Jaya Prakash Reddy..రాయలసీమ యాసకు పెట్టింది పేరుగా జయప్రకాశ్ రెడ్డి (Jaya Prakash Reddy) పేరు సొంతం చేసుకున్నారు
ప్రముఖ నటుడిగా, కమెడియన్ గా, విలన్ గా తన కెరియర్ లో 300కు పైగా సినిమాలలో నటించి, పేరు సొంతం చేసుకున్నారు. ఇండస్ట్రీలోకి రాకముందు ఉపాధ్యాయుడిగా పని చేసిన ఈయన.. సినిమా పైన మక్కువతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. వాస్తవానికి చిన్నప్పటినుంచే నాటకాలు అంటే ఆసక్తి ఉండేది. తన తండ్రి కూడా నటుడే కావడంతో ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా అడ్డు చెప్పలేదు. అలా తండ్రీ కొడుకులు కలసి నాటకాలలో నటించేవారు. అనంతపురంలోని పాఠశాలల్లో చదువుకునేటప్పుడు అక్కడ టీచర్లు అందరూ ఆచార్యులు కావడంతో ఈయనను నాటకాలలో కూడా ప్రోత్సహించారు. ఇకపోతే గప్ చుప్ అనే నాటకాన్ని జయప్రకాశ్ రెడ్డి ప్రదర్శిస్తుండగా.. దాసరి నారాయణరావు (Dasari Narayana Rao) కు ఈయన నటన నచ్చి, నిర్మాత రామానాయుడు కి పరిచయం చేశాడు. అలా 1988లో విడుదలైన ‘బ్రహ్మపుత్రుడు’ సినిమాతో తెలుగు సినీ రంగానికి పరిచయమయ్యారు జయప్రకాశ్ రెడ్డి.
జయప్రకాశ్ రెడ్డి 2 పెళ్లిళ్లు చేసుకోవడం వెనుక కారణం..?
ఇక ఈయనకు మంచి గుర్తింపును తీసుకొచ్చిన చిత్రాలలో ప్రేమించుకుందాం రా, జయం మనదేరా, కిక్, ఎవడి గోల వాడిది, సమరసింహారెడ్డి, చెన్నకేశవరెడ్డి, ఢీ వంటి చిత్రాలు మంచి ఇమేజ్ తెచ్చి పెట్టాయి. ఒకప్పుడు గొప్ప నటుడిగా ప్రేక్షకులను అలరించిన ఈయన, 2020 సెప్టెంబర్ 8న గుంటూరులోని తన నివాసంలో గుండెపోటుతో మరణించారు. ఇక ఈ విషయాన్ని అభిమానులు, సినీ ఇండస్ట్రీ కూడా జీర్ణించుకోలేకపోయింది. తరాలు మారినా ఈయనను మర్చిపోని అభిమానులు ఎంతోమంది ఉన్నారు. అలా ఇప్పటికీ ఈయనకు సంబంధించిన ఏదో ఒక విషయం వైరల్ అవుతూనే ఉంటుంది. అందులో భాగంగానే జయప్రకాశ్ రెడ్డి రెండు వివాహాలు చేసుకున్నారనే వార్తలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి. అయితే జయప్రకాశ్ రెడ్డి రెండు వివాహాలు చేసుకోవడం వెనుక అసలు కారణం ఏమిటి? మొదటి భార్యకు ఏమైంది..? అందరూ కలిసి ఆమెకు అన్యాయం చేశారా..? అసలు ఏం జరిగింది? అనే విషయాలు వైరల్ అవుతుండగా.. తాజాగా జయప్రకాష్ రెడ్డి కూతురు ఒక ఇంటర్వ్యూలో పాల్గొని, తన తండ్రి రెండు వివాహాలు చేసుకోవడం వెనుక అసలు విషయాన్ని బయటపెట్టింది.
also read ; Thug Life TV Rights : టెలివిజన్ రేట్స్ కే మరీ ఇన్ని కోట్లా..? ఇది కేవలం కమల్ హాసన్ తోనే సాధ్యం
అందుకే మా నాన్న రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు – మల్లికా రెడ్డి.
జయప్రకాశ్ రెడ్డి కూతురు మల్లికా రెడ్డి మాట్లాడుతూ..” మా నాన్నకు స్కూల్లో జాబ్ రాగానే 22 సంవత్సరాలకే.. తాతయ్య, నానమ్మ మంచి సంబంధం చూసి పెళ్లి చేశారు. అయితే పెళ్లయి ఎనిమిదేళ్లయినా వారికి పిల్లలు కాలేదు. పైగా ఇద్దరు చెల్లెలు, ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు. పెద్ద వాడికి పిల్లలు లేరంటే మిగతా వారికి ఏదైనా ఇబ్బంది కలుగుతుందేమో అని.. ఎంతోమంది వైద్యులను, జ్యోతిష్కులను కలిశారు. కానీ సమస్య ఏమీ లేదని చెప్పారు. దాంతో తాతయ్య, నానమ్మ నాన్నకు మళ్ళీ రెండో పెళ్లి చేయాలనుకున్నారు. అలా నాలుగేళ్ల ప్రయత్నం తర్వాత నాన్న మళ్ళీ పెళ్లికి ఒప్పుకున్నారు. ఇకపోతే నాన్న మున్సిపల్ స్కూల్లో పనిచేసేటప్పుడు.. టెన్త్ క్లాస్ విద్యార్థులను సెంటర్ కి తీసుకెళ్లి ఎక్సామ్ రాయించే రోజులవి. అక్కడే పనిచేస్తున్న మా అమ్మని చూసి, ఆ విషయాన్ని తాతయ్యకు చెప్పి, అలా ఇరు కుటుంబాలు మాట్లాడుకొని పెళ్లి చేశారు. అమ్మానాన్నకు పెళ్లయిన తర్వాత నేను పుట్టాను. అయితే నేను పుట్టిన కొన్నాళ్లకే మా పెద్దమ్మ ( నాన్న మొదటి భార్య) అనుకోకుండా ప్రెగ్నెంట్ అయింది. ఆమెకి ఒక కొడుకు పుట్టాడు. అలా ఇప్పుడు నాకు ఒక తమ్ముడు ఉన్నాడు” అంటూ జయప్రకాష్ రెడ్డి రెండు పెళ్లిళ్లు చేసుకోవడం వెనుక అసలు విషయాన్ని చెప్పింది ఆయన కూతురు మల్లికా రెడ్డి. ఇక ఈ రెండు కుటుంబాల మధ్య కూడా ఎటువంటి విభేదాలు లేవని, అందరూ ఒకే ఫ్యామిలీ లాగ కలిసి ఉన్నాము అంటూ కూడా ఆమె తెలిపింది.