BigTV English

Jr Ntr Comments On Nagavamsi: ఎన్టీఆర్ నాగ వంశీని అంత మాట అనేసాడు ఏంటి.?

Jr Ntr Comments On Nagavamsi: ఎన్టీఆర్ నాగ వంశీని అంత మాట అనేసాడు ఏంటి.?

Jr Ntr Comments On Nagavamsi:  ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో గట్టిగా వినిపించే ప్రొడ్యూసర్ పేరు నాగ వంశీ. ప్రముఖ నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ చాలా ఏళ్ళ క్రితం ఒక సినిమాను చేశారు అయితే ఆ సినిమా భారీ నష్టాలను తీసుకురావడంతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి గ్యాప్ ఇచ్చి, తర్వాత డి వి దానయ్యతో కలిసి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించిన కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాకి నిర్మాతగా వ్యవహరించాడు. ఇక ఆ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడుగా జులాయి అనే సినిమాను నిర్మించాడు. త్రివిక్రమ్ కెరియర్ లో ఈ సినిమా మంచి హిట్ అయింది. ఇది ఇప్పుడు ఆ సినిమా విషయంలో కొన్ని సీన్స్ కాపీ అంటూ కామెంట్స్ వినిపిస్తాయి. కానీ అప్పటికే దానికి రావాల్సిన లాభాలు రిజల్ట్ అన్ని అప్పట్లో వచ్చేసాయి. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించిన ఆ సినిమా అల్లు అర్జున్ కెరీర్ లో కూడా ప్రత్యేకంగా మారింది. త్రివిక్రమ్ ఆ సినిమా చేసిన తర్వాత అత్తారింటికి దారేది మినహా మరో సినిమా ఇంకో బ్యానర్ లో చేయలేదు. కేవలం త్రివిక్రమ్ కోసమే ఆ బ్యానర్ పరిమితం అయిపోయింది.


వేరే దర్శకులతో సినిమాలు చేయడానికే

హారిక హాసిని బ్యానర్ నుంచి అనుసంధానంగా క్రియేట్ అయిన బ్యానర్ సితార ఎంటర్టైన్మెంట్స్. ఈ బ్యానర్లో నాగ వంశీ సినిమాలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. జెర్సీ లాంటి నేషనల్ అవార్డు ఫిలిం కూడా ఈ బ్యానర్ లో ఉంది. అలానే ఎన్నో కమర్షియల్ సినిమాలు ఈ బ్యానర్ లో నిర్మితమవుతున్నాయి. ఈ బ్యానర్ కూడా మంచి లాభాలతో ముందుకు దూసుకెళ్తుంది. రణరంగం, ఆది కేశవ వంటి సినిమాలు మినహాయిస్తే మిగతా సినిమాలన్నీ కూడా మంచి ఫలితాలను తీసుకొచ్చాయి. ఇక రీసెంట్ గా ఈ సినిమాలో మాడ్ స్క్వేర్ అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా మంచి సక్సెస్ సాధించింది. ఈ సినిమాకి మంచి కలెక్షన్స్ కూడా వచ్చాయి. ఈ తరుణంలో ఈ సినిమా బ్లాక్ బస్టర్ ఈవెంట్ ను నిర్వహించింది చిత్ర యూనిట్. ఈ ఫంక్షన్ కు జూనియర్ ఎన్టీఆర్ అతిథిగా హాజరయ్యారు.


ఎన్టీఆర్ తెలిసి అన్నాడా.? తెలియక అన్నాడా.?

ఈ ఫంక్షన్ లో ఎన్టీఆర్ అనేక అంశాలను ప్రస్తావించారు. దేవర 2 సినిమా అప్డేట్ కూడా ఇచ్చారు. ప్రశాంత్ నీల్ సినిమా చేస్తున్న విషయాన్ని కూడా పంచుకున్నారు. అలానే నెల్సన్ తో చేయబోయే సినిమా గురించి కూడా ఇన్ డైరెక్ట్ గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఆరోజు ఫ్యాన్స్ అందర్నీ కంట్రోల్ చేయమని నాగ వంశీకి అప్పచెప్తాను అంటూ చెప్పుకొచ్చారు. ఇదంతా బాగానే ఉంది కానీ మాడ్ సినిమా గురించి మాట్లాడుతూ.. ఇవన్నీ జరగడానికి కారణం “చింటూ” నాగ వంశీ అంటూ చెప్పుకొచ్చాడు. ట్విట్టర్ ఎక్కువగా వాడుకునే వాళ్ళందరికీ ఇది బాగా అర్థమవుతుంది. ఎందుకంటే చాలా సందర్భాలలో నాగవంశీని ట్రోల్ చేస్తూ ఈ పదాన్ని చాలామంది వాడుతూ ఉంటారు. ఒక ఇంటర్వ్యూలో కూడా నాగ వంశీ ఈ విషయాన్ని ప్రస్తావించాడు. అయితే ఫంక్షన్ లో ఎన్టీఆర్ ఈ మాట అనడంతో చాలామందికి తెలిసి అన్నాడా, తెలియక అన్నాడా అంటూ అనుమానాలు మొదలయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Also Read : NTR: స్టార్ డైరెక్టర్‌తో కొత్త సినిమా ప్రకటించిన ఎన్టీఆర్.. వంశీ ఇక నీకుంటది..!

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×