BigTV English

Trisha: క్రైమ్ థ్రిల్లర్ సిరీస్, ఎప్పుడు, ఎక్కడంటే..?

Trisha: క్రైమ్ థ్రిల్లర్ సిరీస్, ఎప్పుడు, ఎక్కడంటే..?

Trisha Webseries Brinda To Stream On Sony Live Ott August 2: అందాల భామ 4 పదుల వయసులోనూ తగ్గేదేలే అంటోంది హీరోయిన్ త్రిష. ఇప్పటికి తన అందంతో కుర్రకారు మతిపోగొడుతోంది. తాజాగా త్రిష యాక్ట్‌ చేసిన మొదటి వెబ్ సిరీస్ బృంద. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ సోనీ లివ్‌లో ఆగస్టు 2న బృంద వెబ్‌సీరీస్‌ రిలీజ్‌ కానుంది. తెలుగు, తమిళ్‌, కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాలీ, హిందీలో ఈ సీరీస్‌ రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా ఈ వెబ్‌ సీరీస్‌ రచయిత, దర్శకుడు సూర్య మనోజ్‌ వంగాల మాట్లాడుతూ సోనీ లివ్‌ ద్వారా పాన్‌ ఇండియా ఆడియన్స్‌ని బృంద సీరీస్‌తో పలకరించడానికి నాకు థ్రిల్‌గా ఉంది. బృంద ఆద్యంతం సస్పెన్స్‌తో సాగుతోంది.


అనూహ్యమైన మలుపులు తిరుగుతూ ఆడియెన్స్‌ని ఆధ్యంతం ఉత్కంఠ రేకెత్తిస్తాయి. ఈ సీరీస్‌ చూస్తున్నంత సేపు తాము అప్పటిదాకా నమ్ముతున్న నమ్మకాల మీద కూడా ఫోకస్‌ పెరుగుతుంది. ఈ సీరీస్‌ని డైరెక్ట్ చేయడం నాకు ఎంతో ఆనందదాయకమని ఆయన అన్నారు. స్టోరీకి అనుగుణంగా బృంద పాత్రలో లేయర్స్‌ని జనాలు ఎంజాయ్ చేస్తారు. త్రిషతో వర్క్‌ చేయడం చాలా ఆనందంగా అనిపించింది. ఇప్పటిదాకా ఈ జోనర్‌లో వచ్చిన సినిమాలకు సరికొత్త నిర్వచనం చెప్పేలా ఉంటుందని అన్నారు. ఇక ఈ సిరీస్‌లో త్రిష రోల్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. తన కెరీర్‌ ముగిసిపోయిందనుకున్న సమయంలో, వెలుగు రేఖలా కనిపించింది ఆమె. అదెలా సాధ్యమైంది. చెడు మీద మంచి సాధించిన విజయాన్ని ఆస్వాదించాలంటే మీరు రెడీగా ఉండాల్సిందే.

Also Read: భారతీయుడు -2 టీమ్ కు సీఎం రేవంత్ అభినందనలు.. X లో పోస్ట్


సూర్య మనోజ్‌ వంగాలా ఈ వెబ్‌సిరీస్‌కి రైటర్‌గా, ఎంతో థ్రిల్లింగ్‌గా డైరెక్ట్ చేసిన సీరీస్‌ బృంద. టాలెంటెడ్‌ సౌత్‌ క్వీన్‌ త్రిష కృష్ణన్‌ ఈ సీరీస్‌తోనే ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. సూర్య మనోజ్‌ వంగాలా, పద్మావతి మల్లాది కలిసి రూపొందించిన స్క్రీన్‌ప్లే ఈ సీరీస్‌కి హైలైట్‌ కానుంది. శక్తికాంత్‌ కార్తిక్‌ బాణీలు అందించారు. దినేష్‌ కె బాబు సినిమాటోగ్రఫీ ఈ సీరీస్‌కి హైలైట్‌ కానుంది. అన్వర్‌ అలీ ఎడిటింగ్‌ గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. సీరీస్‌ చూసిన అందరూ ప్రస్తావిస్తారనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తోంది ఈ మూవీ టీమ్‌. ఈ మూవీలో ప్రముఖ నటీనటులు ఈ సీరీస్‌లో కీరోల్స్ పోశిస్తున్నారు. డ్రామా, క్రైమ్‌, మిస్టరీ అంశాలతో… చూసినంత సేపూ ఒళ్లు గగుర్పొడిచేలా ఈ మూవీ కొనసాగుతుంది. ప్రతి సెకన్‌ ఉత్కంఠ రేపే ఈ క్రైమ్‌ థ్రిల్లర్‌ని చూడాలనుకుంటే ఆగస్టు 2 వరకు వేచి చూడకతప్పదు. ఈ వెబ్‌సిరీస్‌ సోనీ లివ్‌లో అందుబాటులో ఉంటుంది.

Tags

Related News

Big TV kissik talks : స్టేజ్ పై అమ్మాయిలతో పండు అలా.. అడ్డంగా పరువుతీసేసిన వర్ష…

Big TV kissik talks : శేఖర్ మాస్టర్ అలాంటి వాడే.. షాకింగ్ విషయాలను బయట పెట్టిన పండు..!

The Big Folk Night 2025 : జానపదంతో దద్దరిల్లిన ఎల్బీ స్టేడియం.. ఘనంగా బిగ్ టీవీ ఫోక్ నైట్

The Big Folk Night 2025 : ఎల్బీ స్టేడియంలో జానపదాల ఝల్లు.. ‘బిగ్ టీవీ’ ఆధ్వర్యంలో లైవ్ ఫోక్ మ్యూజికల్ నైట్ నేడే!

Social Look: నీటి చినుకుల్లో తడిచి ముద్దయిన దీప్తి.. రాయల్ లుక్‌లో కావ్య.. బికినీలో ప్రగ్యా!

Jr NTR controversy: జూనియర్ ఎన్టీఆర్‌పై టీడీపీ ఎమ్మెల్యే కామెంట్స్.. నారా రోహిత్ స్పందన ఇదే!

Big Stories

×