BigTV English

Actor Vijay TVK Rally : మహానాడులో దుమ్మురేపిన విజయ్.. తొలి ప్రసంగానికి 8 లక్షల మంది హాజరు

Actor Vijay TVK Rally : మహానాడులో దుమ్మురేపిన విజయ్.. తొలి ప్రసంగానికి 8 లక్షల మంది హాజరు
Actor Vijay TVK Rally : 

⦿ నాకు రాజకీయ అనుభవం లేకపోవచ్చు
⦿ పాలిటిక్స్ విషయంలో అస్సలు భయపడను
⦿ సినిమా రంగంతో పొలిస్తే చాలా సీరియస్
⦿ రానున్న ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తా
⦿ మా పార్టీ ఎవరికీ ఏ, బీ టీమ్‌ కాదని క్లారిటీ
⦿ మహానాడుకు 8 లక్షల మందికి పైగా హాజరు
⦿ తొలి బహిరంగ సభలో విజయ్ కీలక ప్రసంగం


చెన్నై, స్వేచ్ఛ : రాజకీయ అనుభవం లేకపోవచ్చు కానీ రాజకీయం విషయంలో భయపడే ప్రసక్తే లేదని తమిళ స్టార్ హీరో, తమిళగ వెట్రి కళగం‌ అధినేత విజయ్ స్పష్టం చేశారు. సినీ రంగంతో పోలిస్తే రాజకీయ రంగం చాలా సీరియస్ అని వ్యాఖ్యానించారు. ఆదివారం విల్లుపురం జిల్లా విక్రవండిలో పార్టీ తొలి మహానాడు జరిగింది. ఈ బహిరంగ సభకు సుమారు 8 లక్షల మందికి పైగా అభిమానులు, రాష్ట్ర ప్రజలు, కార్యకర్తలు తరలివచ్చారు. ఇసుకేస్తే రాలనంతగా వచ్చిన జనాన్ని కంట్రోల్ చేయలేక ఒకానొక సందర్భంలో పోలీసులు కూడా చేతులెత్తిసిన పరిస్థితి. అభిమానుల కోలాహాలం మధ్య సభావేదికపైకి విచ్చేసిన విజయ్ టీవీకే పార్టీ సిద్ధాంతాలు, రాష్ట్ర రాజకీయాలు, రానున్న ఎన్నికల్లో పోటీపై సుదీర్ఘ ప్రసంగం చేశారు.

ALSO READ : అమెరికాలో దుమ్మురేపుతున్న లోకేష్.. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దిశగా అడుగులు


పాముతో సమానం!
రాజకీయాలు అంటే పాముతో సమానమని, ఈ విషయం తనకు బాగా తెలుసన్నారు. రానున్న ఎన్నికల్లో తమిళనాడులోని అన్ని అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు సభావేదికగా ప్రకటించారు. అదే విధంగా పార్టీపై వస్తున్న విమర్శలకు కూడా గట్టిగానే స్పందించారు. తమిళగ వెట్రి కళగం‌ పార్టీ ఎవరికీ ఏ టీమ్, బీ టీమ్ కాదని తేల్చి చెప్పారు. రాజకీయాల్లో తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తారని, అవేమీ పట్టించుకోకుండా, వెనక్కి తగ్గకుండా ముందుకెళ్తానన్నారు. దేవుడు లేడు అనే పెరియార్ సిద్ధాంతాలకు పార్టీ, తాను పూర్తిగా వ్యతిరేకమన్నారు. అంతేకాదు మత రాజకీయాలను అస్సలు ప్రోత్సహించనని మహానాడులో విజయ్ తెలిపారు.

Related News

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Big Stories

×