Vijay Deverakonda:రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) కు తాజాగా షాక్ తగిలిందని చెప్పాలి. ట్రైబల్స్ గురించి ఆయన తప్పుగా మాట్లాడడం వల్లే.. క్షమాపణ చెప్పాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. అసలు విషయంలోకి వెళ్తే.. ‘రెట్రో’ ప్రమోషన్స్ లో భాగంగా హీరో విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యలపై మన్యం (D) ఆదివాసీ జేఏసీ నాయకులు మండిపడ్డారు. పహాల్గామ్ దాడిపై పాక్ గురించి మాట్లాడుతూ..” ట్రైబల్స్ లాగా కొట్టుకోవడం ఏంటి?”అంటూ ఆయన కామెంట్లు చేశారు. ఇక ఈ విషయాలపై వారు స్పందిస్తూ.. ఇలాంటి కామెంట్లు చేయడం దారుణం.. గిరిజనుల చరిత్ర తెలిసినట్లు హేళన చేస్తూ మాట్లాడడం సరికాదని మండిపడ్డారు. ఉపన్యాసాలు ఇచ్చే ముందు వారి స్థితిగతులు తెలుసుకోవాలని, తక్షణమే హీరో క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ట్రైబల్స్ పై విజయ్ దేవరకొండ ఊహించని కామెంట్స్..
తాజాగా సూర్య హీరోగా నటించిన ‘రెట్రో’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విజయ్ దేవరకొండ హాజరయ్యారు. ఇక ఆ వేడుకలో సూర్య గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకొని, అభిమానులను ఆనందంలో ముంచేసిన ఈయన దాంతోపాటు ఇటీవల జరిగిన కాశ్మీర్ లోని పహల్గామ్ ఉగ్రదాడిపై కూడా స్పందిస్తూ ఫైర్ అయ్యారు. విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. “ఈ టెర్రరిస్ట్ కొడుకులకు సరైన ఎడ్యుకేషన్ ఇప్పిస్తే.. ఇలా బ్రెయిన్ వాష్ అవ్వకుండా ఉంటారు.. ఏం సాధిస్తారు.. ? నేను చెబుతున్నాను.. కాశ్మీర్ మనదే.. కాశ్మీర్ వాళ్లు మనవాళ్లే.. 2 ఏళ్ల క్రితం కాశ్మీర్లో ‘ఖుషీ సినిమా షూటింగ్ చేశాను. వాళ్లతో ఎన్నో మంచి జ్ఞాపకాలు ఉన్నాయి. పాకిస్తాన్ దేశంలో వాళ్ళ మనుషులని వాళ్లు చూసుకోలేకపోతున్నారు. అక్కడ కరెంటు, నీళ్లు కూడా లేవు. అలాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి ఏం చేయాలని చూస్తున్నారో అర్థం కావడం లేదు. పాకిస్తాన్ మీద ఇండియా అటాక్ చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలాగే కొనసాగితే.. అక్కడి ప్రజలే ప్రభుత్వం మీద విరక్తి కలిగి తిరగబడతారు.. 500 సంవత్సరాల క్రితం ట్రైబల్స్ కొట్టుకున్నట్లు ఇలా బుద్ధి లేకుండా కామెన్సెన్స్ లేకుండా ఇలాంటి పనులు చేస్తున్నారు. మనమందరం భారతీయులం ఐకమత్యంతో కలిసి హ్యాపీగా ఉండాలి” అంటే విజయ్ దేవరకొండ కామెంట్లు చేశారు. ఈ నేపథ్యంలోనే గిరిజన సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ క్షమాపణ కోరాలి” అంటూ డిమాండ్ చేస్తున్నారు.
విజయ్ దేవరకొండ సినిమాలు..
విజయ్ దేవరకొండ సినిమాలు విషయానికి వస్తే.. ప్రస్తుతం ఈయన గౌతమ్ తిన్ననూరి (Gautham Thinnanuri) దర్శకత్వంలో ‘కింగ్డమ్’ అనే సినిమా చేస్తున్నారు. ఇక త్వరలోనే ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు విజయ్ దేవరకొండ.
ALSO READ:Mollywood: ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ డైరెక్టర్ ఎన్. కరుణ్ మృతి..!