Spirit: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) హీరోగా పలు సినిమాలకు కమిట్ అవుతూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా ప్రభాస్ కమిట్ అయిన సినిమాలలో “స్పిరిట్” (Spirit)సినిమా ఒకటి. డైరెక్టర్ సందీప్ రెడ్డి(sandeep Reddy) వంగ దర్శకత్వంలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. అతి త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పనులు కూడా ప్రారంభం కాబోతున్నాయి. ఇక ఈ సినిమాలో ప్రభాస్ ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక డైరెక్టర్ సందీప్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా రాబోతుంది అంటే ఈ చిత్రం వైల్డ్ రేంజ్ లోనే ఉండబోతుందని స్పష్టమవుతుంది.
త్రిప్తి షాకింగ్ రెమ్యునరేషన్…
ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ గా యానిమల్ బ్యూటీ త్రిప్తి దిమ్రి(Tripthi Dimri) నటించబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఈమె ఇదివరకు సందీప్ రెడ్డి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన యానిమల్ సినిమాలో ఒక స్పెషల్ పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా ద్వారా త్రిప్తి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకోవడంతో తిరిగి సందీప్ రెడ్డి ఈమెను స్పిరిట్ సినిమాకు కూడా ఎంపిక చేశారు. ఇక ఈ సినిమాలో త్రిప్తి నటించబోతున్నారని వార్తలు రావడంతో ఈమె రెమ్యూనరేషన్ కి సంబంధించిన వార్తలు కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. సాధారణంగా బాలీవుడ్ ముద్దుగుమ్మలు భారీ స్థాయిలోనే రెమ్యూనరేషన్ అందుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే త్రిప్తి సైతం భారీగానే డిమాండ్ చేస్తున్నట్టు వార్తలు వినపడుతున్నాయి.
ప్రభాస్ స్పిరిట్ సినిమాలో నటించడం కోసం సందీప్ రెడ్డి త్రిప్తికి ఐదు కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ అందించబోతున్నట్టు వార్తలు వినపడుతున్నాయి. నిజానికి ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే నటించబోతుందంటూ వార్తలు వచ్చాయి. కానీ ఈమె గురించి ఎక్కడ చిత్ర బృందం అధికారక ప్రకటన వెల్లడించలేదు కానీ, దీపికా పదుకొనేని ఈ సినిమా నుంచి తప్పించారన్న వార్తలు వచ్చిన కాసేపటికే ఈ సినిమాలో త్రిప్తి భాగం కాబోతున్నారు అంటూ అధికారిక ప్రకటన వెలబడటం విశేషం. ఇక ఈ సినిమా నుంచి దీపికా పదుకొనే తప్పుకోవడానికి కారణం ఆమె డిమాండ్ చేస్తున్న రెమ్యూనరేషన్ అని తెలుస్తుంది.
లక్కీ ఛాన్స్ కొట్టేసిన యానిమల్ బ్యూటీ…
బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న దీపికా పదుకొనే ఒక్కో సినిమాకు 10 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు. అయితే ఇప్పుడు మాత్రం ఈమె మరికాస్త రెమ్యూనరేషన్ పెంచారని, ప్రభాస్ సినిమా కోసం ఏకంగా 20 కోట్ల రూపాయలు డిమాండ్ చేయడంతోనే నిర్మాతలు ఈమెను సినిమా నుంచి తప్పించారంటూ వార్తలు వినపడుతున్నాయి. ఏది ఏమైనా దీపిక తప్పుకోవడంతో త్రిప్తి లక్కీ ఛాన్స్ కొట్టేసారని చెప్పాలి.