E-Paper
Advertisement

సెంచ‌రీతో చెల‌రేగిన హంజా జహూర్…పాకిస్తాన్ చేతిలో టీమిండియా ఘోర ఓట‌మి

సెంచ‌రీతో చెల‌రేగిన హంజా జహూర్…పాకిస్తాన్ చేతిలో టీమిండియా ఘోర ఓట‌మి
Advertisement

IND Vs PAK U19 Asia Cup 2026:  ఆసియా కప్ 2026 అండర్ 19 టోర్నమెంట్ లో (U 19 Asia Cup 2026) భాగంగా జరిగిన కీలక మ్యాచ్ లో టీమిండియాకు ఘోర పరాభవం ఎదురయింది. ఆదివారం పాకిస్తాన్ తో జరిగిన ఉత్కంఠ పోరులో టీమిండియా మూడు వికెట్ల తేడాతో ఘోరంగా ఓడిపోయింది. టీమిండియా విధించిన లక్ష్యాన్ని చేదించే క్రమంలో హంజా జహూర్ సెంచరీతో చెలరేగాడు. దీంతో 48 ఓవర్లలోనే మ్యాచ్ ఫినిష్ చేసింది పాకిస్తాన్. ఈ త‌రుణంలోనే ఈ టోర్నీలో టీమిండియాకు తొలి ఓటమి ఎదురైంది.

సెంచ‌రీతో చెల‌రేగిన హంజా…పాకిస్తాన్ చేతిలో టీమిండియా ఘోర ఓట‌మి

ఆసియా కప్ అండర్ 19 2026 టోర్నమెంట్ లో భాగంగా టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ జూనియర్స్ మధ్య బిగ్ ఫైట్ జరిగింది. ఇందులో టీమిండియా మొదట బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో 46.3 ఓవర్లు ఆడిన జూనియర్స్ టీమిండియా 208 పరుగులు సాధించి కుప్పకూలింది. అర్జున్ రాజ్ పుత్ ఒక్కడే సెంచరీతో చెల‌రేగ‌గా.. మిగతా ఆటగాళ్ళు అందరూ విఫలమయ్యారు. దీంతో పాకిస్తాన్ ముందు కేవలం 208 పరుగులు మాత్రమే టార్గెట్ పెట్టగలిగింది టీం ఇండియా.

Advertisement

Pakistan Team Former Captain Shahid Afridi Shocking Comments On Abhishek Sharma Goes Viral  నా కంటే అభిషేక్ భయంకరంగా ఆడుతున్నారు..ప్రతీ సిక్సర్ స్టేడియం బయటే పడుతోంది

అయితే టార్గెట్ చిన్నది కావడంతో ముందు చెలరేగిన పాకిస్తాన్… ఆ తర్వాత ఐదు వికెట్లను కోల్పోయి పీకల్లోకి కష్టాల్లో పడింది. ఇలాంటి క్రమంలో పాకిస్తాన్ వికెట్ కీపర్ హంజా జహూర్ (Hamza Zahoor) చివరి వరకు నిలబడి మ్యాచ్ గెలిపించాడు. ఈ సందర్భంగా 108 బంతులు ఎదుర్కొన్న హంజా జహూర్ సెంచరీ చేశాడు. ఇందులో మూడు సిక్సులతో పాటు పది బౌండరీలు కూడా ఉన్నాయి.

Advertisement

హంజా జహూర్ చేల‌రేగడంతో 48.1 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల నష్టానికి లక్ష్యాన్ని చేదించింది పాకిస్తాన్ అండర్ 19 టీం. దీంతో టీమిండియాపై మూడు వికెట్ల తేడాతో సూపర్ విక్టరీ అందుకుంది. ఈ విజయంతో పాయింట్స్ టేబుల్ లో నాలుగు పాయింట్లు సాధించి అగ్రస్థానానికి చేరింది పాకిస్తాన్. అటు టీమిండియా రెండో స్థానానికి పడిపోయింది. ఇక యూఏఈ పై మరో మ్యాచ్ లో టీమిండియా గెలిస్తేనే.. ఆసియా కప్ టోర్నమెంటులో సెమీస్ కు దూసుకు వెళ్తుంది. లేకపోతే ఇంటి దారి పడుతుంది.

టీమిండియా కొంపముంచిన నో-బాల్

పాకిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా  (IND VS PAK) మ్యాచ్ లో యశ్‌వర్ధన్ చౌహాన్… రిజ్వానుల్లా బౌలింగ్ లో ఔట్ అయ్యాడు. అయితే ఈ సందర్భంగా రిజ్వానుల్లా నో-బాల్ వేశాడని టీమిండియా అభిమానులు ఆరోపిస్తున్నారు. కానీ టీవీ అంపైర్ పాకిస్తాన్ కు అమ్ముడు పోయి… య‌శ్ వ‌ర్ద‌న్ చౌహన్ ను ఔట్ గా ప్రకటించాడని విమర్శలు చేస్తున్నారు.

Harbhajan Singh Reaction On Ricky Ponting smashes World Cup-winning ton vs India: 2003 వ‌ర‌ల్డ్ క‌ప్ లో పాంటింగ్ ను క్లీన్ బౌల్డ్ చేసేవాడిని…కానీ గంగూలే ప్లాన్ చెడ‌దొబ్బాడు

Related News

టీమిండియా కొంప‌ముంచిన నో-బాల్…పాకిస్తాన్, అంపైర్ల మ‌ధ్య ఫిక్సింగ్ అంటూ!

ఆసియా క‌ప్ లో న‌వ్వుల పాలైన పాకిస్తాన్..షోయ‌బ్ మాలిక్-ఆజ్మ‌ల్ క్యాచ్ మిస్ సీన్ రిపీట్

పెళ్లికి పిల్ల దొర‌క‌డం లేద‌ని బాబ‌ర్ త‌ల్ల‌డిల్లిపోతున్నాడు…అందుకే బ్యాట్ ను నేల‌కేసి కొట్టాడు

2007 వ‌ర‌ల్డ్ క‌ప్ త‌ర‌హాలోనే గ్రూప్ స్టేజ్ లోనే టీమిండియాను ఇంటికి త‌రిమేస్తాం!

వెల్లింగ్ట‌న్ లో రోహిత్ శ‌ర్మ‌ కొట్టిన 23 ప‌రుగులు సెంచ‌రీతో స‌మానం

రెండో వ‌న్డేలోనూ కివీస్ ఓట‌మి…మ‌ళ్లీ వ‌ర్ష‌మే టీమిండియాను కాపాడిందంటూ త‌న్వీర్ సంచ‌ల‌నం!

ఐపీఎల్ కాంట్రాక్టు కోసం న్యూజిలాండ్ క్రికెట్ ను మిచెల్ శాంట్న‌ర్ అమ్మేశాడు

Big Stories

Advertisement
×