BigTV English

Upendra UI: మీడియాపై ఉపేంద్ర అసహనం.. నెటిజెన్స్ ఫైర్..!

Upendra UI: మీడియాపై ఉపేంద్ర అసహనం.. నెటిజెన్స్ ఫైర్..!

Upendra UI :కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర (Upendra)తాజాగా నటించిన చిత్రం ‘యూఐ’. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా అందుకు తగ్గట్టుగానే ప్రేక్షకులను మెప్పిస్తోంది. ముఖ్యంగా “మూర్ఖులు అయితేనే సినిమా చూడండి” అంటూ థియేటర్లో వేసిన కొటేషన్ ఆడియన్స్ ని ఆశ్చర్యపరిచాయి. ఒకరకంగా చెప్పాలి అంటే భిన్నత్వం కోరుకునే వారికి ఈ సినిమా సూపర్ గుడ్.. సాధారణ ఆడియన్స్ కి మాత్రం ఒక పట్టాన అర్థం కాదు అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ సినిమాకు పోటీగా మరో హీరో కిచ్చా సుదీప్ (Kiccha Sudeep) ‘మాక్స్’ మూవీ కూడా పోటీ పడుతోంది. ముఖ్యంగా యూఐ సినిమాతో పోల్చుకుంటే కిచ్చా సుదీప్ మాక్స్ సినిమా అందరికీ అర్థమయ్యే రొటీన్ యాక్షన్ డ్రామా అని చెప్పవచ్చు. అందులోనూ మంచి గ్రిప్పింగ్ స్టోరీ, స్క్రీన్ ప్లే ఉండడంతో సుదీప్ మాస్ యాక్షన్ సీక్వెన్స్ క్లిక్ అవుతూ కలెక్షన్లు పెరుగుతున్నాయి. ఒక రకంగా చెప్పాలి అంటే కిచ్చా సుదీప్ మాక్స్ దెబ్బకి యూఐ కాస్త సైడ్ అయిపోయిందనే వార్తలు వినిపిస్తున్నాయి.


మాక్స్ గురించి ప్రశ్న.. ఉపేంద్ర అసహనం

ఈ క్రమంలోనే తాజాగా యూఐ సక్సెస్ మీట్ లో భాగంగా ఉపేంద్రకు మాక్స్ సినిమాకు సంబంధించిన ప్రశ్న ఎదురవడంతో ఆయన మీడియా మిత్రులపై అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇంటర్వ్యూలో భాగంగా మాక్స్ సినిమా కారణంగా యూఐ కలెక్షన్ల మీద ప్రభావం పడుతోందా? అంటూ మీడియా అడిగింది. దీనికి ఉపేంద్ర కాస్త అసహనం వ్యక్తం చేస్తూ..”నాకు ఏ సినిమా గురించి తెలియదు. నాకు కేవలం యూఐ మాత్రమే తెలుసు” అన్నట్టు సమాధానం ఇచ్చాడు. దీంతో కిచ్చా సుదీప్, ఉపేంద్ర అభిమానుల మధ్య వార్ మొదలైనట్టు కనిపిస్తోంది. ఎందుకంటే ఉపేంద్రను కిచ్చా సుదీప్ గురువులా భావిస్తాడు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఉపేంద్ర సడన్ గా ఇలా మాట్లాడడంతో నెటిజన్లు కూడా ఇది సరైన పద్ధతి కాదు అంటూ కామెంట్లు చేస్తున్నారు.


భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న నెటిజన్స్..

అయితే మరో వర్గం నెటిజన్స్ మాత్రం ఒక హీరో సక్సెస్ మీట్ లో ఇంకో హీరో గురించి అడగడం తప్పే. అందుకే అలా సహనం కోల్పోయి ఉపేంద్ర మాట్లాడి ఉంటాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రశ్న ఏదైనా సరే కాస్త కూల్ గా హ్యాండిల్ చేయాల్సింది అంటూ ఇంకొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఉపేంద్రకు సుదీప్ ఎప్పుడూ గౌరవం ఇస్తూనే ఉంటాడు కదా.. ఇలాంటి చర్యల వల్లే ఉపేంద్ర తన స్థాయిని తగ్గించుకుంటాడు అంటూ కూడా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. ఏదిఏమైనా కథా కంటెంట్ బాగుంటే ప్రతి ఒక్కరిని ఆడియన్స్ ఆదరిస్తారని ఈ మధ్యకాలంలో నిరూపిస్తున్న విషయం తెలిసిందే. ఇక కిచ్చా సుదీప్ మాక్స్ సినిమా విషయానికొస్తే.. తెలుగులో కూడా మంచి క్రేజ్ ఏర్పడింది. లోకేష్ కనగరాజు తీసిన ఖైదీ సినిమాలా ఉందని, యాక్షన్ సీక్వెన్స్ మాస్ ఆడియన్స్ కి బాగా ఎక్కేస్తున్నాయని కూడా టాలీవుడ్ సినీ లవర్స్ చెప్పుకొస్తున్నారు. ఏది ఏమైనా కిచ్చా సుదీప్ మూవీకి అటు కన్నడ ఇటు టాలీవుడ్ లో భారీ పాపులారిటీ లభిస్తోంది అని చెప్పవచ్చు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×