HHVM: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఏపీకి డీసీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాబోతున్న తొలి చిత్రం ‘హరిహర వీరమల్లు’. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా జ్యోతి కృష్ణ (Jyoti Krishna) దర్శకత్వంలో జూన్ 12వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కానీ ఇప్పుడు సినిమా వాయిదా పడింది. దీంతో అభిమానులు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు చిత్ర యూనిట్ పైన. అసలు విషయంలోకి వెళ్తే.. ఎప్పుడో 2021 లోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యింది. క్రిష్ జాగర్లమూడి (Krish Jagarlamudi) దర్శకత్వంలో ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది. కారణం కరోనా, లాక్ డౌన్ పైగా పవన్ కళ్యాణ్ రాజకీయాలలో బిజీగా ఉండడం వల్ల ఈ సినిమాకి డేట్స్ కేటాయించలేకపోయారు. ఇక అన్ని రోజులు ఎదురు చూడడం ఇష్టం లేక సినిమా నుండి తప్పుకున్నారు క్రిష్ .
మళ్లీ వాయిదా పడ్డ హరిహర వీరమల్లు..
ఇక వెంటనే రంగంలోకి దిగిన జ్యోతి కృష్ణ.. క్రిష్ సమక్షంలో సినిమా స్క్రిప్టును హ్యాండ్ ఓవర్ చేసుకొని, మిగిలిన భాగాన్ని షూటింగ్ చేశారు. ఇక అప్పుడో ఇప్పుడో అంటూ దాదాపు 13 సార్లు వాయిదా పడుతూ వచ్చింది ఈ సినిమా. ఇక జూన్ 12వ తేదీన కచ్చితంగా రిలీజ్ చేస్తామని, పైగా ఆ రోజు సెంటిమెంట్ అని, పవన్ కళ్యాణ్ ఎన్నో ఏళ్ళు రాజకీయ జీవితం కోసం పోరాడి, 2024 జూన్ 12న డిప్యూటీ సీఎం అనబడే నేను అంటూ ప్రమాణస్వీకారం చేశారని, అది ఆయనకు లక్కీ కాబట్టి ఆ రోజున ఖచ్చితంగా రిలీజ్ అవుతుందని ఏవేవో సెంటిమెంట్లు తెరపైకి తెచ్చారు. దీంతో అభిమానులు కూడా హమ్మయ్య ఇక రిలీజ్ అవుతుంది అంటూ ఊపిరి పీల్చుకున్నారు.
పరిశీలనలో మూడు డేట్లు..
ఇక అభిమానులు కూడా జూన్ 12వ తేదీ కోసం ఈగర్ గా ఎదురు చూడగా.. ఇప్పుడు మళ్ళీ అభిమానులకు భారీ షాక్ ఇచ్చింది చిత్ర బృందం. సినిమాను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పుడు మళ్లీ మూడు డేట్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. అసలు విషయంలోకి వెళ్తే.. హరిహర వీరమల్లు సినిమాను విడుదల చేయడానికి జూన్ 27..జూలై 4..జూలై 11 ఇలా 3 డేట్ లు పరిశీలనలో వున్నాయని సమాచారం. అయితే జూన్ 27న సినిమాలు రిలీజ్ చేద్దాం అనుకుంటే ఆరోజు మంచు విష్ణు (Manchu Vishnu) ప్రెస్టేజియస్ మూవీగా తెరకెక్కుతున్న ‘కన్నప్ప’ సినిమా విడుదల కాబోతోంది.
ఇక మరొకవైపు జూలై 4వ తేదీన విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), గౌతమ్ తిన్ననూరి(Gautham thinnanuri) కాంబినేషన్లో వస్తున్న ‘కింగ్డమ్’సినిమా విడుదల కానుంది. ఇక జూలై 11 వ తేదీన ప్రముఖ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో అనుష్క శెట్టి (Anushka Shetty) హీరోయిన్గా లీడ్ రోల్ పోషిస్తూ తెరకెక్కుతున్న ‘ఘాటీ’ సినిమా రిలీజ్ కాబోతున్నాయి. దీంతో ఈ మూడు చిత్రాలు.. ఈ మూడు డేట్లలో సినిమాకు పోటీగా నిలవనున్నాయి అందుకే ఇప్పుడు చిత్ర బృందం కన్ఫ్యూజన్లో పడింది. ఏ రోజున సినిమా విడుదల చేయాలని తెగ కన్ఫ్యూజ్ అవుతున్న నేపథ్యంలో మరో వార్త తెరపైకి వచ్చింది.
రంగంలోకి దిగిన త్రివిక్రమ్..
కింగ్డమ్ మూవీకి నిర్మాత నాగ వంశీ (Naga Vamsi)కాబట్టి త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) పవన్ కళ్యాణ్ కోసం రంగంలోకి దిగి, నాగ వంశీని మేనేజ్ చేసి, జూలై 4వ తేదీన సినిమాని విడుదల చేయాలని ఆలోచిస్తున్నారట. ఒకవేళ ఇదే నిజమైతే కింద ‘కింగ్ డం’ మూవీ మళ్లీ వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనా ఇంత కన్ఫ్యూజన్లో పడ్డ చిత్ర బృందం ఇప్పటికైనా ఫిక్స్ అవుతారా? లేదా? అని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ALSO READ:Thug life Twitter Review: థగ్ లైఫ్ ట్విట్టర్ రివ్యూ.. సినిమాను నిలబెట్టింది వీళ్లేనా?