BigTV English
Advertisement

Shekar Basha: మా ఆవిడ అలా తిట్టింది, వచ్చేవారం కచ్చితంగా ఎలిమినేట్ అయ్యేది తనే.. శేఖర్ భాషా వ్యాఖ్యలు

Shekar Basha: మా ఆవిడ అలా తిట్టింది, వచ్చేవారం కచ్చితంగా ఎలిమినేట్ అయ్యేది తనే.. శేఖర్ భాషా వ్యాఖ్యలు

Bigg Boss Shekar Basha: బిగ్ బాస్ సీజన్ 8 రెండోవారంలో ఎలిమినేట్ అయ్యి బయటికి వచ్చేశాడు శేఖర్ భాషా. కానీ అది ప్రేక్షకుల ఓటింగ్ వల్ల జరిగిన ఎలిమినేషన్ కాదు. డేంజర్ జోన్‌లో ఆదిత్య ఓం, శేఖర్ భాషా ఉండగా ఈసారి ఎలిమినేషన్ హౌజ్‌మేట్స్ చేతుల మీదుగా జరగనుందని ట్విస్ట్ ఇచ్చారు నాగార్జున. దీంతో శేఖర్ భాషాకు ఇంటికి వెళ్లిపోవాలనుందని, తన కొడుకును చూడాలని ఉందని ఫిక్స్ అయిన ఇతర హౌజ్‌మేట్స్.. తనను హౌజ్ నుండి బయటికి పంపించేశారు. కానీ ప్రేక్షకులు మాత్రం ఇప్పటికీ శేఖర్ భాషాను అన్యాయంగా ఎలిమినేట్ చేశారనే అనుకుంటున్నారు. ఇక బయటికి వచ్చేసిన శేఖర్ భాషా.. బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూలలో పాల్గొంటూ బిజీ అయ్యాడు.


రీఎంట్రీ ఫిక్స్

హౌజ్‌మేట్స్ అంతా కలిసి తనను అన్యాయంగా ఎలిమినేట్ చేశారని ప్రేక్షకులు అనుకుంటున్నా.. శేఖర్ భాషా మాత్రం ఈ ఎలిమినేషన్‌ను నవ్వుతూ యాక్సెప్ట్ చేశాడు. తనకు బిడ్డను చూడాలనే కోరిక ఉందని హౌజ్‌మేట్స్‌కు తెలిసింది కాబట్టే ప్రేమతో బయటికి పంపించారని అన్నాడు. ఇక బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూలలో పాల్గొంటున్న శేఖర్ భాషా.. బయటికి వచ్చిన తర్వాత పరిస్థితి గురించి వివరించాడు. తాను బిడ్డను చూడడానికి బయటికి వచ్చేస్తే తన భార్యే తనను తిట్టిందని, ఎందుకు వచ్చావని అన్నదని తెలిపాడు. మళ్లీ బిగ్ బాస్ నుండి పిలుపు వస్తే కచ్చితంగా వెళ్తానని హామీ ఇచ్చాడు. దీంతో ప్రేక్షకులు కూడా శేఖర్ భాషా రీఎంట్రీ ఇవ్వాలని కోరుకుంటున్నారు.


Also Read: మణికంఠను టార్గెట్ చేస్తున్న హౌజ్‌మేట్స్.. అప్పుడు యష్మీ, ఇప్పుడు ప్రేరణ.. ప్రశాంతంగా ఆడనివ్వరా?

