E-Paper
Advertisement

Triple Roles : త్రిపాత్రాభినయం చేసిన స్టార్ హీరోలపై ఓ లుక్కేద్దాం..

Triple Roles : త్రిపాత్రాభినయం చేసిన స్టార్ హీరోలపై ఓ లుక్కేద్దాం..
Advertisement
Triple Roles

Triple Roles : తెరపై తమ అభిమాన హీరో ఒక పాత్రలో కనిపిస్తేనే అభిమానుల్లో పూనకం వచ్చేస్తుంది. అలాంటిది తమ అభిమాన హీరోలు త్రిపాత్రాభినయం చేస్తే.. ఇక వారి ఆనందానికి అవధులు ఉండవు. తెలుగు సినీ చరిత్రలో ఒకే సినిమాలో మూడు పాత్రల్లో నటించి, మెప్పించిన హీరోలెవరో చూద్దాం.

జూనియర్ ఎన్టీఆర్
ఎన్టీఆర్ హీరోగా 2017లో విడుదలైన ‘జై లవ కుశ’ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ మూవీలో తారక్.. జై, లవ, కుశ అనే ముగ్గురి కవల సోదరుల పాత్రల్లో నటించారు. అందులో జై.. విలన్ పాత్రలో కనిపిస్తాడు.

Advertisement

కళ్యాణ్ రామ్
కళ్యాణ్ రామ్ తొలి ట్రిపుల్ రోల్స్ సినిమా ‘అమిగోస్’. ఈ ఎడాది(2023) మొదట్లో విడుదలైన ఈ సినిమా హిట్ కాలేకపోయినా.. కళ్యాణ్ రామ్ నటన అద్భుతం అనిపించింది. ఇందులో మంజునాథ్, సిద్ధార్థ్, మైఖేల్ అనే పాత్రల్లో నటించారు. మైఖేల్ విలన్‌గా కనిపిస్తాడు.

సూర్య
‘సింగం’ సినిమాలతో టాలీవుడ్‌‌లో భారీగా అభిమానులను సంపాదించుకున్న తమిళ హీరో సూర్య. టైం ట్రావెల్ కాన్సెప్ట్‌తో సూర్య అలరించిన ‘24’ సినిమాలో తండ్రి (సేతురామన్)గా, కొడుకు (మణి)గా, పెదనాన్న (ఆత్రేయ)గా మూడు విభిన్న పాత్రల్లో కనిపించాడు. ఇందులో పెదనాన్న (ఆత్రేయ) విలన్..

Advertisement

సంపూర్ణేష్ బాబు
ఎలాంటి సపోర్ట్ లేకుండా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన హీరో సంపూర్ణేష్ బాబు. 2019లో విడుదలైన ‘కొబ్బరి మట్ట’ సినిమాలో సంపూర్ణేష్ బాబు మూడు పాత్రల్లో నటించారు. తాత, తండ్రి, కొడుకుగా ట్రిపుల్ రోల్స్ చేసి నవ్వులు పూయించారు సంపూ.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×