Trisha Krishnan..కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతున్న త్రిష కృష్ణన్ (Trisha Krishnan) ఇండస్ట్రీకి వచ్చి దాదాపు రెండు దశాబ్దాలు అవుతున్నా.. ఇప్పటికీ తన అందంతో స్టార్ స్టేటస్ తో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాలలో నటించి భారీ పాపులారిటీ అందుకున్న ఈమె.. ఇప్పుడు కూడా అదే హీరోలకు బెస్ట్ ఛాయిస్ గా మారింది. ముఖ్యంగా విజయ్ దళపతి (Vijay Thalapathi), విక్రమ్ (Vikram), కమలహాసన్ (Kamal Haasan), చిరంజీవి(Chiranjeevi ) వంటి స్టార్ హీరోలకు బెస్ట్ ఛాయిస్గా మారిన త్రిష.. వరుస పెట్టి అవకాశాలు అందుకుంటూ బిజీగా మారిన విషయం తెలిసిందే. ఇకపోతే కెరియర్ పరంగా ఫోకస్ పెట్టిన ఈమె.. వ్యక్తిగతంగా ఇప్పటికీ వివాహానికి దూరంగానే ఉంది అని చెప్పవచ్చు. గతంలో శింబు , ప్రభాస్ వంటి హీరోలతో ఎఫైర్ రూమర్స్ వినిపించినా.. అవి రూమర్ గానే మిగిలిపోయాయి. ఇక ఇప్పుడు గత కొంతకాలంగా విజయ్ తో ప్రేమలో ఉంది అంటూ రోజుకో వార్త చెక్కర్లు కొడుతోంది. కానీ దీనిపై ఎవరూ కూడా స్పందించలేదు. ఇకపోతే తాజాగా త్రిష..” విజయ్ దళపతి ఒక సైలెంట్ కిల్లర్” అంటూ చేసిన కామెంట్లతో విజయ్ పరువు మొత్తం పాయే అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం ఇప్పుడు చూద్దాం.
త్రిష కెరియర్..
త్రిష.. ప్రభాస్ (Prabhas) హీరోగా నటించిన ‘వర్షం’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈమె.. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత చాలామంది టాలీవుడ్ స్టార్ హీరోలు సరసన నటించే అవకాశాన్ని అందుకొని.. మరింత బిజీగా మారిపోయింది. ఇకపోతే మధ్యలో కాస్త బ్రేక్ తీసుకొని మళ్లీ ఎంట్రీ ఇచ్చిన ఈమె రీ ఎంట్రీ లో కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. ప్రస్తుతం చిరంజీవి(Chiranjeevi ) ప్రధాన పాత్రలో వస్తున్న ‘విశ్వంభర’ సినిమాలో నటిస్తోంది. అలాగే మరికొన్ని తమిళ్ చిత్రాలలో కూడా కనిపించనుంది..
విజయ్ దళపతి పై త్రిష కామెంట్స్..
ఇక ఈమె వ్యక్తిగత విషయానికి వస్తే.. గతంలో ఒక బిజినెస్ మాన్ తో ఎంగేజ్మెంట్ అయ్యింది. కానీ ఎంగేజ్మెంట్ ను క్యాన్సిల్ చేసుకున్నారు. అలా అప్పటి నుంచి ఒంటరిగానే ఉంటున్న ఈమె ఇప్పుడు సినిమాలలో బిజీ అయింది. కానీ కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతితో రూమర్స్ మాత్రం ఆగడం లేదు. పైగా రెడ్ హ్యాండెడ్గా పలుచోట్ల దొరికిపోయారు కూడా.. అంతే కాదు ఇప్పటివరకు ఏ హీరో సినిమాలో కూడా ఐటమ్ సాంగ్ చేయని ఈమె.. విజయ్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది. దీంతో వార్తలు మరింత ఊపందుకొన్నాయి. ఇదిలా ఉండగా గతంలో ఈమె విజయ్ దళపతి గురించి చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
also read: Director vetrimaran: సినిమా స్టైల్ లో వెట్రిమారన్ లవ్ స్టోరీ.. ఆమె తండ్రి ఏం చేశాడంటే?
విజయ్ దళపతి ఒక సైలెంట్ కిల్లర్..
ఇంటర్వ్యూలో భాగంగా విజయ్ దళపతి ఫోటోని చూపిస్తూ యాంకర్ పలు ప్రశ్నలు అడిగారు. విజయ్ గురించి ఆమె మాట్లాడుతూ..” విజయ్ చాలా డిఫరెంట్. షూటింగ్ సమయంలో ఎంతో నిశ్శబ్దంగా ఉంటారు. అందుకే అతడిని సైలెంట్ కిల్లర్ అని పిలుస్తారు. కానీ సినిమా కోసం ఎంతో కష్టపడతారు. ఎప్పుడూ నాకు సరికొత్తగా కనిపిస్తూ ఉంటారు” అంటూ చెప్పుకొచ్చింది.వీరిద్దరి కాంబినేషన్లో దాదాపు 5 సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. మొత్తానికి అయితే త్రిష విజయ్ దళపతి గురించి పొగుడుతూ కామెంట్లు చేసినా.. సైలెంట్ కిల్లర్ అని చెప్పి ఆయన పరువు తీసిందని కొంతమంది ఎప్పటిలాగే నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు.