BigTV English

Unstoppable With NBK : అప్పుడు పవన్ కళ్యాణ్ కి ప్లే చేసిన స్ట్రాటజీ ఇప్పుడు సిబిఎన్ కు కూడా చేస్తుంది

Unstoppable With NBK : అప్పుడు పవన్ కళ్యాణ్ కి ప్లే చేసిన స్ట్రాటజీ ఇప్పుడు సిబిఎన్ కు కూడా చేస్తుంది

Unstoppable With NBK : నందమూరి బాలకృష్ణ కెరియర్ లో మంచి మలుపు తీసుకొచ్చిన షో అన్ స్టాపబుల్. ఆ షో ముందు బాలయ్య ను చూసిన విధానం, ఆ షో తర్వాత బాలయ్యను చూసిన విధానం రెండు కంప్లీట్ గా మారిపోయాయి. అన్ స్టాపబుల్ ముందు బాలయ్యను చాలా మంది కొన్ని విషయాల్లో అపార్థం చేసుకున్నారు. ఒక్కసారి అన్ స్టాపబుల్ మొదలైన తర్వాత అందరికీ బాలకృష్ణ మీద ఉన్న అభిప్రాయం పూర్తిగా మారిపోయింది. చాలామంది యంగ్ హీరోలు కూడా బాలయ్య బాబుకు బాగా క్లోజ్ అయిపోయారు.


ముఖ్యంగా విశ్వక్సేన్ (Viswaksen) సిద్దు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda) అడవి శేషు ( Adavi Sesh) వంటి హీరోలతో బాలకృష్ణ మాట్లాడిన విధానం చాలామందిని విపరీతంగా ఆకట్టుకుంది. అలానే ప్రభాస్ తో బాలకృష్ణ మాట్లాడిన సందర్భంలో రామ్ చరణ్ (Ram Charan) కి కూడా నందమూరి బాలకృష్ణ ఎంత క్లోజ్ అని అందరికీ ఒక క్లారిటీ వచ్చింది. ఈ షో తర్వాతే బాలకృష్ణ వరుసగా మూడు హిట్ సినిమాలు అందుకున్నారు. ఇప్పుడు బాలకృష్ణ సినిమా అంటే కూడా అంచనాలు అదే రేంజ్ లో ఉంటాయి.

ఒకప్పుడు మెగా ఫ్యామిలీ (Mega Family) కి నందమూరి ఫ్యామిలీ (Nandamuri Family) కి ఒక కోల్డ్ వార్ జరుగుతూ ఉండేది. మేము గొప్ప అంటే మేము గొప్ప అంటూ చరిత్రల గురించి రికార్డుల గురించి అప్పట్లో సినిమాల్లో డైలాగులు కూడా ఉంటూ ఉండేవి. అయితే వాటన్నిటిని ఫ్యాన్స్ కూడా చాలా సీరియస్ గా తీసుకొని అప్పట్లో ఫ్యాన్వర్స్ కూడా మొదలుపెట్టారు. ఇక రీసెంట్ టైమ్స్ లో నందమూరి ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి మధ్య వివాదాలు పూర్తిగానే తగ్గిపోయాయి. ఒకవైపు పవన్ కళ్యాణ్ కూడా బాలకృష్ణకి క్లోజ్ కావటం దీనికి ఒక కారణం కూడా చెప్పొచ్చు.


అన్ స్టాపబుల్ షో కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కూడా ఒక సందర్భంలో ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆ షో అన్నిటికంటే కూడా నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఆ షో విషయంలో చెప్పిన టైం కంటే కొంచెం ముందుగానే రిలీజ్ చేశారు ఆహా వాళ్లు. ఇప్పుడు సీజన్ 4 కి సంబంధించి అదే స్ట్రాటజీని మరోసారి చేస్తున్నారు. రీసెంట్ గానే సీజన్ 4 స్టార్ట్ అయిన విషయం తెలిసిందే. దీనికి ముఖ్యఅతిథిగా ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత సీఎం నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) హాజరయ్యారు. అయితే ఈ షోలో అనేక రకమైన కాంట్రవర్సియల్ టాపిక్స్ కూడా మాట్లాడినట్లు తెలుస్తుంది. అయితే ఆహా నిర్మాణ సంస్థ ఒక ట్వీట్ వేసి ఈ ట్వీట్ కి 3k రీ ట్వీట్స్ చెప్పిన టైం కంటే ముందుగానే ఈ ఎపిసోడ్ ను రిలీజ్ చేయబోతున్నామంటూ పోస్ట్ చేశారు. దీంతో ఒకప్పుడు పవన్ కళ్యాణ్ ఎపిసోడ్కి ఏ స్ట్రాటజీ వాడారో అదే స్ట్రాటజీ ఇప్పుడు కూడా వాడుతున్నారు అని అందరికీ ఒక క్లారిటీ వచ్చింది.

Related News

Movie Industry : ఇండస్ట్రీలో ఇవి మారాల్సిందే… లేకపోతే దుకాణం క్లోజ్ ?

Mother Teresa : మదర్ తెరిస్సా 115 జయంతి.. సేవా కార్యక్రమాలలోలయన్స్ క్లబ్, హెల్ప్ ఫౌండేషన్!

Dharsha Guptha: ఇంస్టాగ్రామ్ ద్వారా నెలకు లక్షల్లో ఆదాయం..ఈ ముద్దుగుమ్మ పనే బాగుందే!

Vithika sheru: మట్టి వినాయకుడిని చేసిన హీరోయిన్.. వామ్మో ఈ టాలెంట్ కూడా ఉందా?

Dethadi Alekhya Harika: మన క్యారెక్టర్ ని డిసైడ్ చేసేది అదే.. బుల్లి కథతో హారిక పోస్ట్!

Big TV kissik talks : స్టేజ్ పై అమ్మాయిలతో పండు అలా.. అడ్డంగా పరువుతీసేసిన వర్ష…

Big Stories

×