E-Paper
Advertisement

Railway Allocation: రైల్వే బడ్జెట్‌లో ఏపీ, తెలంగాణకు దక్కినవి ఇవే..

Railway Allocation: రైల్వే బడ్జెట్‌లో ఏపీ, తెలంగాణకు దక్కినవి ఇవే..
Advertisement

Railway Budget Allocation 2025-26: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో రైల్వేలకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యాయి. ఉభయ రాష్ట్రాల్లో చేపట్టబోయే రైల్వే ప్రాజెక్టులు, కేటాంచించిన బడ్జెట్ ఎంతో ఇప్పుడు తెలుసుకుందాం..

ఏపీకి రైల్వే బడ్జెట్ కేటాయింపులు

Advertisement

⦿ ఏపీకి 2025-26కు గాను ఏకంగా రూ.9,417 కోట్లు కేటాయించారు. 2009 నుంచి 2014 వరకు ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన రైల్వే ప్రాజెక్టులకు రూ. 886 కోట్లు మాత్రమే కేటాయించారు. గతంతో పోల్చితే 11 రెట్లు ఎక్కువగా కేటాయింపు చేశారు.

⦿ 2009-14 వరకు ఏపీలో 73 కొత్త రైల్వే ట్రాక్ లు నిర్మించగా.. 2014-25 వరకు 142 కొత్త ట్రాక్ లు నిర్మించారు. గతంతో పోల్చితే రెండు రెట్లు ఎక్కువగా నిర్మించారు.

Advertisement

⦿ 2009-14 వరకు ఏడాదికి 37 కిలో మీటర్ల మేర విద్యుదీకరణ చేస్తే, 2014-25 వరకు ఏడాదికి 177 కిలో మీటర్ల చేశారు. గతంతో పోల్చితే 5 రెట్లు ఎక్కువగా చేశారు.

⦿ 2014 నుంచి 1,560 కిలో మీటర్ల మేర కొత్త ట్రాక్ లను నిర్మించారు. ఈ రైల్వే లైన్లు మొత్తం శ్రీలంక రైల్వే లైన్ల కంటే ఎక్కువ కావడం విశేషం.

⦿ విద్యుదీకరణకు విషయానికి వస్తే 2014 నుంచి 1,949 కిలో మీటర్ల మేర ఎలక్ట్రిఫికేషన్ చేశారు. ప్రస్తుతం ఏపీలో 100 శాతం విద్యుదీకరణ ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది.

⦿ ప్రస్తుతం ఏపీలో కొత్త ట్రాక్ లకు సంబంధించి 43 ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి. 5,560 కిలో మీటర్ల మేర నిర్మించనున్నారు. వీటికి రూ. 80,097 కోట్లు అవసరం అవుతాయని అంచనా.

⦿ అమృత్ స్టేషన్స్ లో భాగంగా ఏపీలో 73 రైల్వే స్టేషన్లను రూ. 2,051 కోట్లతో డెవలప్ డెవలప్ చేసినట్లు వెల్లడించారు.

⦿ కవచ్ వ్యవస్థను మొత్తం 2,981 కిలో మీటర్ల మేర ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. ఇందులో 1,700 టెండర్ ప్రక్రియ కొనసాగుతుండగా, 130 కిలో మీటర్ల పరిధిలో కొనసాగుతున్నది.

⦿ 2014 నుంచి ఏపీలో 770 రైల్వే ప్లైఓవర్స్, అండర్ బ్రిడ్జిలను నిర్మించారు.

⦿ ఏపీలో ప్రస్తుతం 8 వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి. ఇవి మొత్తం 15 జిల్లాలను కవర్ చేస్తున్నాయి.

⦿ ఇక ఓ అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ పరుగులు తీస్తున్నది.  మాల్దా-బెంగళూరు మధ్య నడిచే ఈ రైలు ఏపీలోని మొత్తం 9 జిల్లాలను కవర్ చేస్తున్నది.

రైల్వే బడ్జెట్‌లో తెలంగాణకు కేటాయింపులు

⦿ రైల్వే బడ్జెట్‌ లో తెలంగాణకు రూ.5337 కోట్లు కేటాయించారు. 2009-14 వరకు ఉభయ తెలంగాణకు రూ. 886 కోట్లు కేటాయించగా.. ఈసారి తెలంగాణ ఏకంగా 6 రెట్లు ఎక్కువగా కేటాయించారు.

