Urvashi Rautela:అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే 78వ కేన్స్ ఫిలిం ఫెస్టివల్ అత్యంత ఘనంగా మంగళవారం నాడు ప్రారంభం అయ్యింది. రెండు వారాలపాటు జరిగే ఈ ఉత్సవాలలో సెలబ్రిటీలు తమ ప్రతిభను చాటుకోబోతున్నారు. భారతదేశం నుంచి నాలుగు సినిమాలను ఇక్కడ ప్రీమియర్ గా కూడా వేస్తున్నారు. ఇప్పటికే ఐశ్వర్యారాయ్ (Aishwarya Rai), అలియా భట్ (Alia Bhatt), జాన్వీ కపూర్ (Janhvi Kapoor) వంటి స్టార్ లు రెడ్ కార్పెట్ ఈవెంట్ పై సందడి చేయనున్నారు. అంతేకాదు వీరి ప్రదర్శన కేన్స్ 2025 కి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఇదిలా ఉండగా మరొకవైపు ఈ కేన్స్ రెడ్ కార్పెట్ పై రెండోసారి నడిచి అందరినీ ఆశ్చర్యపరిచింది.
కేన్స్ ఫెస్టివల్ లో ఊర్వశీ రౌతేలా.. డ్రెస్ ఖరీదు ఎంతంటే..?
కేన్స్ ఫెస్టివల్ లో ఊర్వశీ రౌతేలా ఎంపిక చేసుకున్న ఈ డ్రెస్ లుక్ అందరినీ ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా ఈమె ఎంపిక చేసుకున్న ముదురు రంగు దుస్తులు, ముదురు రంగు మేకప్ తో సహా ప్రతిదీ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీనికి తోడు తన చేతిలో విచిత్రమైన విలాసవంతమైన చిలుక ఆకారపు క్లచ్ బ్యాగ్ ధరించడంతో అందరి దృష్టిని అది ఆకర్షించిందని చెప్పవచ్చు. కేన్స్ 2025 ఫిలిం ఫెస్టివల్ లో భాగంగా మొదటి రోజు రెడ్ కార్పెట్ పై నడిచి అందరిని ఆశ్చర్యపరిచిన ఈమె ధరించిన ఈ డ్రెస్ ఖరీదు ఎంత అని అభిమానులు సైతం ఆరా తీయగా, ప్రముఖ డిజైనర్ జుడిత్ లీబర్ రూపొందించిన ఈ డ్రెస్ ఖరీదు అక్షరాల రూ.4,67,895. ఈ ధర తెలిసి అందరూ నోరెళ్ళబెడుతున్నారు. దీనికి తోడు విలాసవంతమైన అల్ట్రా గ్లామరస్ ప్యారేట్ బ్లింగ్ క్లచ్ బ్యాగును ధరించింది. ఇక రకరకాల రంగులతో ఆకర్షించే స్పటికాలతో తయారుచేసిన ఈ బ్యాగ్ అందరి దృష్టిని ఆకర్షించింది. దీనికి తోడు ఈ లుక్ కి అదనంగా ఈమె ఒక కిరీటం కూడా ధరించింది. తలపై మల్టీకలర్ రత్నాలతో అలంకరించిన రాచరికపు కిరీటాన్ని ఎంపిక చేసుకుంది. ఇకపోతే ఈ లుక్ లో ఈమెను చూసి కొంతమంది నెటిజన్స్ ఊర్వశి చాలా అందంగా కనిపిస్తోంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికైతే కేన్స్ ఫెస్టివల్ లో అందరి దృష్టిని ఆకర్షించి, తన డ్రెస్ ఖరీదుతో మరొకసారి అందర్నీ మెస్మరైజ్ చేసింది ఊర్వశీ రౌతేలా..
ఊర్వశీ రౌతేలా కెరియర్..
ఊర్వశి కెరియర్ విషయానికి వస్తే.. మోడల్ గా కెరియర్ ఆరంభించి, ఆ తర్వాత నటిగా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టింది. ఎక్కువగా బాలీవుడ్, టాలీవుడ్ సినిమాలలో కనిపించే ఈమె.. 2015లో మిస్ దివా యూనివర్స్ టైటిల్ ను గెలుచుకుంది. ఇక తొలిసారి హిందీలో 2013లో వచ్చిన ‘సింగ్ సాబ్ ది గ్రేట్’ సినిమా ద్వారా తొలిసారి ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె.. ఆ తర్వాత సనంరే , హేట్ స్టోరీ 4, వంటి ప్రముఖ చిత్రాలలో నటించింది. ఇక తెలుగులో వాల్తేరు వీరయ్య, ఏజెంట్ , బ్రో, స్కంద , డాకు మహారాజ్ వంటి చిత్రాలలో నటించి ఆకట్టుకుంది.
?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
ALSO READ:Jaya Prakash Reddy: ఏంటి.. ఈ స్టార్ విలన్ కి ఇద్దరు భార్యలా.. నిజాలు బయటపెట్టిన కూతురు..!