Triptii Dimri : త్రిప్తి దిమ్రీ (Triptii Dimri) గత కొంత కాలంగా వరుసగా వార్తల్లో నిలుస్తోంది. ‘యానిమల్’ సినిమాతో ఆమె కెరీర్ టర్న్ అయ్యింది. కానీ ఆ తరువాత ఆమె చేస్తున్న సినిమాలు వివాదాస్పదం అవుతున్నాయి. తాజాగా బోల్డ్ బ్యూటీ త్రిప్తి గురించి మరో వివాదాస్పద నటి ఉర్ఫీ జావేద్ (Urfi Javed) చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రిలో హాట్ టాపిక్ ఆ మారాయి. ఇటీవల ‘విక్కీ విద్యా కా వో తా మేరే మెహబూబ్’ చిత్రంలో త్రిప్తి చేసిన డ్యాన్స్ పై విమర్శలు వినిపించిన సంగతి తెలిసిందే. అయితే ఉర్ఫీ ఆమె బాగా డ్యాన్స్ చేయలేదని కామెంట్ చేసింది.
ఉర్ఫీ జావేద్ అసాధారణమైన దుస్తులు ధరించి సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యారు. అంతేకాదు ఆమె ఇచ్చే ఓపెన్ స్టేట్మెంట్స్ కూడా హాట్ టాపిక్కే. కాగా త్రిప్తి దిమ్రీ (Triptii Dimri)ని తాజాగా ఉర్ఫీ జావేద్ (Urfi Javed) ఎగతాళి చేసింది. ఒక ఇంటర్వ్యూలో ఉర్ఫీ జావేద్ మాట్లాడుతూ త్రిప్తి దిమ్రీ డ్యాన్స్‌ను డర్టీ డ్యాన్స్ అనేసింది. త్రిప్తి గురించి ఉర్ఫీ జావేద్ ఏం చెప్పారో తెలుసుకుందాం పదండి.
ఇంటర్వ్యూలో మీకు ఏ నటి నచ్చదు? ముఖ్యంగా ఏ నటి డ్యాన్స్ క్లాస్‌లో చేరాలని ఉర్ఫీ జావేద్ (Urfi Javed)ని అడిగినప్పుడు. ఉర్ఫీ జావేద్ ఆలోచించకుండా త్రిప్తి దిమ్రీ (Triptii Dimri) పేరును చెప్పేసింది. ‘ఆమెకు డ్యాన్స్ క్లాసులు అవసరం. తృప్తి, ఆమె చాలా మంచి నటి, కానీ ‘విక్కీ విద్యా కా వో తా మేరే మెహబూబ్’ సాంగ్ లో ఆమె చేసిన డ్యాన్స్ కొంచెం డర్టీగా ఉంది. అయితే త్రిప్తి చాలా అందమైన నటి’ అని ఉర్ఫీ జావేద్ చెప్పుకొచ్చింది. ఆమె విషయాన్ని నార్మల్ గానే చెప్పినప్పటికి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై జనాలు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. బీ గ్రేడ్ హీరోయిన్ అని త్రిప్తి మీద ఉర్ఫీ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇటు త్రిప్తి అభిమానులు కూడా ఉర్ఫి పై ఘాటు కామెంట్స్ చేస్తున్నారు. ముందు బట్టలు సరిగ్గా వేసుకో అంటూ ఉర్ఫీపై మండిపడుతున్నారు.
అయితే ‘విక్కీ విద్యా కా వో తా మేరే మెహబూబ్’ సమయంలోనే ఈ సాంగ్ గురించి త్రిప్తి (Triptii Dimri) పై దారుణంగా ట్రోలింగ్ జరగ్గా, ఆమె స్పందించింది. ‘నేను చేయగలిగింది చేయడానికి ప్రయత్నించాను. కానీ ప్రతి ఒక్కరూ అన్నింటిలో మెరుగ్గా ఉండలేరు. అయితే ప్రయత్నించడంలో ప్రయోజనం ఏమిటంటే బెస్ట్ ఇవ్వగలుగుతాం. నేనెప్పుడూ ఇలాంటివి చేయలేదు. అయితే ప్రజలు కొన్ని విషయాలను ఇష్టపడతారు, కొందరు ఇష్టపడరు. కానీ ప్రయోగాలు చేయడం మానేయాలని దీని అర్థం కాదు’ అంటూ తనను తాను సమర్థించుకుంది.
ఇదిలా ఉండగా త్రిప్తి (Triptii Dimri) ఖాతాలో వరుస సినిమాలు ఉన్నాయి. ఇటీవల విడుదలైన ‘భూల్ భూలయ్యా 3’ చిత్రంలో ఆమె కనిపించింది. ఇందులో కార్తీక్ ఆర్యన్, మాధురీ దీక్షిత్, విద్యా బాలన్ ముఖ్యమైన పాత్రల్లో నటించారు. ఇప్పుడు సిద్ధాంత్ చతుర్వేదితో త్రిప్తి ‘ధడక్ 2’ చిత్రంలో కనిపించబోతోంది.