BigTV English

Trisha : విజయ్ నాకు నచ్చడు… పొలిటికల్ ఎంట్రీ తర్వాత ఒక్కసారిగా ప్లేట్ మార్చిన త్రిష

Trisha : విజయ్ నాకు నచ్చడు… పొలిటికల్ ఎంట్రీ తర్వాత ఒక్కసారిగా ప్లేట్ మార్చిన త్రిష

Trisha :ఒకప్పుడు తన అందచందాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న త్రిష (Trisha) టాలీవుడ్ స్టార్ హీరోలు అందరి సరసన నటించి మెప్పించింది. ముఖ్యంగా కోలీవుడ్ లో కూడా భారీ పాపులారిటీ అందుకున్న ఈమె, ఇప్పటికీ ఒంటరిగానే జీవిస్తోందని చెప్పవచ్చు. వయసు 40 ఏళ్ళు దాటినా.. ఇంకా అదే క్రేజ్ తో ఇండస్ట్రీలో కొనసాగుతోంది అంటే, ఇక ఈమెకు ఏ రేంజ్ లో అభిమానులు పట్టం కడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. అటు త్రిష అందంలో కూడా ఎటువంటి మార్పులు కనిపించడం లేదు. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఎంత అందంగా ఉందో ఇప్పుడు కూడా అంతే అందంగా అందరినీ ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా త్రిష దూసుకుపోతోంది. తెలుగు, తమిళ్, మలయాళం భాషలలో బ్యాక్ టు బ్యాక్ విజయాలు అందుకుంటూ బిజీగా మారిపోయింది.


ఇక ఈమె గత కొన్ని రోజులుగా స్టార్ హీరో విజయ్ దళపతి (Vijay thalapathy)తో డేటింగ్ చేస్తోంది అంటూ వార్తలు తెగ వైరల్ అయిన విషయం తెలిసిందే. ఒక రకంగా చెప్పాలి అంటే గత రెండు దశాబ్దాల సినీ ప్రయాణంలో సినిమాల కంటే కూడా ఎక్కువగా వ్యక్తిగత విషయాలతోనే వార్తల్లో నిలిచింది త్రిష. ముఖ్యంగా ప్రభాస్ (Prabhas) ను మొదలుకొని, శింబు(Shimbu ) తోపాటు మరికొంతమంది హీరోలతో ప్రేమాయణం నడుపుతోంది అంటూ ఎన్నోసార్లు రూమర్లు వినిపించాయి. అయితే ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలైన తర్వాత కోలీవుడ్ హీరో విజయ్ దళపతి (Vijay thalapathy) తో డేటింగ్ చేస్తోందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇదివరకు వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారని, త్వరలోనే త్రిష కూడా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారని, సినిమాలను వదిలేసి పూర్తిగా విజయ్ దళపతితో కలిసి రాజకీయాల్లో చేరిపోతున్నారు అంటూ వస్తున్న వార్తలను త్రిష తల్లి కూడా ఖండించింది.

ఆ విషయంలో విజయ్ నాకు నచ్చడు..


ఇకపోతే ఇదంతా ఇలా ఉండగా.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న త్రిష.. విజయ్ దళపతి గురించి మాట్లాడి ఒక్కసారిగా అభిమానులను ఆశ్చర్యపరిచింది. విజయ్ దళపతి పొలిటికల్ ఎంట్రీ తర్వాత ఈ ముద్దుగుమ్మ ప్లేట్ మార్చింది ఏంటి? అంటూ నెటిజెన్స్ సైతం కామెంట్ చేస్తున్నారు. మరి త్రిష ఆ ఇంటర్వ్యూలో ఏం చెప్పింది? అనే విషయం ఇప్పుడు చూద్దాం.. త్రిష మాట్లాడుతూ.. “షూటింగ్ సెట్ లో హీరో శింబు నన్ను బాగా టీస్ చేసేవారు. కానీ విజయ్ మాత్రం ఒక గోడ పక్కన చోటు వెతుక్కొని మౌనంగా కూర్చుంటారు. విజయ్ దళపతి లో నాకు నచ్చని విషయం అదే. ఆయన ఆ విషయాన్ని మార్చుకోవాలని ఎప్పుడో చెప్పాను. అయినా సరే ఎప్పుడూ నాకు విజయ్ ప్రత్యేకమే” అంటూ చెప్పుకొచ్చింది త్రిష. ఇక ప్రస్తుతం త్రిష చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

త్రిష సినిమాలు..

త్రిష సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం అజిత్(Ajith ) హీరోగా నటిస్తున్న ‘విడాముయార్చి’ సినిమా చేస్తున్నారు.. ఈ సినిమా ఫిబ్రవరి 6వ తేదీన విడుదల కాబోతోంది. ఇక ఇందులో అర్జున్, రెజీనా కసాండ్రా కూడా నటిస్తున్నారు. ఇక భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమా అటు త్రిషకు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి. అలాగే చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘విశ్వంభర’ సినిమాలో కూడా ఈమె నటిస్తోంది. ఈ చిత్రానికి బింబిసారా (Bimbisara) డైరెక్టర్ వశిష్ట మల్లిడి (Vasista mallidi) దర్శకత్వం వహిస్తున్నారు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×