BigTV English

PM Modi-Zelenskyy| ‘శాంతి ప్రయత్నాలకు భంగం’.. ప్రధాని మోదీ రష్యా పర్యటనపై మండిపడిన జెలెన్ స్కీ..

PM Modi-Zelenskyy| భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. రెండు రోజుల రష్యా పర్యటనకు వెళ్లారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ లో మోదీ స్నేహపూర్వక చర్చలు జరపడంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ మండిపడ్డారు. ”భారత ప్రధాని రష్యాతో చర్చలు చేయడం.. చాలా నిరాశజనకమైన విషయం.. యుద్ధం ఆపాలని.. మేము చేస్తున్న శాంతి ప్రయత్నాలకు భంగం కలిగింది” అని అన్నారు.

PM Modi-Zelenskyy| ‘శాంతి ప్రయత్నాలకు భంగం’.. ప్రధాని మోదీ రష్యా పర్యటనపై మండిపడిన జెలెన్ స్కీ..

Zelenskyy on Modi Russia tour(International news in telugu): భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. రెండు రోజుల రష్యా పర్యటనకు వెళ్లారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ లో మోదీ స్నేహపూర్వక చర్చలు జరపడంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ మండిపడ్డారు. ”భారత ప్రధాని రష్యాతో చర్చలు చేయడం.. చాలా నిరాశజనకమైన విషయం.. యుద్ధం ఆపాలని.. మేము చేస్తున్న శాంతి ప్రయత్నాలకు భంగం కలిగింది” అని అన్నారు.


2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మొదలుపెట్టిన తరువాత భారత ప్రధాని రష్యాకు పర్యటనకు వెళ్లడం ఇదే తొలిసారి. ప్రధాని మోదీ.. రష్యా రాజధాని మాస్కోలో ప్రెసిడెంట్ పుతిన్ తో అనధికారిక సమావేశం నిర్వహించడంతో ఉక్రెయిన్, పాశ్చాత్య దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ఇటీవల ఉక్రెయిన్ రాజధాని క్యీవ్ లోని పిల్లల ఆసుపత్రిపై రష్యా క్షిపణి దాడి చేయడంతో భారీ పేలుడు సంభవించింది. కనీసం 24 మంది చనిపోయారు.

Also Read: J&K Kathua terror attack| ‘ప్రతీకారం తీర్చుకుంటాం’.. కఠువా ఉగ్రదాడిపై కేంద్రం


గత నెలలో G7 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ప్రధాని మోదీని కలిసిన జెలెన్ స్కీ.. రష్యా పర్యటనపై స్పందిస్తూ.. ట్విట్టర్ లో పోస్టు పెట్టారు. “ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య నాయకుడు(మోదీ) ప్రపంచంలోని అత్యంత రక్తపాతం కోరుకునే వ్యక్తి, కిరాతకుడు, ఒక క్రిమినల్(పుతిన్)ని కౌగిలించుకోవడం చాలా నిరాశ కలిగించింది. మేము చేసే శాంతి ప్రయత్నాలకు ఇది ఒక వినాశకరమైన దెబ్బ..” అని రాశారు.

నిన్న రష్యా అధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ ఆయనను కౌగిలించుకున్నారు. ఆ తరువాత పుతిన్ కు చెందిన విశాలమైన ఎస్టేట్ లో గోల్ఫ్ కార్ట్‌లో తిరిగారు. ఉక్రెయిన్ యుద్ధం పరిష్కరించేందుకు శాంతియుతంగ చర్చలు జరపాలని పుతిన్ లో ప్రధాని మోదీ విశ్వసనీయ సమాచారం.

ఉక్రెయిన్ కు మద్దతుగా ఉన్న అమెరికా.. భారతదేశానికి ఐక్యరాజ్యసమితి నియమాలను పాటించాలని, ఉక్రెయిన్ సార్వభౌమత్వాన్ని గౌరవించాలని గుర్తుచేసింది.

Also Read: Alcohol Distributed at BJP MP’s Party: ఉచితంగా మద్యం పంపిణీ.. ఎక్కడంటే..?

ఉక్రెయిన్‌లో రష్యా దాడులు 41 మంది మృతి
ఉక్రెయిన్ నగరాలలో సోమవారం 40 కంటే ఎక్కువ రష్యా క్షిపణులు విధ్వంసం సృష్టించాయి. దేశంలోని అతిపెద్ద పిల్లల ఆసుపత్రి, ఇతర భవనాలను ధ్వంసం చేశాయి. దీంతో గుండె శస్త్రచికిత్సలకు అంతరాయం కలిగింది. ఆస్పత్రి నాశనం కావడంతో క్యాన్సర్ రోగులకు డాక్టర్లు ఆరుబయట చికిత్స అందిస్తున్నారు. ఈ దాడులలో ఉక్రెయిన్ లో కనీసం 41 మంది మరణించారని అధికారులు తెలిపారు.

గత నాలుగు నెలల్లో క్యీవ్ పై రష్యా చేసిన అతిపెద్ద బాంబు దాడి ఇది.

Also Read: Mihir Shah Hit-and-Run Case| కారు ప్రమాదం తరువాత కొనఊపిరితో ఉన్న మహిళ హత్య.. డ్రైవర్ కూడా నిందితుడే!

 

Related News

Kartarpur Corridor: పొంగిన రావి నది.. మునిగిన కర్తార్‌పూర్ కారిడార్.. నీటిలో వందలాది మంది

Minneapolis shooting: మినియాపొలిస్‌లో రక్తపాతం.. చర్చి స్కూల్‌పై రైఫిల్ దాడి.. అసలేం జరిగిందంటే?

Trump Statement: భారత్, పాక్ కి నేనే వార్నింగ్ ఇచ్చా.. మరింత గట్టిగా ట్రంప్ సెల్ఫ్ డబ్బా

Trump’s Tariff War: ట్రంప్ టారిఫ్ స్టార్ట్! భారత్‌కు కలిగే నష్టాలు ఇవే..

India Vs America: అమెరికాతో ఢీ అంటే ఢీ.. ట్రంప్ సుంకాల్ని వెనుక వ్యూహమేంటి?

India-China: సుంకాల యుద్ధం.. చైనాతో భారత్ సయోధ్యకు ప్రయత్నం

Big Stories

×