Samantha : కేవలం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా సౌత్ సినిమా ఇండస్ట్రీలో సమంతకు విపరీతమైన క్రేజ్ ఉంది. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏమాయ చేసావే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది సమంత. మొదటి సినిమాతోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకొని అభిమానులను సంపాదించుకుంది. గౌతమ్ వాసుదేవ్ మీనన్ జెస్సి అనే పాత్రను క్రియేట్ చేసిన విధానం చాలామందికి విపరీతంగా కనెక్ట్ అయిపోయింది. ఆ తర్వాత తెలుగులో వరుస అవకాశాలు అందుకొని స్టార్ హీరోలు తో పాటు కలిసిన నటించింది. ఇక ప్రస్తుతం సమంత లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ, మరోవైపు ప్రొడ్యూసర్ గా కూడా అవతారం ఎత్తింది.
సమానంగా రెమ్యూనరేషన్ ఉండాలి
ఆడ మగ అని తేడా లేకుండా హీరో, హీరోయిన్ కి ఒకే రకమైన టాలెంట్ ఉన్నప్పుడు ఇద్దరికీ రెమ్యూనరేషన్ కూడా సమానంగానే ఉండాలి అని చెప్పింది. ఒక నిర్మాతగా కూడా ఇద్దరికీ సేమ్ రెమ్యూనరేషన్ ఉండేటట్లు నేను స్క్రిప్ట్స్ ఎంచుకుంటాను అని చెప్పింది. ప్రస్తుతం ఈ మాటలు పైన సమంతకు నెగిటివిటీ వస్తుంది. చాలామంది ఈక్వల్ రెమ్యూనరేషన్ ఉండాలి అంటే హీరో ఆడియన్స్ ను థియేటర్ కు రప్పించినట్లే, నువ్వు కూడా రప్పించగలగాలి అంటూ సమంతను కామెంట్ చేయడం మొదలుపెట్టారు. ప్రస్తుతం సమంత నిర్మాతగా వ్యవహరిస్తున్న శుభం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈ కామెంట్స్ చేశారు. ఇకపోతే ఇప్పటివరకు ఈ సినిమా పైన మంచి అంచనాలు ఉన్నాయి. ట్రైలర్ కూడా విపరీతంగా ఆకట్టుకుంది. రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించిన ఈవెంట్లో దర్శకుడు ప్రవీణ్ కాండ్రేగుల మాట్లాడుతూ ఈ సినిమా మొదటి షో చూసినవాళ్లు అదృష్టవంతులు అని కూడా తెలిపాడు.
అమీర్ ఖాన్ రియాక్షన్
సమంత మాట్లాడిన మాటలపై అమీర్ ఖాన్ పాత వీడియో ఒకటి వైరల్ అవుతుంది. గతంలో ఈ విషయం పైన అమీర్ ఖాన్ కూడా ఒకసారి స్పందించి, నీ రెమ్యూనరేషన్ ఎబిలిటీ అనేది థియేటర్ను ఫిల్ చేయడం పైన డిపెండ్ అయి ఉంటుంది. హీరోయిన్స్ చాలా హార్డ్ గా వర్క్ చేస్తారు. అలానే కెమెరామెన్స్ కూడా వర్క్ చేస్తారు. సెట్ లో ఉన్న లైట్ బాయ్స్ కూడా వర్క్ చేస్తారు. అలా చూసుకుంటే అందరికీ ఈక్వల్ గా ఉండాలి కదా. కానీ ఎక్కువగా హీరో కి ఎందుకు ఇస్తారు అంటే మార్కెట్ అనేది అంతకుమించి తీసుకొచ్చే విధంగా ఉండాలి కాబట్టి అనే అర్థం వచ్చినట్లు మాట్లాడారు. ప్రస్తుతం ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Also Read : Hari Hara VeeraMallu : ట్రైలర్ కట్ రెడీ, ఎలివేషన్ & అనిమల్ షాట్ తో హైప్