BigTV English

Urvashi Rautela Cuts Golden Cake: బర్త్ డే స్పెషల్.. వరల్డ్‌లోనే రిచెస్ట్ కేక్ కట్ చేసిన హీరోయిన్.. దుమ్మెత్తి పోస్తున్న నెటిజన్లు

Urvashi Rautela Cuts Golden Cake: బర్త్ డే స్పెషల్.. వరల్డ్‌లోనే రిచెస్ట్ కేక్ కట్ చేసిన హీరోయిన్.. దుమ్మెత్తి పోస్తున్న నెటిజన్లు
Urvashi Rautela Birthday Golden Cake
Urvashi Rautela Birthday Golden Cake

Urvashi Rautela Birthday Cake Cutting: ఇండస్ట్రీ సెలబ్రిటీలో ఏం చేసినా అది వార్తే. తుమ్మినా, దగ్గినా, కూర్చున్నా, నిల్చున్నా, నవ్వినా, ఏడ్చినా.. ప్రతీదీ సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. సెలబ్రిటీలు కాబట్టి.. వాళ్లేం చేసినా నెటిజన్లు కాస్త డిఫరెంట్ గానే చూస్తారు. కొందరు సెలబ్రిటీలు సాదాసీదాగా ఉంటే.. మరికొందరు మాత్రం.. లగ్జరీగా ఉంటారు. రిచ్ లైఫ్ ఎంజాయ్ చేస్తారు. అలాంటి సెలబ్రిటీల లిస్టులో.. ఊర్వశీ రౌతేలా ఒకరు.


అదేనండి వాల్తేరు వీరయ్యలో బాస్ పార్టీ సాంగ్ కు.. చిరంజీవితో కలిసి స్టెప్పులేసింది కదా. ఆ అమ్మాయి. నేడు ఊర్వశి రౌతేలా బర్త్ డే. ఈ సందర్భంగా గోల్డెన్ కేక్ కట్ చేసి వార్తల్లో నిలిచిందీ భామ. బంగారుపూత పూసిన కేక్ కట్ చేసి.. బర్త్ డే వేడుకలు గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది. ప్రతీ ఏటా తన పుట్టినరోజును గ్రాండ్ గా జరుపుకోవడం అంటే ఊర్వశీకి చాలా ఇష్టం.

Read More: తమిళ స్టార్ హీరో విజయ్‌ సినిమాపై తమన్నా విమర్శలు.. అదొక సినిమానా అంటూ..!


ఈ ఏడాది అచ్చంగా 24 క్యారెట్ల బంగారపు పూత పూసిన కేక్ ను కట్ చేసి.. ఆ ఫొటోలను తన ఇన్ స్టా ఖాతాలో పోస్ట్ చేసింది. ఇప్పుడా ఫొటోలు నెట్టింటిని షేక్ చేస్తున్నాయి. ఎంత బర్త్ డే అయితే మాత్రం.. తినే కేక్ కు బంగారపు పూత పూయడం అంత అవసరమా ? అని నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. డబ్బులు ఎక్కువైతే ఇలా బంగారంతో కేక్ చేసుకుని తింటారా ? అవి డబ్బులా మంచినీళ్లా ? అని తిట్టిపోస్తున్నారు. కాగా ఈ బంగారపు కేకు వరల్డ్ లోనే రిచెస్ట్ కేక్ అని తెలుస్తోంది. దీంతో ఇప్పుడు ఈ కేక్ వరల్డ్ రికార్డ్ కూడా సెట్ చేసినట్లయింది. ప్రస్తుతం ఈ వార్త తెలిసి అంతా నోరెళ్లబెడుతున్నారు.

Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×