
Unstoppable With NBK : ఆరుపదుల వయసులో కూడా కుర్ర హీరోలకు దీటుగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న హీరో నందమూరి బాలకృష్ణ. వెండితెర పైనే కాకుండా బుల్లితెరపై కూడా బాలయ్య తన జలకులు చూపిస్తూ ఆహా ప్లాట్ఫారం పై అన్ స్టాటబుల్ టాక్ షో తో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే రెండు సీజన్లు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న మూడవ సీజన్లో మరింత క్రేజీగా తయారయింది. రీసెంట్గా రణ్‌బీర్ కపూర్ రష్మిక కాంబినేషన్లో తెరకెక్కుతున్న యానిమల్ మూవీ టీం ప్రమోషన్ లో భాగంగా అండ్ స్టాపబుల్ విత్ ఎన్బికె టాక్ షోలో పాల్గొన్నారు.
టాక్ షోలో బాలకృష్ణ తుంటరి కృష్ణలా అందరినీ ప్రశ్నలు వేసి వేధించే విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రష్మిక విజయ్ దేవరకొండ ని కూడా లాక్ చేసి.. ప్రేక్షకులను షాక్ చేశాడు. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ముందుగా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాకు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు.. ఆ తర్వాత హీరో రణ్‌బీర్ కపూర్ కి మంచి ఎలివేషన్ ఇచ్చారు. రణ్‌బీర్ కపూర్ బాలయ్య ఫేమస్ డైలాగ్ ఫ్లూట్ జింక ముందు ఊదు సింహం ముందు కాదు తనదైన శైలిలో చెప్పి అందరిని అలరించాడు. ఆ తర్వాత బాలకృష్ణ పైసా వసూల్ పాటకి కూడా రణ్‌బీర్ డాన్స్ వేశాడు.
రష్మిక స్టేజ్ మీదకి రావడంతోటే బాలయ్య డాన్స్ చేసి.. ‘నీతో మెలికలు తిరుగుతుంటే నా గుండె కూడా మెలికలు తిరుగుతోంది’అని సరదా పట్టించారు. షో లో భాగంగా రణ్‌బీర్ కపూర్..తను, విజయ్ దేవరకొండతో ఉన్న ఫోటో చూపించి ఇద్దరిలో ఎవరు బెస్ట్ రష్మిక ను అడగమని బాలయ్య తో అంటాడు. దీంతో బాలయ్య ‘రష్మిక ఈ ఇద్దరిలో ఎవరు బాగున్నారు..’ అంటూ రష్మీకను ఇరకాటంలో పెడతారు. రష్మిక బాలయ్య ప్రశ్న కి ఏ సమాధానం ఇవ్వకుండా సిగ్గుపడుతుంది.
ఇక కాసేపటికి తన క్లోజ్ ఫ్రెండ్ విజయ్ దేవరకొండకు రష్మీక కాల్ చేసింది. మధ్యలో కలగజేసుకున్న బాలయ్య ‘ ఏంటన్నా.. మిద్ది పైన జోరుగా పార్టీలు..’ అని తమాషా పట్టించారు. సందీప్ తో విజయ మాట్లాడుతున్న సమయంలో మీ హీరోకి చెప్పమ్మా ఐ యాం ఇన్ లవ్ విత్ రష్మిక అని అన్నారు బాలయ్య. బాలయ్య కామెడీకి అందరూ నవ్వితే రష్మిక మాత్రం సిగ్గుపడింది. ఇలా మొత్తానికి ఎపిసోడ్ మొత్తం రష్మికను బాగానే ఆటపట్టించారు బాలయ్య.ఈ ఎపిసోడ్ నవంబర్ 24 న అహ ప్లాట్ఫారం లో స్ట్రీమింగ్ అవుతుంది.