Trivikram: ప్రస్తుతానికి పాన్ ఇండియా సినిమాల హవా నడుస్తుంది కాబట్టి త్రివిక్రమ్ ని ఒక స్టార్ డైరెక్టర్ గా గుర్తించడం తగ్గింది. కానీ ఒకప్పుడు స్టార్ డైరెక్టర్స్ ప్రస్తావన వస్తే మొదట వినిపించే పేర్లలో రాజమౌళి, త్రివిక్రమ్ పేర్లు ఉండేవి. ఒక సందర్భంలో వీళ్లిద్దరిలో ఎవరి గొప్ప అంటూ కూడా డిబేట్ మొదలైంది. బాహుబలి సినిమా తర్వాత రాజమౌళి స్థాయి అమాంతం పెరిగిపోయింది. అయితే కెరియర్ లో ఎక్కువ శాతం సినిమాలు త్రివిక్రమ్ స్టార్ హీరోలతో మాత్రమే చేయటం వలన త్రివిక్రమ్ స్టార్ డైరెక్టర్ గా కొంత కాలం పాటు చలామణి అయ్యారు. ఇప్పటికీ కూడా త్రివిక్రమ్ స్టార్ డైరెక్టర్ గా చెప్పుకోవచ్చు. త్వరలో కూడా త్రివిక్రమ్ పాన్ ఇండియా డైరెక్టర్ కానున్నారు. ఇక త్రివిక్రమ్ విషయానికి వస్తే ఆయన రాసిన డైలాగ్స్ ఎంత ఫేమస్ అని అందరికీ తెలిసిన విషయమే. అలానే త్రివిక్రమ్ స్పీచెస్ కూడా అద్భుతంగా అనిపిస్తాయి. త్రివిక్రమ్ మాట్లాడుతూ ఉంటే వినాలనిపిస్తూ ఉంటుంది.
త్రివిక్రమ్ స్పీచ్ క్రేజ్
కొన్ని సందర్భాలలో త్రివిక్రమ్ స్పీచ్ కోసం ఎదురుచూసిన రోజులు కూడా ఉన్నాయి. చాలామంది యూట్యూబ్ లో త్రివిక్రమ్ స్పీచ్ అని సెర్చ్ చేస్తూ ఉంటారు. ఇక రీసెంట్ టైమ్స్ లో త్రివిక్రమ్ మాట్లాడటం తగ్గించేశారు అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఎన్టీఆర్ ఉన్న స్టేజ్ పై మాట్లాడటం మరి తక్కువగా ఉంటుంది. అయితే దీనికి కారణాలు లేకపోలేదు. సరైన కారణాలు ఉన్నా కూడా చాలామంది త్రివిక్రమ్ అభిమానులకి అది నిరాశ అనిపిస్తుంది అని చెప్పాలి. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమా అరవింద సమేత వీర రాఘవ. అప్పుడు ఉన్న పరిణామాలు దృష్ట్యా త్రివిక్రమ్ ఆ సినిమా ఈవెంట్ కి సంబంధించి మాట్లాడింది కొద్దిసేపు అయినా కూడా కరెక్ట్ అనిపించింది. కొన్ని సందర్భాలలో మాట్లాడటం కంటే మాట్లాడకుండా ఉండటం అందంగా ఉంటుంది ఇప్పుడు నాది అలాంటి పరిస్థితి అంటూ త్రివిక్రమ్ అప్పట్లో చెప్పుకొచ్చారు. అరవింద సమేత సినిమా సక్సెస్ అయిన తర్వాత ఎన్టీఆర్ పొగుడుతూ చాలాసేపు మాట్లాడారు.
మ్యాడ్ స్క్వేర్ లో తప్పించుకున్నారు
కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో మాడ్ సినిమా వచ్చి అద్భుతమైన సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే. ఆ సినిమాకి సీక్వెల్ గా మాడ్ స్క్వేర్ సినిమాను తెరకెక్కించాడు కళ్యాణ్. సినిమా మొదటి రోజు నుంచి మంచి కలెక్షన్స్ తో ముందుకు సాగుతుంది. ఈ సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన సక్సెస్ మీట్ కూడా నిర్వహించింది చిత్ర యూనిట్. ఈ సక్సెస్ మీట్ లో త్రివిక్రమ్ స్పీచ్ గురించి చాలామంది ఎదురు చూశారు. కానీ ఈ సినిమా గురించి చెప్పాలంటే మన ఇంట్లో మనుషుల గురించి మనమే మాట్లాడుకున్నట్లు అవుతుంది అంటూ తప్పించుకున్నారు. అలానే ఎన్టీఆర్ ను ఉద్దేశిస్తూ మాట్లాడుతూ మైక్ అప్పచెప్పారు. అసలు త్రివిక్రమ్ ఏం మాట్లాడుతాడు అని ఎదురుచూసిన చాలామందికి తీవ్రమైన నిరాశ కలిగించారు. ఎన్టీఆర్ తో స్టేజ్ పంచుకున్న సందర్భాలలోనే ఇలా జరుగుతుంది అని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Also Read : అజిత్ అభిమానులకు సడన్ సర్ప్రైజ్