BigTV English

OTT Movie : రీల్ కాదు రియల్ ఈ మూవీ… షూటింగ్ అని చెప్పి హీరోని ఇలా లేపేశారేంటి భయ్యా

OTT Movie : రీల్ కాదు రియల్ ఈ మూవీ… షూటింగ్ అని చెప్పి హీరోని ఇలా లేపేశారేంటి భయ్యా

OTT Movie : హర్రర్ సినిమాలు అంటే తరచుగా ఓ దెయ్యం, దానికి గతం, ఎవరినో ఒకరిని పట్టి పీడించడం అనే రొటీన్ ఫార్ములాతోనే ఎక్కువగా రూపొందుతాయి. కానీ ఓ సినిమాలో మాత్రం హీరో చచ్చి, బ్రతికి పగ తీర్చుకుంటాడు. ఇందులో మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఈ సినిమా షూటింగ్ లో హీరోని నిజంగానే కాల్చి చంపారు. రీల్ లో జరగాల్సిన గన్ ఫైరింగ్ రియల్ గా జరిగిన ఈ మూవీ స్టోరీ ఏంటి? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది? అనే వివరాల్లోకి వెళ్తే…


బ్రాండన్ లీ చివరి సినిమా
‘ది క్రో’ (The Crow 1994) మూవీ జేమ్స్ ఓ’బార్ రాసిన గ్రాఫిక్ నవల ఆధారంగా, అలెక్స్ ప్రోయాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఒక అమెరికన్ యాక్షన్-థ్రిల్లర్ చిత్రం. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌ (Netflix)లో అందుబాటులో ఉంది. బ్రాండన్ లీ చివరి సినిమా అయిన ఇది కల్ట్ క్లాసిక్‌గా పేరు పొందింది. ఈ చిత్రం ప్రేమ, ప్రతీకారం, దుఃఖం వంటి అంశాలతో ఆసక్తికరంగా నడుస్తుంది.

కథలోకి వెళ్తే…
డెట్రాయిట్‌ నగరం నేరాలతో నిండిపోతుంది. అక్కడే నివసించే రాక్ మ్యూజిషియన్ ఎరిక్ డ్రావెన్ (బ్రాండన్ లీ), అతనికి కాబోయే భార్య షెల్లీ వెబ్‌స్టర్ (సోఫియా షినాస్)ను ఓ గ్యాంగ్ కిరాతకంగా హత్య చేస్తుంది. డెవిల్స్ నైట్ (హాలోవీన్ ముందు రాత్రి)లో షెల్లీపై అఘాయిత్యం చేయగా, ఆమె గాయాలతో ఆసుపత్రిలో మరణిస్తుంది. అయితే ఎరిక్‌ ను మాత్రం కాల్చి, అపార్ట్‌మెంట్ కిటికీ నుండి విసిరివేస్తారు. అయితే హీరో హీరోయిన్ చూసుకునే సారా (రోచెల్ డేవిస్) అనే చిన్న అమ్మాయి ఈ దారుణ ఘటనను కళ్ళారా చూస్తుంది. పోలీస్ సార్జెంట్ ఆల్బ్రెక్ట్ (ఎర్నీ హడ్సన్) ఆమెను ఓదారుస్తాడు.


ఒక సంవత్సరం తర్వాత ఎరిక్ శవానికి ఓ కాకి జీవం పోయడంతో, అతను సమాధి నుంచి బయటకొస్తాడు. ఆ కాకి అతనికి అమరత్వంతో పాటు అసాధారణ శక్తులను ఇస్తుంది. ఒక పురాణం ఆధారంగా ఈ కాకి ఎవరైనా ఒక వ్యక్తి దారుణంగా మరణిస్తే, కాకి ఆ ఆత్మను తిరిగి తీసుకువచ్చి, అతనికి జరిగిన అన్యాయాన్ని సరిచేయడానికి ప్రయత్నిస్తుంది. ఎరిక్ ఇప్పుడు “ది క్రో”గా, తనకు కాబోయే భార్య షెల్లీ హత్యలకు కారణమైన గ్యాంగ్ సభ్యులపై ప్రతీకారం తీర్చుకోవడానికి బయలుదేరతాడు. షెల్లీ 30 గంటల పాటు బాధపడిన విషయాన్ని తెలుసుకుని, అదే నరకాన్ని విలన్లకు చూపించాలని ఫిక్స్ అవుతాడు. ఒక్కొక్కరుగా అందరినీ అంతమొందిస్తున్న క్రమంలో సారాను విలన్ కిడ్నాప్ చేస్తాడు. మరి హీరో పగ ఎలా తీర్చుకున్నాడు? ఆ అమ్మాయిని కిడ్నాపర్ల చెర నుంచి ఎలా విడిపించాడు? చివరికి ఏం జరిగింది ? అన్నది స్టోరీ.

బ్రాండన్ లీ ట్రాజెడీ
ఈ చిత్రం షూటింగ్ సమయంలో ఒక ప్రొప్ గన్ ప్రమాదంలో బ్రాండన్ లీ కన్నుమూశాడు. డమ్మీ గన్ ఉండాల్సిన ప్లేస్ లో ఒరిజినల్ గన్ తో ఆయనను కాల్చారు. అయితే ఈ పని చేసింది ఎవరు? అన్న విషయం ఇంకా మిస్టీరియస్ గానే ఉండడం గమనార్హం. ఘటన తరువాత అతని సన్నివేశాలను పూర్తి చేయడానికి స్టంట్ డబుల్, డిజిటల్ ఎఫెక్ట్స్ ఉపయోగించారు.

Related News

Junior Movie: ఓటీటీలోకి జూనియర్ మూవీ..ఆ రోజే స్ట్రీమింగ్!

OTT Movie : టెర్రరిస్టులకే టెర్రర్ పుట్టించే ఆడపులి… ప్రతీ 5 నిమిషాలకో ట్విస్ట్… నరాలు కట్ అయ్యే సస్పెన్స్ థ్రిల్లర్

OTT Movie : షార్క్‌లను దేవతలుగా భావించే సైకో… ఆడవాళ్లను బలిచ్చి దిక్కుమాలిన పని… గ్రిప్పింగ్ సర్వైవల్ హారర్ థ్రిల్లర్

OTT Movie : తల్లీకూతుర్లు ఇద్దరితో ఒక్కడే… ఐఎమ్‌డీబీలో రేటింగ్ 9.1… తెలుగు మూవీనే మావా

OTT Movie : రోబోని కూడా వదలకుండా ఆటగాడి అరాచకం… అదిచ్చే షాక్ కు మైండ్ బ్లాంక్

OTT Movie : మనుషులకు తెలియకుండా మాయదారి పనులు… ఫ్యూచర్లో ఏఐ ఇంత డేంజర్ స్టంట్స్ చేస్తుందా మావా ?

OTT Movie : బాడీ బిల్డర్ తో ఆ పాడు పని… ఈ నలుగురు ఆడవాళ్ళూ అరాచకం మావా… సింగిల్ గా చూడాల్సిన మూవీ

OTT Movie : రియల్ కల్ట్ క్రైమ్‌… మతం పేరుతో మతిపోగోట్టే పనులు… మర్డర్ మిస్టరీతో ఊహించని టర్న్

Big Stories

×