⦿ తెలంగాణలో 2009-14 వరకు ఏడాదికి 17 కిలో మీటర్ల చొప్పున నిర్మించగా, 2014-25లో ఏడాదికి 68 కిలో మీటర్ల మేర నిర్మించారు. అంటే, గతంతో పోల్చితే నాలుగు రెట్లు ఎక్కువగా నిర్మించారు.

⦿ 2009-14 వరకు ఏడాదికి సగటున 41 కిలో మీటర్ల మేర విద్యుదీకరణ చేస్తే, 2014-25 వరకు సగటున ఏడాదికి 100 కిలో మీటర్ల మేర.. 1,096 కిలో మీటర్లు నిర్మించారు. ప్రస్తుతం తెలంగాణలో 100 శాతం విద్యుదీకరణ ఉన్నది.

⦿ 2014 నుంచి తెలంగాణలో 753 కిలో మీటర్ల మేర కొత్త ట్రాక్ లు నిర్మించారు. ఇవి మొత్తం యుఏఈలో రైల్వే నెట్ వర్క్ తో సమానం.

⦿ తెలంగాణలో కొత్త ట్రాక్ లకు సంబంధంచి 22 ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి. మొత్తం 2,529 కిలో మీటర్ల మేర 39,300 కోట్ల అంచనా వ్యయంతో కొనసాగుతున్నాయి.

⦿ అమృత్ స్టేషన్స్ లో భాగంగా మొత్తం 40 స్టేషన్లను రూ.1,992 కోట్లతో డెవలప్ చేసినట్లు వెల్లడించారు.

⦿ తెలంగాణ వ్యాప్తంగా 1,326 కిలో మీటర్ల మేర కవచ్ వ్యవస్థను నిర్మించాలని భావించగా, 627 కిలో మీటర్ల మేర నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. 1,011 కిలో మీటర్ల మేర  టెండర్ ప్రక్రియ కొనసాగుతుంది.

⦿ 2014 నుంచి తెలంగాణలో 453 ఫ్లైఓవర్లు, అండర్ బ్రిడ్జిలను నిర్మించారు.

⦿ తెలంగాణలో ప్రస్తుతం 5 వందేభారత్ రైళ్లు నడుస్తుండగా, 7 జిల్లాలను కవర్ చేస్తున్నాయి.

⦿ త్వరలో తెలంగాణ నమో భారత్, అమృత్ భారత్ రైళ్లు రానున్నాయి.

⦿ కాజీపేటలో రైల్వే ప్రొడక్షన్ యూనిట్ ను ఏర్పాటు చేయనున్నట్లు రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.

Read Also: దేశంలో అత్యంత రద్దీ రైల్వే స్టేషన్లు.. ఒక్కో స్టేషన్ నుంచి ఎన్ని రైళ్లు రాకపోకలు కొనసాగిస్తాయంటే?

Related News

ట్రెక్కింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా? దేశంలో సురక్షితమైన 7 అద్భుతమైన ట్రెక్కింగ్ ప్రాంతాలివే

ఈ తప్పులు చేస్తే తిరుమలలో రూమ్ దొరకదు.. టీటీడీ కొత్త గైడ్‌లైన్స్ ఇవే!

చివరి నిమిషంలోనూ కన్ఫర్మ్ సీట్.. రైల్వేలో సీక్రెట్ రూల్ గురించి తెలుసా?

12 రోజుల ఆధ్యాత్మిక యాత్ర.. అదీ EMIలో.. IRCTC ప్యాకేజ్ అదిరింది భయ్యా!

నల్లగొండ జిల్లాలో దాగిన ఉన్న అద్భుతాలు.. ఒక్కో చోట ఒక్కో విశేషం!

దుబాయ్ 5 ఏళ్ల మల్టిపుల్ ఎంట్రీ విజిట్ వీసా.. తక్కువ ధరలోనే.. భారతీయులకు అర్హత వివరాలు

హోటళ్లలో చెక్ ఇన్.. చెక్ అవుట్ ఆ సమయాల్లో ఎందుకు? దీని వెనుక అసలు కారణాలివే?

తాజ్ మహల్ కింద ఉన్న ఆ 22 గదులను ఎందుకు తెరవరు? నిజంగానే అక్కడ నిధులు, విగ్రహాలు ఉన్నాయా?

Big Stories

Advertisement
×