Hari Hara VeeraMallu : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే పవన్ కళ్యాణ్ కెరియర్లో స్ట్రైట్ ఫిలిమ్స్ కంటే కూడా ఎక్కువగా రీమేక్ సినిమాలు ఉన్నాయని చెప్పాలి. కొన్ని రీమేక్ సినిమాల్లో కూడా పవన్ కళ్యాణ్ సిగ్నేచర్ ఉంటుంది. ముఖ్యంగా ఎస్ జె సూర్య దర్శకత్వంలో వచ్చిన ఖుషి సినిమాలో పవన్ కళ్యాణ్ ఇన్వాల్వ్మెంట్ క్లియర్ గా కనిపిస్తుంది. కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్, ఇంట్రడక్షన్ సాంగ్ ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ ఆ సినిమాలో క్రియేట్ చేశారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ దర్శకత్వం వహించడం జానీ సినిమా ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కెరియర్ లో వరుసగా ఫెయిల్యూర్ సినిమాలు వస్తూనే ఉన్నాయి.
జల్సా ఉపశమనం
పవన్ కళ్యాణ్ నటించిన గోకులంలో సీత సినిమాకు రైటర్ పోసాని కృష్ణమురళి. ఆ సినిమాకు అసిస్టెంట్ రైటర్ త్రివిక్రమ్ శ్రీనివాస్. అప్పటినుంచి పవన్ కళ్యాణ్ కు త్రివిక్రమ్ శ్రీనివాస్ కి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉంది. వీళ్ళిద్దరూ సినిమా చేద్దామని ఎప్పటి నుంచి అనుకుంటున్నారు కానీ కుదరలేదు. ఒకసారి త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ చెప్తుంటే పవన్ కళ్యాణ్ పడుకున్నారు. అదే కథను అతడు అనే పేరుతో సూపర్ స్టార్ మహేష్ బాబుతో తీశాడు త్రివిక్రమ్. ఇక పవన్ కళ్యాణ్ హీరోగా జల్సా అనే సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించింది. మంచి లాభాలను కూడా రాబెట్టింది. పవన్ కళ్యాణ్ కెరియర్ లో మంచి కం బ్యాక్ సినిమా అంటే గబ్బర్ సింగ్. ఈ సినిమా ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అయితే ఈ సినిమా కూడా ఒక రీమేక్.
హరిహర వీరమల్లు ట్రైలర్ రెడీ
పవన్ కళ్యాణ్ రీమేక్ సినిమాలు చేయడం కంటే కూడా స్ట్రైట్ ఫిలిమ్స్ చేస్తే చూడటానికి చాలామంది ఎదురు చూస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ రీఎంట్రీ తర్వాత చేసిన సినిమాలన్నీ కూడా రీమేక్. అందుకే అందరికీ హరిహర వీరమల్లు సినిమా మీద కొద్దిపాటి అంచనాలు ఉన్నాయి. ఎప్పుడు రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కొన్ని పరిస్థితుల వలన పోస్ట్ పోన్ అవుతూనే వస్తుంది. మొత్తానికి ఈ సినిమా ట్రైలర్ రెడీ చేశారు. రెండు నిమిషాల 20 సెకండ్లు నిడివి ఉన్న ఈ ట్రైలర్లో పవన్ కళ్యాణ్ ఎలివేషన్స్ షాట్స్, అనిమల్ షాట్, డెసర్ట్ షాట్స్ హైలెట్ కానున్నాయి. ఓటిటి డీల్స్ చేస్తున్న ఒత్తిడి వలన ఈ సినిమా అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ట్రైలర్ ను అధికారికంగా ప్రకటించనున్నారు.
Also Read: They Call Him OG : పాపం సుజీత్, పోనిలే లొకేషన్ మారిన డేట్స్ దొరికాయి