Big Tv Live Original: ఈ రోజుల్లో చాలా మంది వంటలకు సంబంధించిన ఛానెల్స్ రన్ చేస్తున్నారు. వెరైటీ వెరైటీ వంటలు చేస్తూ నోరూరించేలా చేస్తున్నారు. వాటిని చూసి పలువురు మహిళలు ఇంట్లోనూ ట్రై చేస్తున్నారు. ఇంట్లో వాళ్లందరికీ నోరూరించే వంటలను అందిస్తున్నారు. అయితే, కొంత మంది చేసే వంటలు వావ్.. అని పించేలా ఉంటే, మరికొంత మంది చేసే వంటలు వామ్మో అనిపిస్తుంటాయి. తాజాగా ఒ విదేశీ అమ్మాయి తన ఇన్ స్టాలో షేర్ చేసిన వీడియో చూసి ఇదెక్కడి రెసిపీరా బాబోయ్ అని ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ ఆమె చేసిన వంట ఏంటో తెలుసా?
మిడతలతో కరకరలాడే పకోడీ
ఈ వీడియోలో ఓ యువతి చిన్న సంచిలో మిడతలు పట్టుకొచ్చింది. వాటిని నీళ్లలో వేసి శుభ్రంగా కడిగింది. ఐస్ ముక్కలు వేసి అటూ ఇటూ మిక్స్ చేయడంతో విడతలన్నీ చనిపోయాయి. వాటిని మరో గిన్నెలో నీళ్లు పోసి ఇంకోసారి శుభ్రంగా కడిగింది. ఆ తర్వాత ఈకలు, తోకలు తీసేసి, కడాయి లో నూనె పోసి మాంచిగా దోర రంగు వచ్చేలా వేయించింది. వాటిలో కొన్నింటిని తీసుకుని మైదా పిండిలో వేసి పకోడీ చేసింది. అచ్చం చికె పకోడీ మాదిరిగానే నోరూరించేలా తయారు చేసింది. ఇక మిగతా మిడతలను కారం, మసాలా వేసి దోరగా వేయించింది. కరివేపాకులు వేసి పోపువేసింది. కరకరలాగే మిడతల స్నాక్స్ ను రెడీ చేసింది. వాటిని తింటూ మైమరిచిపోయింది ఆ ముద్దుగుమ్మ.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మిడతల పకోడీ
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కొంతమంది ఈ వీడియోను చూస్తే మిడతల పకోడీ భలే తయారు చేశారంటూ కామెంట్స్ పెడుతుండగా, మరికొంత మంది వాక్ అంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియో 16 లక్షలకు పైగా లైక్స్ సాధించుకుంది. మిలియన్ల కొద్దీ వ్యూస్ సాధించింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఇన్ స్టాగ్రామ్ 78 వేలకుపైగా ఫాలోవర్స్ ను కలిగి ఉంది. తన పేజీలో రకరకాల వంటలకు సంబంధించిన వీడియోలను షేర్ చేస్తుంది. చేపలు, చికెన్, మటన్, ఎగ్స్ తో పాటు నూడుల్స్, నాన్ వెజ్ వంటలను కూడా చేస్తుంది. కొన్ని మనకు తెలియన వంటలను కూడా ట్రై చేస్తుంది. ఆమె చేసే వంటల్లో కొన్నివామ్మో అనిపించేలా ఉంటాయి. పిల్లలు అవుతున్న కోడిగుడ్లు, వేడి చేసి వాటిని పకోడి చేసి తింటుంటే, చూసేందు అసహ్యంగా కనిపిస్తున్నది. ఆమె చేసే వంటలు కొన్ని ఆహా అనిపించినప్పటికీ, మరికొన్ని చూస్తేనే జుగుప్సాకరంగా కనిపిస్తున్నాయి. మొత్తంగా ఈ ముద్దుగుమ్మ చేసే వంటలు సోషల్ మీడియాలో మాత్రం బాగానే వ్యూస్ సాధిస్తున్నాయి.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">
Read Also: స్వచ్ఛమైన ‘ప్రేమ’ ఇక చరిత్రేనా.. నేటితరం ‘సింగిల్’గా మిగిలిపోవడానికి కారణాలు ఇవేనట!