Unstoppable With NBK S4 E9 Promo:నటసింహ నందమూరి బాలకృష్ణ (Balakrishna) ఒకవైపు హీరోగా, మరొకవైపు రాజకీయ నాయకుడిగా చలామణి అవుతూనే. ఇంకొక వైపు హోస్ట్ గా కూడా అవతారం ఎత్తారు. అందులో భాగంగానే ఆహా ఓటీటీ వేదికగా ప్రసారమవుతున్న ‘అన్ స్టాపబుల్ విత్ ఎన్బికె’ కార్యక్రమానికి హోస్ట్గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే మూడు సీజన్లు పూర్తి కాగా ఇప్పుడు నాలుగవ సీజన్ కూడా ప్రారంభమైంది. అందులో భాగంగానే తొమ్మిదవ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ని తాజాగా విడుదల చేశారు. ఆ ప్రోమోలో రామ్ చరణ్ (Ram Charan) తన సినిమా గేమ్ ఛేంజర్ (Game Changer) ప్రమోషన్స్ లో భాగంగా హాజరై సందడి చేశారు . ముఖ్యంగా లైవ్ కాన్ఫరెన్స్ లోకి తన అమ్మ, నాన్నమ్మ కూడా వచ్చి ఆకట్టుకున్నారు.
అన్ స్టాపబుల్ ప్రోమోలో సందడి చేసిన రామ్ చరణ్..
ఇక గేమ్ ఛేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా రామ్ చరణ్ తో పాటు ఆయన స్నేహితుడు, ప్రముఖ హీరో శర్వానంద్ (Sharwanand)కూడా వచ్చి సందడి చేసిన విషయం ప్రోమోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఇక వీరితో పాటు నిర్మాత దిల్ రాజు, నిర్మాత విక్రమ్ కూడా వచ్చి సందడి చేశారు. ఇకపోతే బాలకృష్ణ మాట్లాడుతూ.. ” మీరు గత ఏడాది మీ నాన్నకు మరిచిపోలేని బహుమతి ఇచ్చారు కదా” అంటూ రాంచరణ్ కు కూతురు పుట్టిన వీడియోని తెరపై చూపించేసరికి ఆ ఎమోషన్ ని తట్టుకోలేక కన్నీటి పర్యంతమయ్యారు రామ్ చరణ్. తన కూతురు గురించి మాట్లాడుతూ.. “క్లీన్ కారా చాలా బక్కగా ఉంటుంది. తినడానికి ఎన్నో తిప్పలు పెడుతుంది. దాదాపు రెండు గంటలపాటు ప్రతిరోజు ఉదయం ఆమెకు తినిపించడానికి నాకు టైం సరిపోతుంది” అంటూ కూతురి గురించి చాలా ఉత్సాహంగా చెబుతూ అందరిని సంతోషపరిచారు.
నాన్న అని పిలిచిన వెంటనే రివీల్ చేస్తా..
అలాగే కూతురి ముఖాన్ని ఎప్పుడు రివీల్ చేయబోతున్నారు? అంటూ బాలయ్య అడగగా.. “తాను ఎప్పుడైతే నన్ను నాన్న అని పిలుస్తుందో.. అప్పుడు వెంటనే అందరికీ చూపించేస్తాను” అంటూ కామెంట్లు చేశారు రామ్ చరణ్. ఏది ఏమైనా గత కొన్ని నెలలుగా క్లీన్ కారా ముఖాన్ని చూడడం కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. ఇక తనను నాన్న అని పిలిస్తే ఖచ్చితంగా రివీల్ చేస్తానని చెప్పాడు కాబట్టి ఆ దూరం ఇంకెంతో లేదు అంటూ అభిమానులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఉపాసన కూడా నిన్న తన కూతురు క్లీన్ కార వీడియోని షేర్ చేసింది. స్క్రీన్ పై రామ్ చరణ్ ఫోటో కనిపించగానే ఎంతో ఉత్సాహంగా క్లీన్ కారా సంబరపడిపోయిన వీడియోని ఆమె షేర్ చేయడం మనం గమనించవచ్చు. ఏది ఏమైనా కూతురు గురించి రాంచరణ్ చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇక ప్రోమోలో భాగంగా తన తండ్రి చిరంజీవి (Chiranjeevi )బాబాయిలు నాగబాబు (Nagababu ), పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఇద్దరి ఫోటోలను చూపించి ముగ్గురిలో ఎవరితో సిట్టింగ్ వేస్తావని బాలయ్య సరదాగా ప్రశ్నించగా.. వీరెవరు కాదు నా మామయ్య అల్లు అరవింద్(Allu Aravit) అయితే నాకు బెటర్ అంటూ కామెంట్లు చేశారు రామ్ చరణ్. మొత్తానికైతే ఈ ప్రోమో కాస్త ఎమోషనల్ గా, ఇంకాస్త ఫన్ గా అందరినీ ఆకట్టుకుంది.