BigTV English

Mangaluru acid attack: మంగళూరులో దారుణం.. ప్రేమను తిరస్కరించిందని విద్యార్థినిపై.. ?

Mangaluru acid attack: మంగళూరులో దారుణం..  ప్రేమను తిరస్కరించిందని విద్యార్థినిపై.. ?

 


Mangaluru acid attack news

Acid attack on girl students in mangaluru govt pu college(Telugu flash news): కర్ణాటక మంగళూరులో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ముగ్గురు విద్యార్ధినులపై ఒక యువకుడు యాసిడ్ దాడి చేశాడు. వారిలో ఒక యువతి తన ప్రేమను తిరస్కరించిందన్న ఆవేశంతో ఒక యువకుడు ఆమెపై కక్ష పెంచుకుని యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. యాసిడ్ దాడి సమయంలో బాధిత యువతి పక్కన కూర్చున్న మరో ఇద్దరు అమ్మాయిలపై కూడా యాసిడ్ పడింది. ఈ ఘటనలో ఒకరికి ముఖంపై తీవ్ర గాయాలు కాగా , మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి.


read more: అవినీతి కేసుల్లో సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. ప్రజాప్రతినిధులకు మినహాయింపు రద్దు

దక్షిణ కన్నడ జిల్లా కడబలోని ప్రీ- యూనివర్శిటీ కాలేజీలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ ముగ్గురు విద్యార్దినులు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధిత విద్యార్థినులు 2వ ఏడాది పీయూ ఫిజిక్స్ పరీక్ష కోసం చదువుతుండగా ఒక అమ్మాయుపై యాసిడ్ దాడి చేశాడు . యాసిడ్ దాడి చేసిన సమయంలో ఆమె పక్కనే వున్న మరో ఇద్దరు అమ్మాయిలపై కూడా యాసిడ్ పడింది. దాడి చేసి పారిపోతున్న యువకుడిని స్థానికులు పట్టుకుని, చితకబాది పోలీసులకు అప్పగించారు. అతడిని మలప్పురం జిల్లా నిలంబూర్ కి చెందిన 23 ఏళ్ల అబిన్ షిబిగా పోలీసులు గుర్తించారు.

బాధిత యువతుల వయసు 17-19 మధ్య ఉంటుందని పోలీసులు తెలిపారు. బాధితుల్లో ఒకరిని ప్రేమిస్తున్నానని, ఆ అమ్మాయి తన ప్రేమను తిరస్కరించినందుకే తాను ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో వెల్లడించాడు. అయితే తాను ఒకరి లక్ష్యంగానే యాసిడ్ దాడి చేసానని, ఆమె పక్కన కూర్చున్న వారిపై యాసిడ్ పడిందని అతను పేర్కొన్నాడు. నిందితుడు తన సొంత ఊరిలోనే ఎంబీఏ చదువుతున్నాడు. విద్యార్ధిని కూడా కేరళకు చెందిన వ్యక్తేనని చదువుకోవడం కోసం కర్ణాటక వచ్చిందని పోలీసులు తెలిపారు.

Tags

Related News

Amruta Fadnavis: బీచ్‌‌ను శుభ్రం చేసిన సీఎం భార్య.. ఆమె డ్రెస్ చూసి నోరెళ్లబెట్టిన జనం

NDA Cheap Tricks: ఆహా.. బీహార్ అంటే కేంద్రానికి ఎంత ప్రేమ.. ఇవేం చీప్ ట్రిక్స్?

Drugs Case: చర్లపల్లి డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు

Century Old Tractor: అద్భుతమైన ఇంజనీరింగ్.. వందేళ్ల నాటి ట్రాక్టర్, ఎక్కడంటే..

Mumbai fire accident: ముంబైలో హై రైజ్‌లో మంటలు.. 23 అంతస్తుల భవనంలో ప్రమాదం.. ఒకరి మృతి!

Gujarat Tragedy: మహాకాళి ఆలయ మార్గంలో ప్రమాదం.. సాంకేతిక లోపమా?

Big Stories

×