తనే ఎలిమినేట్

బిగ్ బాస్ హౌజ్‌లో దాదాపు అందరితో సరదాగానే ఉండేవాడు శేఖర్ భాషా. కానీ కొందరు మాత్రం తన జోకులను చిరాకుగా ఫీల్ అయ్యేవారు. అయినా వారితో కూడా స్నేహంగానే ఉండడానికి ప్రయత్నించాడు. అందరికంటే ఆదిత్య ఓంతో ఎక్కువగా క్లోజ్‌గా ఉండేవాడు శేఖర్ భాషా. కానీ ఆదిత్య కూడా శేఖర్‌కు క్రమశిక్షణ లేదంటూ తనను నామినేట్ చేశాడు. దీంతో ఇప్పుడు శేఖర్ భాషా బయట ఉన్నాడు. కానీ తను కాకపోతే ఆదిత్య ఓం ఎలిమినేట్ అయ్యిండేవాడని అభిప్రాయం వ్యక్తం చేశాడు శేఖర్ భాషా. వచ్చేవారం అయినా కచ్చితంగా తనే ఎలిమినేట్ అవుతాడని గట్టిగా చెప్పాడు. ఎందుకంటే ఆదిత్య కంటే తనకే ఓట్లు ఎక్కువగా వచ్చాయని చెప్పారని కానీ హౌజ్‌మేట్స్ నిర్ణయం ప్రకారం తాను బయటికి వచ్చేశానని అన్నాడు.

జానీ మాస్టర్ కేసు

బిగ్ బాస్ హౌజ్‌లో ఫేక్‌గా ఉండే వ్యక్తులు ఎవరు అని అడగగా.. యష్మీ, సోనియా, మణికంఠ, ప్రేరణ పేర్లు చెప్పాడు శేఖర్ భాషా. అలా ఆడడం వారి స్ట్రాటజీ అయ్యిండవచ్చని అన్నాడు. ఇక తనకు చాలా ఇష్టమైన కంటెస్టెంట్ సీత అని, తను ఫైనల్స్‌కు వెళ్లాలని కోరుకుంటున్నానని అన్నాడు. విష్ణుప్రియా కూడా ఫైనల్స్‌కు వెళ్లే ఛాన్స్ ఉందని, కానీ తన ఎమోషన్స్ కంట్రోల్‌లో లేకపోతే బయటికి వచ్చేస్తుందని అన్నాడు. అయినా విష్ణుప్రియాకు బయటికి వచ్చే తెలివి కూడా లేదని నవ్వుతూ చెప్పాడు. ఇక జానీ మాస్టర్ కేసు గురించి స్పందించమని అడగగా తనకు ఆ కేసు గురించి ఇంకా పూర్తిగా తెలియదని సూటిగా చెప్పేశాడు శేఖర్ భాషా.

Related News

Bigg Boss 9: ఏడుపుగొట్టు చెత్తను బయటకు తోసేయండి, లైవ్ చూడలేకపోతున్నాం

Bigg Boss 9: ఇన్ సెక్యూరిటీ లోకి పోయి గేమ్ పాడు చేసుకుంటున్నా ఇమ్మానియేల్

Bigg Boss 9 Telugu Day 61 : రీతూ బంగారంరా… తనూజాపై అంత కక్షగట్టేశావ్ ఏంటి దివ్య? నక్కతోక తొక్కిన ఇమ్మూ

Bigg Boss 9 Telugu : ఇమ్మూనా మజాకా? బిగ్ బాస్ చరిత్రలోనే బిగ్గెస్ట్ రికార్డ్… కానీ ఆ బుర్ర తక్కువ పనే మైనస్ మావా

Bigg Boss 9: చివరిలో చేజారిన తనూజ కెప్టెన్సీ.. అతడే కొత్త కెప్టెన్!

Bigg Boss 9 Telugu : బిగ్ బాస్ లో ఉండటం ఆ కంటెస్టెంట్ కు ఇష్టం లేదా..? ఈ వారం ఇతనే ఎలిమినేట్..?

Bigg Boss 9 Promo: రీతూ Vs దివ్య.. చిచ్చుపెట్టిన సాయి!

Bigg Boss 9 Telugu : గౌరవ్ కు గట్టిదెబ్బ… ఇదేందయ్యా ఇదీ… కట్టప్ప కన్నా తనూజా – ఇమ్మాన్యుయేల్ వెన్నుపోటే దారుణం

Big Stories

×