BigTV English

Upasana Konidela: మనం ఎలాంటి స్వాతంత్య్రాన్ని జరుపుకుంటున్నాం: కోల్‌కతా ఘటనపై ఉపాసన విచారం

Upasana Konidela: మనం ఎలాంటి స్వాతంత్య్రాన్ని జరుపుకుంటున్నాం: కోల్‌కతా ఘటనపై ఉపాసన విచారం

Upasana konidela Tweet on Kolkata Trainee Doctor Rape Murder case: మాటలకందని మరో దారుణం.. కోల్ కత్తా ఆర్జీకర్ హాస్పిటల్ లో వైద్యవిద్యార్థినిపై అత్యంత భయంకరంగా రేప్ అండ్ మర్డర్. గత 6 రోజులుగా ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అట్టుడుకుతోంది. ఇంత పెద్ద వ్యవస్థ. ఇంత మంది డాక్టర్లు, సెక్యూరిటీ, అయినా ఏం లాభం. ఓ నిండు జీవితం కామాంధుడి చేతిలో బలైపోయింది.


అత్యంత దారుణాతి దారుణంగా శరీరానికి తూట్లు పడ్డాయి. ఓవైపు ఇంత దారుణమైన ఘటన జరిగితే నెమ్మదిగా దర్యాప్తు జరగడంపై వైద్య విద్యార్థులు ఆందోళనలను తీవ్రం చేశారు. దేశమంతా మెడికోలు సంఘీభావం ప్రకటించారు. క్యాండిల్ ర్యాలీలు చేశారు. బాధితురాలికి న్యాయం జరగాలని డిమాండ్ చేస్తున్నారు. మరోసారి నిర్భయ ఘటనను గుర్తుకు తెచ్చిన ఈ ఘటన సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేసింది.

ఇప్పుడు ఇదే ఘటనపై కొణిదెల వారి కోడలు ఉపాసన ఎక్స్ వేదికగా ఆవేదన వ్యక్తం చేసింది. మానవత్వాన్నే అపహాస్యం చేసే ఘటన ఇది. సమాజంలో అనగారికత కొనసాగుతుంటే.. మనం ఎలాంటి స్వాతంత్య్రాన్ని జరుపుకుంటున్నామని విచారం వ్యక్తం చేసింది. కోల్ కతా ఘటన నన్ను ఎంతో కలిచివేసింది. మహిళలకు ఎక్కడ రక్షణ ఉంది అని ఆవేదన వ్యక్తం చేసింది. దేశ ఆరోగ్య సంరక్షణకు మహిళలే వెన్నెముక. ఈ రంగంలో వర్క్ ఫోర్స్ లో 50 శాతం పైగానే స్త్రీలు ఉన్నారని తెలిపింది. మహిళలను వర్క్ ఫోర్స్ లోకి తీసుకురావాలనే నా లక్ష్యం ఇంకా బలపడింది. ప్రతి మహిళకు భద్రత, గౌరవాన్ని అందించేందుకు అన్ని విధాల కృషిచేద్దాం అని ఎక్స్ ద్వారా ట్వీట్ చేసింది.


Also Read: పవన్‌ ‘OG’ ఫ్యాన్స్‌కు దిమ్మతిరిగే న్యూస్.. టీజర్ రిలీజ్ డేట్ వచ్చేసింది..!

అదే విధంగా ఈ ఘటనపై ఆలీయా భట్ కూడా స్పందించింది. మరో దారుణమైన సంఘటన. స్త్రీలకు ఎక్కడ భద్రత లేదని అసహనం వ్యక్తం చేసింది. ఈ సంఘటన 10 ఏళ్లక్రితం జరిగిన నిర్భయ విషాదంలా ఉంది. మహిళలు రక్షణ విషయంలో మార్పులు తీసుకురావాలి. ఈ సంఘటన నన్ను ఎంతో కలిచి వేసిందిన ఇన్ స్టా వేదికగా తెలియజేసింది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×