Urvashi Rautela: మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ఎంతో ఉన్నతమైన వ్యక్తి అనే సంగతి అందరికీ తెలిసిందే. ఆయన తన సినిమాలతో ప్రేక్షకులను అలరించడమే కాకుండా కష్టం వచ్చిన వారిని ఆదుకుంటూ..మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషిగా పేరు సొంతం చేసుకున్నారు. ఇండస్ట్రీలో ఎవరు ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా కూడా ఆయన పరోక్షంగా సహాయం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఆయన చేసే దాన ధర్మాలను బయటికి ఎక్కువగా తెలియనివ్వరు. కానీ ఆయన చేతి సహాయం అందుకున్న ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో ఆయన గురించి,ఆయన మంచితనం గురించి బయటపెట్టిన వారే. ఇప్పటికే ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఇండస్ట్రీలో ఎంతో ఉన్నతమైన వ్యక్తిత్వం ఉన్న మనిషిగా పేరు తెచ్చుకున్న చిరంజీవి రీసెంట్గా కొన్ని వివాదాల్లో ఇరుక్కున్న సంగతి మనకు తెలిసిందే. బ్రహ్మా ఆనందం(Brahma Anandam) ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన తన కొడుకుకి అబ్బాయి పుట్టాలి అని లింగ వివక్షతతో మాట్లాడడంతో ఇది కాస్త కాంట్రవర్సీకి దారితీసింది. అలాగే అదే ఈవెంట్లో బ్రహ్మానందం (Brahmanandam) ని ఎర్రి అని మాట్లాడడాన్ని కూడా చాలామంది తప్పుగా చూశారు.
చిరంజీవిపై విమర్శలు.. కట్ చేస్తే..
ఎంతో ఉన్నతమైన వ్యక్తిత్వం ఉన్న మెగాస్టార్ చిరంజీవి నోటి నుండి ఇలాంటి మాటలు రావడం నిజంగా దురదృష్టకరం అని ఎంతోమంది ఈయన మాటలపై అసహనం వ్యక్తం చేశారు.ఇక ట్రోలర్స్ కి దొరికిందే సందు అనుకొని మెగాస్టార్ పై ట్రోల్స్ పేల్చేశారు. ఇదంతా పక్కన పెడితే.. మెగాస్టార్ చిరంజీవి వ్యక్తిత్వం ఎలాంటిదో..ఆయన ఎంత మంచి మనసు గలవారో తాజాగా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా.. ఊర్వశీ రౌతేల(Urvasi Rautela) కేవలం బాలీవుడ్ లోనే కాకుండా టాలీవుడ్ లో కూడా స్పెషల్ సాంగ్స్ తో ఫేమస్ అయింది.అయితే అలాంటి ఊర్వశి రౌతేలా తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చిరంజీవికి జీవితాంతం రుణపడి ఉంటాను అంటూ కామెంట్ చేసింది ఊర్వశి. దీంతో అభిమానులు ఎందుకు ఇంత పెద్ద మాట చెబుతోంది అని సందేహాలు చేస్తున్నారు..అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..
చిరంజీవికి జీవితాంతం రుణపడి ఉంటాను – ఊర్వశీ
తాజాగా ఊర్వశీ మాట్లాడుతూ..”మా అమ్మ ఎడమ కాలు బోన్ కి సంబంధించి తీవ్రమైన ఇబ్బందితో బాధపడుతున్న సమయంలో ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా కూడా సరైన ట్రీట్మెంట్ అందలేదు.దాంతో నేను చిరంజీవి గారిని సహాయం అడగాలని మొహమాట పడుతూనే ఆయన్ని సహాయం అడిగాను. ఇక ఆయనని నోరు విడిచి అడిగిన క్షణంలోనే కలకత్తాలోని అపోలో హాస్పిటల్ కి ఫోన్ చేసి అక్కడ డాక్టర్లతో మాట్లాడి మా అమ్మకు మంచి వైద్యం అందేలా చేశారు.
ఇక అపోలో డాక్టర్ చిరంజీవి మాటల్ని గౌరవించి మా అమ్మకు మంచి ట్రీట్మెంట్ ఇచ్చారు. ఆయన చేసిన సహాయానికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను” అంటూ బాలీవుడ్ నటి ఊర్వశీ రౌతేలా చిరంజీవి (Chiranjeevi) వ్యక్తిత్వం ఎలాంటిదో ఒక్క ఇంటర్వ్యూ తో బయటపెట్టింది. అయితే తాజాగా చిరంజీవిపై ట్రోల్స్ వస్తున్న నేపథ్యంలో ఊర్వశీ రౌతేలా చేసిన వ్యాఖ్యలు చిరంజీవి గొప్పతనం ఎలాంటిదో బయటపెట్టింది. దీంతో మెగా ఫ్యాన్స్ చిన్న చిన్న మాటల్ని కాదు ఆయన చేసే పెద్ద పెద్ద పనులను గుర్తించండి అంటూ చిరంజీవి పై ట్రోల్స్ చేసే వారికి కౌంటర్లు ఇస్తున్నారు. ఇక ఊర్వశి రౌతేలా మెగాస్టార్ చిరంజీవితో వాల్తేర్ వీరయ్య(Waltheir Veerayya) మూవీలో “బాసూ వేర్ ఈజ్ ద పార్టీ” అనే స్పెషల్ సాంగ్ లో చేసింది.