BigTV English

Poonam Kaur: త్రివిక్రమ్ వేధించింది.. పవన్ కోసమా.. ?

Poonam Kaur: త్రివిక్రమ్ వేధించింది.. పవన్ కోసమా.. ?

Poonam Kaur: జానీ మాస్టర్  కేసు ఏమో కానీ, ప్రస్తుతం ఈ లైంగిక వేధింపుల రచ్చ అటు తిరిగి.. ఇటు తిరిగి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మెడకు బిగుసుకొనేలా కనిపిస్తుంది. మొదటి నుంచి కూడా డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, పవన్ కళ్యాణ్ లపై నటి పూనమ్ కౌర్ సోషల్ మీడియాలో విరుచుకు పడుతూనే ఉంటుంది. ఏ ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల కేసు నమోదు అయినా.. తెలుగు రాష్ట్రాల్లో రేప్ కేసులు సెన్సేషన్ సృష్టించినా.. పూనమ్ ట్విట్టర్ ద్వారా ఆ వివాదం గురించి మాట్లాడుతూనే తాను కూడా గురూజీ వలన వేధింపబడిన బాధితురాలినే అని గుర్తుచేస్తూ ఉంటుంది.


వేరే వేరే భాషల్లో జరిగిన  ఘటనలనే  వదలని పూనమ్.. టాలీవుడ్ లో జరిగితే ఆగుతుందా.. ? ఈసారి ఏకంగా గురూజీ పేరును సైతం బయటపెడుతూ గుట్టురట్టు చేసింది.  డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తనను వేధించాడని, దానిపై  మా అసోసియేషన్ లో ఫిర్యాదు చేస్తే వారు స్వీకరించలేదని చెప్పుకొస్తూనే.. ఇప్పుడైనా  త్రివిక్రమ్ ను ప్రశ్నించమని కోరింది. ఇక పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ గురించి నెటిజన్స్ ఆరాలు తీయడం మొదలుపెట్టారు.

Pooja Hegde: బుల్లి గౌను వేసుకున్నపెద్ద పాప.. వైట్ డ్రెస్సులో పూజాహెగ్డే అందాలు


అసలు అప్పుడు ఏం జరిగింది.. ? త్రివిక్రమ్.. పూనమ్ ను వేధించడానికి కారణం ఎవరు.. ? అని చర్చిస్తున్నారు. తాజాగా  ఈ విషయమై ఒక టాలీవుడ్ నిర్మాత మాట్లాడిన ఒక ఓల్డ్ ఇంటర్వ్యూను  నెటిజన్స్ వైరల్ చేస్తున్నారు. ఆ వీడియోలో సదురు నిర్మాత మాట్లాడుతూ.. ” పూనమ్ కౌర్ ను వేధించింది త్రివిక్రమ్ నే అయినా..  అతని వెనుక ఉన్నది పవన్ కళ్యాణ్.  పవన్ కోసమే  త్రివిక్రమ్ పూనమ్ ను వేధించాడు” అని చెప్పుకొచ్చాడు.

ఇక దీంతో పవన్ పై కూడా లైంగిక వేధింపుల మరక పడింది. అసలు ఇదంతా ఎక్కడ మొదలయ్యింది అంటే.. జల్సా సినిమాలో పవన్ సరసన సెకండ్ హీరోయిన్ గా మొదట త్రివిక్రమ్, పూనమ్ ను ఎంపిక చేసాడట. ఆ తరువాత  ఆమె ప్లేస్ లో పార్వతి మెల్టన్ ను తీసుకున్నారట. ఈ విషయమై  పూనమ్ కు త్రివిక్రమ్ కు గొడవ అయ్యిందని టాక్.

Nabha Natesh: పింక్ టాప్, సింపుల్ స్మైల్.. ఆహా అనిపిస్తున్న నభా అందం

ఆ తరువాత పవన్ – పూనమ్ రిలేషన్ లో ఉన్నారని, వారిని విడదీసింది త్రివిక్రమ్ అని చెప్తున్నారు. అందుకే పూనమ్.. త్రివిక్రమ్ పై పగ పెంచుకుందని టాలీవుడ్ ఇండస్ట్రీలో మాట్లాడుకుంటున్నారు. ఇక ఎలాగో బయటకు వచ్చింది.. అసలు అప్పుడు ఏం జరిగింది అనేది కూడా  స్పష్టంగా బయటపెట్టు పూనమ్ అని కొందరు చెప్పుకొస్తున్నారు. మరి ఇప్పటికైనా పూనమ్ కౌర్ తన బాధను బయటపెడుతుందా.. ? తమ్మారెడ్డి భరద్వాజ చెప్పినట్లు ఇప్పుడైనా వారిపై ఫిర్యాదు ఇస్తుందా.. ? అనేది  తెలియాల్సి ఉంది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×