BigTV English

5 Days Work in a Week: ఉద్యోగులకు గుడ్ న్యూస్.. త్వరలోనే వారంలో 5 రోజుల వర్కింగ్.. 2 సెలవు దినాలు

5 Days Work in a Week: ఉద్యోగులకు గుడ్ న్యూస్.. త్వరలోనే వారంలో 5 రోజుల వర్కింగ్.. 2 సెలవు దినాలు

bank holidays


Weekly 5 Days Working: బ్యాంక్ ఉద్యోగుల సుదీర్ఘ డిమాండ్ అయిన.. వారానికి 5 రోజుల పనిదినాలు ఈ ఏడాదే అమలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బ్యాంక్ ఉద్యోగుల డిమాండ్ కు ఆర్థిక మంత్రిత్వశాఖ ఆమోదం తెలిపితే.. ఈ ఏడాది జూన్ నుంచే వారానికి 5 రోజులు పనిదినాలు అమల్లోకి రానుంది. అయితే దీనివల్ల కస్టమర్లకు బ్యాంకు సేవలు అందించే పనిగంటలు మాత్రం తగ్గవని, ఎలాంటి మార్పులు ఉండవని.. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కు యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయిస్ గతంలో రాసిన లేఖలో పేర్కొంది. వారానికి 5 రోజులు పనిదినాలు అమలుతో పాటు.. జీతాల పెంపుపై కూడా త్వరలోనే ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

లోక్ సభ ఎన్నికల వేళ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి రాకముందే ప్రభుత్వం బ్యాంకులకు 5 రోజుల పనిదినాలను ఆమోదించవచ్చని ఫైనాన్షియల్ ఎక్స్ ప్రెస్ నివేదించింది. గతేడాది డిసెంబర్ లో ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్, బ్యాంక్ యూనియన్లు కలిసి ఒక అవగాహనపై (MOU)సంతకం చేసిన తర్వాత ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగులకు 17 శాతం జీతాలు పెరగనున్నాయి. 5 రోజుల పనిని అమలు చేయాలని యూనియన్లు కోరగా.. వారానికి 5 రోజులు పనిచేసే ప్రభుత్వ కార్యాలయాలు, ఆర్బీఐ కార్యాలయాలు, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మాదిరిగానే 180 రోజుల్లో 5 రోజుల పనివారాన్ని అమలు చేయాలని కోరాయి.


Read More: యూపీఐ లావాదేవీలపై ఫీజు​ వేస్తారా..?

ఈ ప్రతిపాదనను ఉద్యోగుల సంఘాలు, ఐబీఏ గతేడాది నవంబర్ లో ఆమోదించగా.. దానిని ఆర్థిక మంత్రిత్వశాఖ పరిశీలనకు పంపారు. ప్రస్తుతం ప్రభుత్వ రంగ, ప్రైవేట్ రంగ బ్యాంకులు నెలలో మొదటి, మూడవ శనివారాలు పనిచేస్తున్నాయి. బ్యాంక్ ఉద్యోగుల డిమాండ్ ప్రకారం వారానికి 5 రోజుల పనిదినాలు అమలైతే.. అన్ని శనివారాలు బ్యాంక్ ఉద్యోగులకు సెలవులు కానున్నాయి. ప్రస్తుతం పేమెంట్, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, పబ్లిక్, ప్రైవేట్ బ్యాంకుల్లలో 1.54 మిలియన్ల ఉద్యోగులు ఉన్నారు.

Tags

Related News

Gold Rate Today: పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరిగిన బంగారం ధర..

Jio vs Airtel vs VI: జియో, ఎయిర్‌ టెల్, VI.. డైలీ డేటాలో బెస్ట్ మంత్లీ ప్రీపెయిడ్ ప్లాన్స్ ఇవే!

Best BSNL Plans: నెల రోజుల వ్యాలిడిటీ.. అన్ లిమిటెడ్ కాల్స్.. రూ. 199 లోపు 5 బెస్ట్ BSNL ప్లాన్స్ ఇవే!

iPhone 17 launch: కొత్త ఐఫోన్ 17 డిజైన్, ఫీచర్స్ లీక్…ధర ఎంతంటే..? 

Best bikes under 1 lakh: ఒక్క లక్షలోపు బెస్ట్ బైక్‌లు.. 2025 టాప్ బైక్స్ ఇవే..

Flipkart Big Billion Days: కేవలం రూ.1కే ప్రీబుక్ ఆఫర్.. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ 2025

×