BigTV English

Tripti dimri: యానిమల్ విజయం నరకాన్ని మిగిల్చింది.. బ్యూటీ షాకింగ్ కామెంట్స్..!

Tripti dimri: యానిమల్ విజయం నరకాన్ని మిగిల్చింది.. బ్యూటీ షాకింగ్ కామెంట్స్..!

Tripti Dimri : ఒకే ఒక్క సినిమా జీవితాన్ని మార్చేస్తుందనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ చాలామంది సెలబ్రిటీస్ ఉన్నారనే చెప్పాలి. అయితే సంవత్సరాల తరబడి ఇండస్ట్రీలో కొనసాగుతున్నా రాని గుర్తింపు ఒక సినిమాతో వచ్చి.. వారికి ఊహించనంత పాపులారిటీని తెచ్చిపెడుతుంది. అదే సమయంలో విమర్శలు కూడా అందిస్తుంది అనడంలో సందేహం లేదు. సరిగ్గా ఇలాంటి ఘటన తన జీవితంలో కూడా జరిగిందని చెబుతోంది. యానిమల్ బోల్డ్ బ్యూటీ త్రిప్తి డిమ్రి (Tripti dimri).


యానిమల్ మూవీతో ఓవర్ నైట్ లోనే స్టార్ స్టేటస్..

బోల్డ్ అండ్ డేరింగ్ డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్న సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో, బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ హీరోగా, నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించిన చిత్రం యానిమల్ (Animal). ఈ సినిమాలో రష్మిక తో పాటు త్రిప్తి డిమ్రి కూడా బోల్డ్ క్యారెక్టర్ లో అద్భుతంగా నటించింది. ముఖ్యంగా ఈ సినిమా రష్మిక కంటే త్రిప్తి డిమ్రి కే ఎక్కువ క్రేజ్ తెచ్చి పెట్టిందని చెప్పవచ్చు. రణబీర్ కపూర్, త్రిప్తి డిమ్రి మధ్య వచ్చే రొమాంటిక్ సన్నివేశాలకు అలియా ఆగ్రహం వ్యక్తం చేస్తుందేమో, ఇద్దరి మధ్య విడాకులు అవుతాయేమో అన్నట్టుగా నెటిజన్స్ కూడా కామెంట్లు చేశారు. ఆ రేంజ్ లో వీరిద్దరూ రొమాన్స్ చేశారని చెప్పవచ్చు.


సక్సెస్ వచ్చినా సంతోషం లేదు..

ఇకపోతే ఈ సినిమా భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడంతో వీరందరి కంటే కూడా ఎక్కువగా త్రిప్తి డిమ్రి కి మంచి గుర్తింపు లభించింది. చిన్న సినిమాలలో నటిస్తూ కెరియర్ నెట్టుకొచ్చిన ఈమె ఒక్కసారిగా ఈ సినిమాతో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. ఆ తర్వాత వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ. ఇకపోతే యానిమల్ తో మంచి లైమ్ లైట్ లోకి వచ్చినప్పటికీ ఈ సినిమా విజయం తనను నిరాశపరిచిందని.. ముఖ్యంగా నరకం ఎదుర్కొంటున్నాను అంటూ చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది ఈ ముద్దుగుమ్మ.

నరకాన్ని అనుభవించలేక మూడు రోజులపాటు దుఃఖించాను..

ఇటీవల రణబీర్ కపూర్ అల్లాబాడియా కు ఇచ్చిన పాడ్ కాస్ట్ లో ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పి ఆశ్చర్యపరిచింది. యానిమల్ సినిమా విడుదలైన తర్వాత తన మనసు ముక్కలైందని , మూడు రోజులపాటు దుఃఖాన్ని ఆపుకోలేక ఏడ్చాను అంటూ చెప్పుకొచ్చింది. ఆమె మాట్లాడుతూ.. యానిమల్ విజయం తర్వాత నేను సంతోషంగా ఉన్నాను. ఫాలోవర్స్ పెరిగారు. ఇంటర్వ్యూలు కూడా జరుగుతున్నాయి. పని దొరికింది అయితే ఆ తర్వాత నా దృష్టి నెగిటివ్ కామెంట్స్ వైపు వెళ్ళగా.. ప్రజలు చేసిన నెగిటివ్ కామెంట్స్ చదివిన తర్వాత ఆ సంతోషం కాస్త ఆవిరైపోయి, నరకం అనుభవించాను. ఒక సంతోషం నన్ను విమర్శలు భరించేలా చేసింది అంటూ తెలిపింది.

ప్రశంసల కంటే విమర్శలే ఎక్కువ..

ముఖ్యంగా ఈ సినిమాలో నా నటన చూసి సగం మంది ప్రజలు ప్రసంసిస్తే.. మరి సగం మంది విమర్శిస్తున్నారు. ఇతర సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నా.. ప్రజల చెడు మాటలు వినాల్సి వస్తుంది అని బాధపడ్డాను. దాంతో నా మనసు కాస్త అల్లకల్లోలం అయింది. జనం ఎలా తీసుకుంటున్నారో అనిపించింది. అందుకే మానసికంగా ఇప్పుడు మళ్లీ అధైర్య పడకుండా నెమ్మదిగా కోలుకుంటూ సక్సెస్ దిశగా అడుగులు వేస్తున్నాను అంటూ చెప్పుకొచ్చింది త్రిప్తి డిమ్రి.

Related News

Movie Industry : ఇండస్ట్రీలో ఇవి మారాల్సిందే… లేకపోతే దుకాణం క్లోజ్ ?

Mother Teresa : మదర్ తెరిస్సా 115 జయంతి.. సేవా కార్యక్రమాలలోలయన్స్ క్లబ్, హెల్ప్ ఫౌండేషన్!

Dharsha Guptha: ఇంస్టాగ్రామ్ ద్వారా నెలకు లక్షల్లో ఆదాయం..ఈ ముద్దుగుమ్మ పనే బాగుందే!

Vithika sheru: మట్టి వినాయకుడిని చేసిన హీరోయిన్.. వామ్మో ఈ టాలెంట్ కూడా ఉందా?

Dethadi Alekhya Harika: మన క్యారెక్టర్ ని డిసైడ్ చేసేది అదే.. బుల్లి కథతో హారిక పోస్ట్!

Big TV kissik talks : స్టేజ్ పై అమ్మాయిలతో పండు అలా.. అడ్డంగా పరువుతీసేసిన వర్ష…

Big Stories

×