BigTV English

Bigg Boss Nikhil : బయట ఒకరు.. ఇంట్లో మరొకరు.. ఏంటయ్యా ఈ లీలా..

Bigg Boss Nikhil : బయట ఒకరు.. ఇంట్లో మరొకరు.. ఏంటయ్యా ఈ లీలా..

Bigg Boss 8 Telugu : టాప్ రియాలిటీ షో బిగ్ బాస్  తెలుగు సీజన్ 8 లో రోజుకో రచ్చ బయట పడుతుంది. గేమ్ షో ఆడటానికి వచ్చారా? లేక లవర్స్ ను వెతుక్కోవడానికి వచ్చారా? అనే ప్రశ్నలు కూడా ఆడియన్స్ కు రావడం సహజం. ప్రస్తుతం హౌస్ లో ఇదే జరుగుతుంది. ఇక పేరుకు మాత్రమే బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు. కానీ.. అక్కడంతా కన్నడ మయం. హోస్ట్ నాగార్జున తెలుగోడే అయినా తన సినిమాల్లో ఎలాగైతే తెలుగు వాళ్లని పక్కనపెట్టి,పక్క ఇండస్ట్రీని హీరోయిన్స్‌గా పెడతాడో అలాగే తెలుగు వాళ్లే లేరన్నట్టుగా తెలుగు బిగ్ బాస్‌లో సగానికి సగం మందిని కన్నడ వాళ్లని కంటెస్టెంట్స్‌గా పెట్టారు.. వీరంతా ఒక గ్రూప్ గా చేరి మిగిలిన వాళ్ళను టార్గెట్ చేస్తున్నారు. ఈ హౌస్ లో కంటెస్టెంట్ గా ఉన్న నిఖిల్ కొన్ని వారాలు బాగానే ఉన్నా ఇప్పుడు ఈ సీజన్ విన్నర్ అవ్వాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో నిఖిల్ గురించి సోషల్ మీడియాలో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి చక్కర్లు కొడుతుంది.


సీరియల్ యాక్టర్ నిఖిల్ బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వక ముందు కావ్య అనే సీరియల్ హీరోయిన్ తో ప్రేమాయణం కొనసాగించాడు. అయితే హౌస్‌లోకి వెళ్లిన తరువాత.. తన లవ్ బ్రేకప్ అయ్యిందని.. డిప్రెషన్‌లో ఉన్నానని నమ్మబలికి.. సోనియా ఆకులను ట్రాప్ చేశాడు. ఆమె హౌస్ మేట్స్ పై విరుచుకు పడటం చూసి, గొడవల కన్నా ప్రేమగా ఉంటే బాగుంటుందని పులిహోర కలిపాడు.. నిఖిల్‌-సోనియాల పత్తేపారాన్ని జనం అసహ్యించుకోవడంతో.. సోనియా ఎలిమినేట్ అయిపోయింది. ఒకరకంగా చెప్పాలంటే.. సోనియాకి అంత నెగిటివిటీతో ఎలిమినేట్ అయ్యిందంటే నిఖిల్ వల్లే అని చెప్పాలి.. ఇక సోనియా ఎలిమినేట్ అవ్వగానే ఇప్పుడు యష్మీకి దగ్గరయ్యాడు.. ఇప్పుడు ఎవరికి ఎవరు సోఫ్ వేస్తున్నారో ఆడియన్స్ కు అర్థం కాలేదు. కానీ వీళ్ళ లవ్ ట్రాక్ ఆసక్తిగా ఉంది.

యష్మీకి నిఖిల్ కు చెప్పలేని ప్రేమ ఉంది. వీళ్ళను చూస్తే ఏదో జరుగుతుంది అనే సందేహం కూడా రావచ్చు. ఇక ఇదిలా ఉండగా హౌస్ లో ఎప్పుడు కావ్యతో బ్రేకప్ అయ్యిందనే బాధగానే.. ఆమె గురించి ప్రస్తావన కాని నిఖిల్ ఎప్పుడూ తీసుకురాలేదు. హౌస్ లో ఎవరు అడగలేదు. మరో షాకింగ్ విషయం ఏంటంటే.. అసలు కావ్యతో బ్రేకప్ కావడానికి నిఖిల్‌లే కారణం అనే విషయాన్ని చెప్పకనే చెప్పాడు. కావ్య ఉండగానే మరో అమ్మాయికి ప్రపోజ్ చేసాడట.. అది కావ్యకు తెలియడంతో నిఖిల్ ను దూరం పెట్టేసిందట.. ఇక బిగ్ బాస్ హౌస్ లో ఇప్పటికే చాలా ట్రాయాంగిల్ లవ్ స్టోరీస్ నడుస్తున్నాయి. మరి చివరి వరకు ఏ జంట ఉంటారో చూడాలి.. ఇక ఈ వారం హౌస్ నుంచి ఎవరు వెళ్తారో అన్నది ఆసక్తిగా మారింది. గత వారం హరితేజ తప్పించుకుంది. ఇక ఈ వారం కూడా ఈమె ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.. ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది తెలియాలంటే వీకెండ్ ఎపిసోడ్ ను మిస్ అవ్వకుండా చూడాలి..


Tags

Related News

Deepthi Sunaina: జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పిన దీప్తి సునైనా.. పెళ్లికి సిద్ధమైందా?

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Bigg Boss 9 Telugu: గొడవలు మాయం.. స్నేహం మాత్రం ఎప్పటికీ.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో!

Ariyana: సొంత ఇంటికల నెరవేర్చుకోబోతున్న అరియానా.. తెగ కష్టపడుతుందిగా?

Big Stories

×