BigTV English

Renu desai : రేణు దేశాయ్ కోరికను తీర్చిన ఉపాసన.. ఎంత గొప్ప మనస్సో..

Renu desai : రేణు దేశాయ్ కోరికను తీర్చిన ఉపాసన.. ఎంత గొప్ప మనస్సో..

Renu desai : ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్, ఏపీ డిప్యూటీ సీఏం పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ( Renu Desai ) పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఈమె సినిమాలకు దూరంగా ఉన్నా కూడా నిత్యం వార్తల్లో ఉంటారు. సమాజంలో జరిగే అంశాలపై సోషల్ మీడియాలో స్పందిస్తుంటారు.. తాజాగా ఈమె సోషల్ మీడియాలో ఓ వీడియోను సోషల్ మీడియా చేశారు. ఆ పోస్ట్ వైరల్ అవుతోంది. అందులో రేణు దేశాయ్ ఒక ఎమోషనల్ వీడియోను పోస్ట్ చేశారు. ఆ వీడియోపై తాజాగా మెగా కోడలు ఉపాసన స్పందించింది. అంతేకాదు ఎవరు ఊహించని సాయం చేసింది. ఆ సాయం ఏంటి? ఉపాసన రేణు దేశాయ్ కు సాయం చేయడం పై మెగా ఫ్యామిలీ ఎలా స్పందించారో ఇప్పుడు తెలుసుకుందాం..


రేణు దేశాయ్ పవన్‌ కళ్యాణ్ నుంచి విడిపోయిన తర్వాత పిల్లలు అకీరా నందన్, ఆద్యాలే ప్రపంచంగా బతుకుతున్నారు.. వారిని పెంచి పెద్ద చేసి ప్రయోజకులుగా తీర్చిదిద్దేందుకు శ్రమిస్తున్నారు. అకీరాను హీరోగా ఇంట్రడ్యూస్ చేయాలని తెర వెనుక ప్రయత్నాలు జరుగుతుండగా.. రేణూదే తుది నిర్ణయమని ఫిలింనగర్ టాక్. నిజానికి మ్యూజిక్ పైన అకీరాకు టచ్ ఉండటంతో ఆ వైపు కూడా ఓ లుక్కేసే అవకాశాలు ఉన్నాయి.. ఇక ఈమె సినిమాలతో పాటు పర్యావరణ కార్యకర్తగా, జంతు ప్రేమికురాలిగా సేవలందిస్తున్నారు.. తన స్తోమతకు తగిన విధంగా సాయం చేయడంతో పాటు , సమాజానికి అవగాహన కల్పిస్తుంటారు రేణు. ఎక్కువగా మూగజీవాలతో గడపటం , వాటి ఆలనా పాలనా చూడటం ఆమెకు ఎంతో ఇష్టం. అలాగే వాటికి ఏ కష్టం కలిగినా ఆమె చలించిపోతారు. ఇటీవల విజయవాడలో వరదల సందర్భంగా నీటిలో చిక్కుకున్న పెట్స్‌ను కాపాడాలని స్వయంగా తన మాజీ భర్త పవన్ కళ్యాణ్‌ను కోరారు.. దానిపై ఆయన స్పందించినట్లు కనిపించలేదు.

ఇక తాజాగా రేణు దేశాయ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఓ వీడియో హల్ చల్ చేస్తోంది. ఈ రోజు చాలా సంతోషంగా ఉందని , జీవితంలో ఈరోజును ఎప్పుడూ మరిచిపోనని చెప్పారు. మూగ జీవాలను రక్షించేందుకు వ్యక్తిగతంగా ఎంతో ప్రయత్నించానని తెలిపారు. వాటి సంక్షేమం ఏదైనా చెయ్యాలని సొంతంగా ఎన్జీవో స్థాపించాలని ఏళ్లుగా కలలు గంటున్నానని, ఇన్నాళ్లకు తన లక్ష్యం నెరవేరిందని రేణు చెప్పారు. ఈ రోజు సొంతంగా ఎన్జీవోను రిజిస్టర్ చేయించానని ఆమె స్పష్టం చేశారు. ఆర్ధిక సాయం చేయాలని అనుకునేవారు ముందుకు రావాలని రేణూ దేశాయ్ విజ్ఞప్తి చేశారు. ఆ వీడియో క్షణాల్లో వైరల్ అయ్యింది. దానిపై తాజాగా మెగా కోడలు, రామ్ చరణ్ వైఫ్ ఉపాసన స్పందించి భారీ సాయాన్ని అందించి అత్తగారి కోరికను తీర్చారు. పెట్స్ కోసం రిస్క్యు వ్యాన్ ను రైమ్స్ పేరుతో అందించారని తెలుస్తుంది. ఈ వార్త వైరల్ అవ్వడంతో ఉపాసన చేసిన పని మెగా ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎంత మంచి మంచి మనసు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. వీరి లైకులు, కామెంట్స్ ఈ వార్త వైరల్ గా మారింది.


Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×