భారతీయ విమానయాన రంగం గత 20 సంవత్సరాలుగా అద్భుతమైన ప్రగతి సాధిస్తోంది. గతంలో కంటే ఎక్కువ మంది ప్రజలు విమానంలో ప్రయాణిస్తున్నారు. అయితే, విమాన ప్రమాదాలు అసాధారమైనప్పటికీ, కొన్ని విమానయాన సంస్థలకు చెందిన విమానాలు తరచుగా ప్రమాదాలకు గురవుతున్నాయి. ఏ భారతీయ విమానయాన సంస్థ అత్యధిక ప్రమాదాల చరిత్రలను కలిగి ఉంది? ఏ విమానయాన సంస్థ తక్కువ ప్రమాదాలు చరిత్రను కలిగి ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.
⦿ ఎయిర్ ఇండియా
దేశంలో అత్యంత పురాతన విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా. ఏడు దశాబ్దాలుగా ప్రయాణీకులకు సేవలను అందిస్తుంది. భారత్ లో ఇదే విమానయాన సంస్థ అత్యధిక ప్రమాదాలను చవిచూసింది. వాటిలో కొన్ని పెద్ద ప్రమాదాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా 1970, 2000లో ప్రమాదాలు జరిగాయి. 2020 కోజికోడ్ ప్రమాదంలో 21 మంది ప్రయాణీకులు ప్రాణాలు కోల్పోయారు. స్వదేశానికి తిరిగి వచ్చే విమానం రన్‌వేను ఢీకొట్టడంతో ఈ ఘటన జరిగింది. తాజాగా అహ్మదాబాద్ లో జరిగిన ప్రమాదంలో 242 మంది చనిపోయారు. ప్రమాదాల సంఖ్య ఎక్కువ అయినప్పటికీ భద్రతా వ్యవస్థలను గణనీయంగా మెరుగుపరిచింది.
⦿ ఇండిగో
ప్రస్తుతం ఇండియాలో ఇండిగో అద్భుతమైన భద్రతా రికార్డును కలిగి ఉంది. 2006లో కార్యకలాపాలు ప్రారంభించినప్పటి నుండి ఎటువంటి ప్రాణ నష్టం జరిగలేదు. అత్యవసర ల్యాండింగ్ కు కారణమైన కొన్ని చిన్న సాంకేతిక సమస్యలు ఉన్నప్పటికీ, ఒక్క ప్రయాణీకుడు కూడా ప్రయాణాలు కోల్పోయిన చరిత్ర లేదు. అద్భుతమైన భద్రతా రికార్డు సరైన నిర్వహణ పద్ధతులు పాటించడం వల్లే సాధ్యం అవుతుందని ఇండిగో తెలిపింది.
⦿ అకాశా ఎయిర్, విస్తారా
ఆకాశా, విస్తారా లాంటి కొత్త సంస్థలు కూడా ఇప్పటి వరకు ఎలాంటి ప్రమాదాలకు గురి కాలేదు. ఆకాశా ఎయిర్ అనుభవజ్ఞులైన సిబ్బందితో రన్ అవుతుంది. ఆధునిక విమానాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. అభివృద్ధి చెందుతున్న విమానయాన రంగంలో భాగంగా ప్రపంచ భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా నడుస్తున్నది .
Read Also: దేశంలోనే పొడవైన డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్.. విశాఖ మెట్రో ప్రత్యేకతే వేరు!
ప్రమాదాల ముప్పు లేకుండా జాగ్రత్తలు
ప్రపంచవ్యాప్తంగా విమానయాన సంస్థలు రోజు రోజుకు అప్ డేట్ అవుతున్నాయి. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా, తగిన ప్రొటోకాల్ పాటిస్తున్నారు. దేశంలో ఇప్పుడు ప్రపంచ విమానయాన భద్రతా నిబంధనలు పకడ్భందీగా అమలు అవుతున్నాయి. ఇండిగో లాంటి కంపెనీలు భద్రతకు అత్యధిక ప్రాధాన్యతను ఇస్తున్నాయి. దేశంలోని మునుపటి లెగసీ క్యారియర్లు కూడా తమ భద్రతా ప్రొఫైల్‌లను నిరంతరం అప్‌గ్రేడ్ చేయడానికి తీవ్రంగా కృషి చేస్తున్నాయి. సురక్షితమైన కార్యాచరణ కోసం ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతున్నాయి. ప్రయాణీకులకు ఎలాంటి హాని కలగకుండా ఉండేందుకు తగిన చర్యలు చేపడుతున్నాయి. తాజాగా అహ్మదాబాద్ విమాన ప్రమాదంతో అన్ని విమానయాన సంస్థలు తమ భద్రతా చర్యలను పున:సమీక్షించుకుంటున్నాయి. అవసరమైన అన్ని భద్రతా ప్రమాణాలను పాటిస్తున్నాయి. సురక్షితమై ప్రయాణ అనుభవాన్ని అందించేందుకు ప్రయత్నిస్తున్నాయి.
Read Also: విమానంలో ఇంధన ట్యాంక్ ఎక్కడ ఉంటుంది? ఎమర్జెన్సీ టైమ్ లో ఏం చేస్తారు?