Hari Hara Veeramallu Review : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ / డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన హరి హర వీరమల్లు ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అయింది.
ఏంటి అప్పుడే మూవీ రిలీజ్ అయిందా..? అనుకుంటున్నారా..? జూన్ 12 నుంచి వాయిదా అయిన హరి హర వీరమల్లు ఎక్కడ రిలీజ్ అయింది..? ఎవరు చూశారు..? 5 కి 4.9 రేటింగ్ ఎవరు ఇచ్చారు..? అని అనుకుంటున్నారా? అయితే ఈ ఆర్టికల్ చదవండి.
పవన్ కళ్యాణ్ చాలా సినిమాలు చేశాడు. కానీ, పిరియాడికల్ సినిమాలు చేయలేదు. దాన్ని భర్తీ చేయడానికే వచ్చింది హరి హర వీరమల్లు. సినిమా అనౌన్స్ చేసినప్పుడు ఆయన అభిమానులకు ఏదో తెలియన ఆనందం. మన హీరో కూడా పిరియాడిక్ పాత్ర చేస్తున్నాడని. మరీ… బాహుబలి అంత కాకపోయినా.. ఇండియన్ సినీ పరిశ్రమపై ఏదో చిన్న ఇంపాక్ట్ అయినా క్రియేట్ అవుతుంది దీంతో అని అనుకున్నారు.
అలా… ఆ సినిమా కోసం ఎదురుచూశారు… ఎదురుచూశారు… ఆ ఎదురుచూపులు 5 ఏళ్లు అయ్యాయి. డైరెక్టర్లు మారారు. కథ మారింది. కానీ, ఎదురుచూపుల్లో మాత్రం ఎలాంటి తేడా లేదు. ఫైనల్‌గా 12 జూన్ 2025 రిలీజ్ డేట్ అన్నారు. దాంట్లో ఎలాంటి మార్పులేదు అన్నారు.
5 ఏళ్లు ఎదురుచూస్తే చూశాం కానీ, సినిమా అయితే రిలీజ్ అవుతుంది అని ఖుషి అయిపోయారు. మధ్యలో పవన్ కళ్యాణ్ సినిమాను అడ్డుకోవడం అంటూ ఓ వివాదం వచ్చింది. దీనిపై పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఫైర్ అయ్యారు. ఎలాగో అలా.. ఆ వివాదం పూర్తి అయింది. హరి హర వీరమల్లు రిలీజ్ ఎలాంటి అడ్డంకులు లేవు.
ఇక జూన్ 12న థియేటర్స్ లో కలుసుకుందామని అనుకున్నారు. బ్యాగుల నిండా పేపర్ కటింగ్స్ రెడీ చేసుకుంటున్నారు. కట్ అవుట్స్ ఆర్డర్ పెట్టుకున్నారు. పాలాభిషేకాలు కూడా ప్లాన్ చేసుకున్నారు. ఇంతలో వీరమల్లు మళ్లీ వాయిదా పడుతుంది అంటూ వార్తలు వచ్చాయి. కానీ, అవన్నీ ఫేక్… తమ హీరో సినిమా రిలీజ్ అవుతుందని నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు అనే అనుకున్నారే తప్పా… వాటిని నమ్మలేదు.
చివరికి ఆ సినిమా నిర్మాతే… వారి ఆశలపై నీళ్లు చల్లాడు. జూన్ 12న ఈ మూవీ రిలీజ్ అవ్వడం లేదు అంటూ మేకర్స్ ప్రకటించారు. దీంతో ఎన్నో ఆశలు పెట్టుకున్న ఫ్యాన్స్ నిరాశపడిపోయారు. ఇక సినిమాపై హోప్స్ పెట్టుకోవడం వెస్ట్ అని అనుకున్నారు. అలా సాగింది వారి కథ.
అన్నీ బాగుంటే, ఈ రోజు థియేటర్స్ లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ హవా ఉండేది. మూవీ రివ్యూలు, రేటింగ్స్ అంటూ రచ్చ రచ్చ జరిగేది.
అవేం లేకున్నా, సినిమా రిలీజ్ కాలేకపోయినా… ఈ సినిమా రివ్యూలు, రేటింగ్స్ అంటూ పోస్టులు పుట్టుకుస్తున్నాయి. ఇప్పటికే సినిమా వాయిదా పడింది అనే బాధలో ఉన్న పవన్ ఫ్యాన్స్‌ను ఇతర హీరోల ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రెచ్చగొడుతున్నారు.
పవర్ స్టార్ సినిమా జూన్ 12న రిలీజ్ అయిందని, సినిమా బ్లాక్ బస్టర్. బాహుబలి రికార్డులు బ్రేక్. కలెక్షన్ల సునామి అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. అంతే కాదు… సినిమాకు రేటింగ్ కూడా ఇచ్చేశారు. 5 స్టార్స్‌కు గాను 4.9 స్టార్స్ ఇచ్చాం అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ప్రస్తుతం ఆ పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
#HariHaraVeeraMallu Review
What an experience. Never would have expected PSPK in such a golden role. The intensity was powerful. The action sequences were perfectly choreographed with excellent VFX shots. Kreem sir never disappoints. Nidhi lived her role!
Rating – 4.9/5#HHVM pic.twitter.com/PYAwdN1f9c
— Varun Velamakanti 🦅 (@CricVarunSRH) June 11, 2025
Just Finished Watching #HHVM
Best Film of #PawanKalyan Post Comeback
The Climax,Port Fight, Fox and Tiger Sequence, Interval are major highlights 🦅💥
Thanks @DirKrish @amjothikrishna @amjothikrishna for such a memorable Film
My Rating : 4/5 🦅🔥🔥#HariHaraVeeraMallu pic.twitter.com/GHREZ3vg8j
— Swastik 🦅 (@SwastikTheGame1) June 12, 2025