Director vetrimaran..వెట్రిమోరన్ (Vetrimaran).. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ గా పేరు సొంతం చేసుకున్న ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించి భారీ పాపులారిటీ అందుకున్నారు. రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలకు భిన్నంగా సినిమాలు చేసే ఈయనతో సినిమా చేయడానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) కూడా ఎదురు చూస్తున్నారు అంటే.. ఇక ఈయన ఏ రేంజ్ లో సినిమాలను తెరకెక్కిస్తారో అర్థం చేసుకోవచ్చు . ఒకానొక సందర్భంలో ఎన్టీఆర్ కూడా ఇదే విషయంపై ఓపెన్ అయ్యారు..” నేను వెట్రిమారన్ తో సినిమా చేయడానికి ఈగర్ గా ఎదురు చూస్తున్నాను” అంటూ తన మనసులో మాటగా చెప్పుకొచ్చారు కూడా.. మరి ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి వెట్రిమారన్ కథ సిద్ధం చేస్తున్నారా? లేదా? అన్నదే ప్రశ్నార్ధకంగా మారింది.
సినిమాను తలపిస్తున్న వెట్రిమారన్ లవ్ స్టోరీ..
ఇకపోతే ‘వడచెన్నై’,’విడుదలై’, ‘అసురన్’, ‘విసురనై’ ఇలా చెప్పుకుంటూ పోతే పలు చిత్రాలకు దర్శకత్వం వహించిన ఈయన ఫ్యామిలీ లైఫ్ మాత్రం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ముఖ్యంగా ఈయన లవ్ స్టోరీ ఒక సినిమాను తలపిస్తోందని చెప్పవచ్చు. వెట్రిమారన్ లవ్ స్టోరీ విషయానికి వస్తే కాలేజీలో ఉన్నప్పుడే ఆర్తి అనే అమ్మాయిని ప్రేమించి, పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకి ఒక అమ్మాయి, అబ్బాయి కూడా ఉన్నారు.
అసలు విషయంలోకి వెళ్తే వెట్రిమారన్ – ఆర్తి చెన్నై లయోలా కాలేజీలో చదువుకున్నారు. స్నేహితులుగా పరిచయమైన వీరు ప్రేమికులుగా మారారు . ఆ తర్వాత కాలంలో పెళ్లి చేసుకుందామని ఆర్తి అడిగినప్పుడు పదేళ్ల సమయం పడుతుందని అన్నారట. ఇక తనకు సినిమాలు చేయాలని ఉందని , సినిమాలు చేశాకే పెళ్లి చేసుకుంటానని కూడా చెప్పారట.
also read: Fatima Sana Shaikh: నా మాటలను వక్రీకరించారు.. క్యాస్టింగ్ కౌచ్ కామెంట్స్ పై దంగల్ బ్యూటీ ఆవేదన!
నిజాలు చెప్పిన వెట్రిమారన్..ఆర్తి తండ్రి ఏం చేశారంటే?
అలా జరిగిన ఎనిమిదేళ్ల తర్వాత వీళ్ళిద్దరూ ఒక్కటయ్యారు. ఇక ఇదే విషయంపై ఆర్తి మాట్లాడుతూ.. “నేను , వెట్రిమారన్ ప్రేమించుకునేప్పుడు మా తల్లిదండ్రులు ఒప్పుకుంటారా? అనే టెన్షన్ ఎక్కువగా ఉండేది. ఎందుకంటే అమ్మానాన్నలు పాతకాలపు మనుషులు కావడంతో ప్రేమ పెళ్లికి అంగీకరిస్తారా? అనే అయోమయంలో పడిపోయాము. ఆ తర్వాత ఏం చేయాలో తెలియక మా తండ్రి దగ్గరకి వెట్రి మారన్ వచ్చి.. తన గురించి నిజాలన్నీ ఆయనతో చెప్పేసారు.”నేను బాగా సిగరెట్లు తాగుతాను.సినిమా డైరెక్షన్ చేస్తాను. సినిమాల్లోనే ఉంటాను.. మీ అమ్మాయిని మా ఇంటికి కోడలిగా పంపిస్తే చాలు.. మాకు ఇంకేం వద్దు” అని అన్నారు. ఇక దాంతో మా నాన్న మొదట ఆశ్చర్యపోయినా.. తనలో ఉన్న నిజాయితీని చూసి మరో ఆలోచన లేకుండా నన్ను ఇచ్చి పెళ్లి చేశారు” అంటూ ఆర్తి తెలిపారు.
ఇకపోతే వెట్రిమారన్ పెద్ద డైరెక్టర్ గా కోట్లు సంపాదించినా.. తాను మాత్రం తన భర్త సంపాదన పై ఆధారపడకుండా ఉద్యోగం చేస్తున్నట్లు ఆర్తి తెలిపింది. మొత్తానికి అయితే ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన ఈ జంట లవ్ స్టోరీ ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.