Happy Birthday Trivikram Srinivas : ఆకెళ్ళ నాగ శ్రీనివాస్ శర్మ అంటే అందరికీ తెలియకపోవచ్చు. కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటే తెలియని వారు ఉండరు. రచయితగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన త్రివిక్రమ్ నేడు స్టార్ డైరెక్టర్ గా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచి పేరును సాధించుకున్నాడు. చాలామంది తాము దర్శకులు అయిన జర్నీని పలు సందర్భాల్లో చెబుతూ ఉంటారు. కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ తన కెరీర్ లో ఇలా చెప్పింది తక్కువ. చాలా చిన్న ఏజ్ లోనే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడు అవ్వాలని నిర్ణయించుకున్నాడు. తన తండ్రి ఉదయభాస్కర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎప్పుడు పీజీ చేయాలని కోరుకునేవాడు. అందుకోసమే ఎమ్మెస్సీ న్యూక్లియర్ ఫిజిక్స్ చేసి గోల్డ్ మెడల్ అందుకున్నాడు. వాస్తవానికి చదువు రాని వాళ్ళే సినిమా ఇండస్ట్రీలో ఏదో ఒక పని చేసుకుంటారు అనే నానుడిని చెరిపేసిన వ్యక్తులలో త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఒకరు.
త్రివిక్రమ్ ఎంఎస్సీ అయిపోయిన తర్వాత హైదరాబాద్ వచ్చి ట్యూషన్స్ చెప్పడం మొదలు పెట్టాడు. ఇకపోతే కమెడియన్ గౌతమ్ రాజు పిల్లలు కూడా త్రివిక్రమ్ దగ్గర ట్యూషన్ కి వచ్చేవాళ్ళు. ఆ తర్వాత అతని సహాయంతో మెల్లగా సినిమాల్లోకి వచ్చే ప్రయత్నం చేశాడు. త్రివిక్రమ్ తో పాటు సునీల్ కూడా ఉండేవాడు. వీళ్ళిద్దరి ఫ్రెండ్షిప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సునీల్ నటుడుగా చాలాచోట్ల ఆడిషన్స్ ఇస్తున్న తరుణంలోనే నా రూమ్ లో మంచి రైటర్ ఉన్నాడంటూ చెబుతూ ఉండేవాడు. కానీ అప్పుడు పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు.
Also Read : Sai Pallavi: ఆ హీరో ఫ్యాన్స్‌ను హర్ట్ చేసిన సాయి పల్లవి.. మరోసారి సోషల్ మీడియాలో రచ్చ
పోసాని కృష్ణ మురళి దగ్గర అసిస్టెంట్ రచయితగా చేరి తన ప్రతిభను నిరూపించుకున్నాడు. త్రివిక్రమ్ పోసాని కృష్ణ మురళికి ఫోన్ చేసినప్పుడు, నేను చెన్నైలో ఉన్నాను అని చెప్పగానే త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ గా చెన్నై వెళ్లిపోయి పోసాని కృష్ణ మురళి ను కలిసాడు. ఆ డెడికేషన్ నచ్చి త్రివిక్రమ్ ను తన దగ్గర శిష్యునిగా చేర్చుకున్నారు. త్రివిక్రమ్ స్వయంవరం అనే సినిమాకి రచయితగా పనిచేశాడు. ఆ సినిమా రిలీజ్ అవ్వగానే బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయింది. అక్కడ నుంచి మళ్లీ వెనక్కి తిరిగి చూసుకునే పరిస్థితి రాలేదు. వరుసగా హిట్ సినిమాలు రాస్తూ కెరియర్ లో ముందుకెళ్ళిపోయాడు త్రివిక్రమ్. పోస్టర్ పైన త్రివిక్రమ్ పేరు చూసి సినిమాకు వెళ్లే ఆడియన్స్ ను కూడా సాధించుకున్నాడు.
త్రివిక్రమ్ అనే పేరు ఒక బ్రాండ్ అయిపోయింది. ఎవరైనా ఒక మంచి మాట రాసిన కూడా త్రివిక్రమ్ లా రాస్తున్నావు అని చెప్పే స్థాయి వరకు ఎదిగాడు త్రివిక్రమ్. నువ్వే నువ్వే సినిమాతో దర్శకుడుగా కూడా ప్రయాణాన్ని మొదలుపెట్టి ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలను తెరకెక్కించాడు. ఫ్యామిలీ ఆడియన్స్ లో త్రివిక్రమ్ ఫ్యాన్ ఫాలోయింగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ఫ్యామిలీ అంతా కలిసి నిస్సంకోచంగా త్రివిక్రమ్ దర్శకత్వం వహించే సినిమాకి వెళ్లొచ్చు అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇలానే మరిన్ని హిట్ సినిమాలు తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి అందించాలని కోరుకుంటూ బిగ్ టీవీ తరపు నుంచి త్రివిక్రమ్ శ్రీనివాస్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు.