదట్లో విమర్శలు ఎదుర్కొన్నప్పటికి ప్రస్తుతం రిలీజ్ అయిన ట్రైలర్ తో భారీ అంచనాలు ఏర్పడ్డాయని తెలుస్తుంది. ఈ మూవీలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ లో కనిపించునున్నారు. పొలిటికల్ డ్రామా, యాక్షన్ మూవీగా రాబోతుంది. అంజలి, కియారా అద్వాని లు హీరోయిన్లు గా నటిస్తున్నారు. శ్రీకాంత్ ఎస్జె సూర్య, సునీల్, జయరాం, నవీన్ చంద్ర తదితరులు నటించిన గేమ్ చేంజర్ పూర్తిగా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందింది. కాలేజీ స్టూడెంట్, రైతు, ఎన్నికల అధికారిగా మొత్తం మూడు గెటప్స్ లో రామ్ చరణ్ కనిపించనున్నాడు.. భారీ అంచనాలతో థియేటర్లలో కి రాబోతున్న ఈ మూవీ ఎలాంటి టాక్ ను అందుకుంటుందో.. ఏ మేర రికార్డులను బ్రేక్ చేస్తుందో చూడాలి…