Trisha:సౌత్ సినీ ఇండస్ట్రీలో గత 22 సంవత్సరాలుగా అదే హవా కొనసాగిస్తూ.. స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది త్రిష (Trisha).ఒక్క తమిళ ఇండస్ట్రీలోనే కాదు తెలుగు ఇండస్ట్రీలో కూడా ఈమెకు ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ వుంది అని చెప్పవచ్చు. సాధారణంగా ఇండస్ట్రీలో హీరోయిన్లకు లైఫ్ టైం చాలా తక్కువ. కానీ త్రిష మాత్రం రెండు దశాబ్దాలకు పైగా ఇండస్ట్రీలో హీరోయిన్ గానే కొనసాగుతూ ప్రేక్షకులను అలరిస్తోంది అంటే ఇక ఈమెకు క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా టాలీవుడ్ లో చిరంజీవి(Chiranjeevi), వెంకటేష్ (Venkatesh), మహేష్ బాబు(Maheshbabu), పవన్ కళ్యాణ్ (Pawan kalyan ), బాలకృష్ణ (Balakrishna ), ఎన్టీఆర్ (NTR) వంటి టాప్ స్టార్ హీరోల అందరి సరసన నటించి మెప్పించింది.
విజయ్ నాకు ఎప్పటికీ ప్రత్యేకమే..
ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఈమె తన అందచందాలతో యంగ్ హీరోయిన్ లకు గట్టి పోటీ ఇచ్చి ఇప్పుడు చేతినిండా వరుస ప్రాజెక్టులతో బిజీగా మారింది. అందులో భాగంగానే మెగాస్టార్ చిరంజీవితో ఈమె నటిస్తున్న చిత్రం ‘విశ్వంభర’. మే నెలలో విడుదల కాబోతోంది. ఇదిలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న త్రిష ఒక హీరో పై చేసిన కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి. ఆయన ఎవరో కాదు రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ విజయ్ దళపతి (Vijay Dhalapathy) . చాలా కాలంగా త్రిష ఈయనతో ఎఫైర్ నడుపుతోంది అంటూ వార్తలు వినిపిస్తున్నా.. ఈ వార్తలను మాత్రం వీరు ఖండించే ప్రయత్నం చేయలేదు. ఇకపోతే తాజాగా మళ్లీ విజయ్ దళపతి గురించి మాట్లాడుతూ.. ఆయనకి నేను ప్రత్యేక అభిమానిని, ఆయన ఎప్పటికీ కూడా నాకు ప్రత్యేకమే. ఆయన చాలా లవబుల్ పర్సన్. ఆయనతో పనిచేయడం నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది అంటూ విజయ్ ని ఆకాశానికి ఎత్తేస్తూ త్రిష కామెంట్లు చేసింది. ఇక ఇప్పుడు త్రిష చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి.
విజయ్ సినిమాలో ఏ పాత్రను మిస్ అవ్వను..
ఇదిలా ఉండగా గతంలో త్రిష, విజయ్ దళపతి కలిసి ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించారు. లియో సినిమాలో కూడా నటించింది. ఐకపోతే స్పెషల్ సాంగ్ లు చేయడానికి ఇష్టపడని త్రిష, మొదటి సారి విజయ దళపతి హీరోగా నటించిన గోట్ (Goat) సినిమాలో స్పెషల్ సాంగ్ చేసి ఆయనపై తనకున్న అభిమానాన్ని చాటుకుంది. అందుకే విజయ్ సినిమాలో ఎలాంటి పాత్ర వచ్చినా సరే ఆ అవకాశాన్ని వదులుకోనని స్పష్టం చేసింది. ఏది ఏమైనా గత కొన్ని రోజులుగా వీరి గురించి వస్తున్న వార్తలకు ఈమె చెప్పిన మాటలు మరింత ఆజ్యం పోసాయని అభిమానులు సైతం కామెంట్లు చేస్తున్నారు.
ఎఫైర్ రూమర్స్ తో వార్తల్లో నిలుస్తున్న త్రిష..
ఇకపోతే గతంలోనే త్రిషపై ఎన్నో రూమర్స్ వినిపించిన విషయం తెలిసిందే. ముందుగా టాలీవుడ్ హీరో ప్రభాస్ తో ప్రేమలో పడినట్లు వార్తలు వచ్చాయి. పెళ్ళి కూడా చేసుకోవాలనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల విడిపోయారు. ఆ తర్వాత మరో కోలీవుడ్ హీరో తో కూడా ఎఫైర్ నడిపించింది అనే వార్తలు వినిపించాయి. ఇక అది కూడా మధ్యలోనే ఆగిపోయింది. మరో వ్యాపారవేతతో నిశ్చితార్థం కూడా చేసుకుంది.అది పెళ్లి వరకు వెళ్లకుండానే ఆగిపోయింది. ఇప్పుడు విజయ్ దళపతి అంటూ రూమర్లు వినిపిస్తున్నాయి. మరి ఇకనైనా వివాహం చేసుకుంటుందా లేక ఒంటరిగానే జీవితాన్ని గడుపుతుందా అన్నది ప్రశ్నార్ధకంగా మారింది.