Sanju Samson- BCCI: స్వదేశంలో ఇంగ్లాండ్ తో జరగబోయే ఐదు టి-20 ల సిరీస్ కి బీసీసీఐ భారత జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే తాజాగా శనివారం రోజు ఇంగ్లాండ్ తో జరగబోయే 3 వన్డేల సిరీస్, ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం బీసీసీఐ జట్టును ప్రకటించింది. ఇంగ్లాండ్ తో జరిగే ఐదు మ్యాచ్ ల టి-20 సిరీస్ లో వికెట్ కీపర్ సంజూ శాంసన్ కి భారత జట్టులో చోటు దక్కింది. కానీ ఇంగ్లాండ్ తో జరగబోయే 3 వన్డేల సిరీస్, ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేసిన జట్టులో సంజూకి చోటు దక్కలేదు.
Also Read: Rinku Singh: రూ.500 నోట్లు పంచుతున్న రింకూ సింగ్.. కారణం ఆ అమ్మాయేనా?
టి-20 ఫార్మాట్ లలో శాంసన్ అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. గతేడాది దక్షిణాఫ్రికా పర్యటనలో జరిగిన నాలుగు మ్యాచ్ ల టీ-20 సిరీస్ లో ఈ వికెట్ కీపర్ రెండు సెంచరీలు సాధించాడు. అంతేకాదు మంచి వికెట్ కీపర్ కూడా. కానీ ఇతడిని ఛాంపియన్ ట్రోఫీకి ఎంపిక చేయకపోవడం ఇప్పుడు ఈ చర్చనీయాంశంగా మారింది. ఇతడిని ఎంపిక చేయకపోవడానికి కారణం విజయ్ హజారే ట్రోఫీలో పాల్గొనక పోవడమే. విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభానికి ముందు కేరళ క్రికెట్ అసోసియేషన్ (కేసిఏ) మూడు రోజుల ప్రాక్టీస్ సెషన్ ని నిర్వహించింది.
ఈ ప్రాక్టీస్ సెషన్ కి శాంసన్ అందుబాటులో లేనని తెలియజేశాడు. ఈ కారణంగా కేరళ క్రికెట్ అసోసియేషన్ అతడిని విజయ్ హజారే ట్రోఫీ నుంచి తొలగించింది. అతను ఈ టోర్నీలో పాల్గొనక పోవడం వెనుక కారణాలను ఇప్పటివరకు చెప్పకపోవడం వివాదానికి కారణమైంది. బిసిసిఐ నియమాల ప్రకారం ప్రతి భారత ఆటగాడు దేశావాళి క్రికెట్ కి ప్రాధాన్యత ఇవ్వాలి. ఆటగాళ్లను జట్టులో ఎంపిక చేసుకోవడానికి దేశవాళీ ప్రదర్శన కీలకపాత్ర పోషిస్తుంది. అయితే విజయ్ హజారే ట్రోఫీలో పాల్గొనకపోవడంతో బిసిసిఐ శాంసన్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
అతడు ఈ విజయ్ హజారే టోర్నీలో ఎందుకు పాల్గొనలేదని కారణం తెలుసుకోవాలని సెలక్టర్లు ప్రయత్నిస్తున్నారు. అయితే కేరళ క్రికెట్ అసోసియేషన్ కి శాంసన్ కి మధ్య కొన్ని సంవత్సరాలుగా విభేదాలు ఉన్నాయని సమాచారం. ఈ కారణంగానే అతడు మూడు రోజుల ప్రాక్టీస్ సెషన్ లో పాల్గొనలేదట. అయితే అతడు విజయ్ హజారే ట్రోఫీలో ఎందుకు పాల్గొనలేదనే విషయంపై విచారించాలని తాజాగా భారత క్రికెట్ బోర్డు నిర్ణయించింది. అతడు విజయ్ హజారే ట్రోఫీలో పాల్గొనక పోవడంపై బీసీసీఐ గుర్రుగా ఉన్నట్లు సమాచారం.
ఈ అంశంపై విచారణ చెయ్యనున్నట్లు తెలుస్తోంది. అతడిని ఇప్పటికే ఛాంపియన్స్ ట్రోఫీలో నుంచి పక్కకు పెట్టిన బిసిసిఐ.. విజయ్ హజారే ట్రోఫీలో ఎందుకు పాల్గొనలేదో సరైన కారణం చెప్పకపోతే వన్డేలలో అతడిని పరిగణలోకి తీసుకునే అవకాశం లేదని బీసీఐ వర్గాలు చెబుతున్నాయి. గతేడాది దేశవాళీ క్రికెట్ కి డుమ్మా కొట్టిన ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయారని గుర్తు చేస్తున్నారు సీనియర్ ఆటగాళ్లు. కాగా శాంసన్ విషయంలో సెలక్టర్లు, బోర్డ్ ఎటువంటి కారణం చెప్పలేదు.
Also Read: Vijay Hazare Trophy 2025: విజయ్ హజారే ట్రోఫీ ఛాంపియన్ గా కర్ణాటక.. !
అయితే సంజూ గత కొంతకాలంగా దుబాయ్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ సంజు సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోతే.. అతడు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ లో సీకేటగిరీలో ఉన్నాడు. అతని కాంట్రాక్ట్ శాలరీ రూ. 1 కోటి. ఒకవేళ అతనిపై వేటు వేస్తే సెంట్రల్ కాంట్రాక్ట్ జీతం కట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పుడు బీసీసీఐ ఆ దిశగానే అడుగులు వేస్తుంది. ఒకవేళ విచారణలో సంజు తప్పు చేశాడని తేలితే అతడి సెంట్రల్ కాంట్రాక్ట్ రద్దు అవుతుంది.