BigTV English

TVK Vijay Mahanaadu : థిస్ ఇస్ ఎ మాస్ గేదరింగ్, నాట్ ఫర్ క్యాష్

TVK Vijay Mahanaadu : థిస్ ఇస్ ఎ మాస్ గేదరింగ్, నాట్ ఫర్ క్యాష్

TVK Vijay Mahanaadu : ఇప్పటివరకు మన దేశంలో చాలామంది రాజకీయ నాయకులు ఉన్నారు. వారిలో ఒక్కొక్కరిది ఒక్కొక్కసారి శైలి, అలానే ఒక్కొక్కరిది ఒక్కో రకమైన జర్నీ. కొందరు పూర్తిస్థాయి రాజకీయాల్లో ఉంటే మరికొందరు సినిమా పరిశ్రమ నుంచి రాజకీయాల్లోకి ప్రయాణం చేసిన వాళ్ళు ఉన్నారు. అయితే చాలామంది సినిమా వాళ్లు రాజకీయాల్లో కూడా సక్సెస్ అయిన దాఖలాలు ఉన్నాయి. తెలుగులో సీనియర్ ఎన్టీఆర్ లాంటి వ్యక్తి కేవలం పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే సీఎం గా స్థాయిని సాధించారు. అంతే స్థాయిలో ప్రజాసేవ కూడా చేశారు. ఇక రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఇక్కడ ఉన్న వాతావరణం తట్టుకోలేక మళ్ళీ వెనక్కి తిరిగిన వ్యక్తులు కూడా ఉన్నారు. వారిలో మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ఒకరు.


ఒక మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన టైంలో తెలుగు ప్రజలు ఆయనను బాగానే ఆదరించారు. ఎక్కడ సభ పెట్టిన కూడా లక్షల్లో జనాభా హాజరయ్యేవాళ్ళు. మెగాస్టార్ చిరంజీవి కూడా తెలుగు ప్రజలు మంచి తీర్పునిచ్చి కొన్ని సీట్లను కట్టబెట్టారు. అయితే ఇక్కడున్న కొన్ని ఒత్తిళ్ల వలన మెగాస్టార్ ఎక్కువ కాలం రాజకీయాల్లో నిలబడలేకపోయారు. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానం డిఫరెంట్. పార్టీ పెట్టిన పదేళ్ల వరకు సరైన స్థాయిని అందుకోలేకపోయారు పవన్ కళ్యాణ్. కానీ ఆ పదేళ్లు మాత్రం అలుపెరగని పోరాటం చేశారు. పదవి లేకపోయినా కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించుకుంటూ ముందుకెళ్లారు. నేడు పవన్ కళ్యాణ్ ఈ స్థాయిలో ఉన్నారు అంటే కారణం ఈ పదేళ్ల సుదీర్ఘ ప్రయాణమే.

అయితే పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కు ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ సభలు పెట్టినప్పుడు కూడా లక్షల సంఖ్యల్లో జనాలు వచ్చారు. ఎవరు ఊహించని విధంగా బైక్ ర్యాలీలు కూడా చేశారు. అయితే ఓట్ల విషయంకి వచ్చేసరికి పవన్ కళ్యాణ్ కి మొదటిసారి పట్టం కట్టలేదు. ఇక ప్రస్తుతం తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో విజయ్ రాజకీయాల్లోకి రంగ ప్రవేశం చేశారు. విజయ్ పార్టీ మహానాడు నేడు జరిగింది. ఈ కార్యక్రమానికి విపరీతమైన జనాలు వచ్చారు. అయితే తెలుగు ప్రజలు తమిళ్ ప్రజలులా కారు. వచ్చారు అంటే ఖచ్చితంగా ఆ వ్యక్తిని నమ్మారు అని అనుకోవచ్చా.? అనే సందేహం రిజల్ట్ తర్వాత తీరుతుంది. ఎందుకంటే వచ్చిన ప్రతి ఒక్కరూ ఓట్లు వేస్తారని నమ్మకంగా చెప్పలేం. సినీ నటుల పైన అభిమానంతో చూద్దామని కొంతమంది వస్తారు. ఇకపోతే విజయ్ సభకి వచ్చిన చాలామందిని ఉద్దేశించి “థిస్ ఇస్ ఎ మాస్ గేదరింగ్, నాట్ ఫర్ క్యాష్ బట్ ఫర్ ఏ గుడ్ కాజ్” అంటూ చెప్పుకొచ్చాడు. ఇక విజయ్ మీద నమ్మకంతో వచ్చిన తమిళ ప్రజలు విజయ్ కి ఎలాంటి తీర్పు ఇస్తారు అనేది ఇంకొద్ది రోజుల్లో తెలియాల్సి ఉంది.


Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×