Balakrishna: నటసింహ నందమూరి బాలకృష్ణ (Balakrishna ) స్వర్గీయ నందమూరి తారక రామారావు (Sr.NTR) వారసులుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, అతి తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్ ను అందుకున్నారు. ఇకపోతే ఇటీవల ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంలో పలువురు సినీ పెద్దలు ఆయనకు ఘనంగా సిల్వర్ జూబ్లీ కార్యక్రమం నిర్వహించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు వరుస సినిమాలతో హ్యాట్రిక్ అందుక్కుంటూ దూసుకుపోతున్న బాలయ్య అటు రాజకీయాలలో కూడా చెరగని ముద్ర వేసుకున్నారు.
హీరో గానే కాదు రాజకీయ నేతగా కూడా చెరగని ముద్ర…
రాయలసీమ ప్రాంతం హిందూపురం నియోజకవర్గం లో బాలయ్యకు తిరుగులేదని చెప్పాలి. 2024 సార్వత్రిక ఎన్నికలలో మూడవసారి శాసనసభకు ఎంపికై..ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ అందుకొని.. రాజకీయాలలో కూడా తిరుగులేని వ్యక్తిగా నిరూపించుకున్నారు.. ఒకవైపు సినిమాలు ,మరొకవైపు రాజకీయాలలో చాలా వేగంగా దూసుకుపోతున్న బాలయ్య కి అభిమానులు ఏ రేంజ్ లో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ఇది ఇలా ఉండగా మరోవైపు అమెరికాలో అధ్యక్ష పదవి ఎన్నికలు చాలా హోరాహోరీగా సాగుతున్న విషయం తెలిసిందే.. ఈ ఎన్నికలలో బాలయ్యకు ఓటు వేయడం సంచలనంగా మారింది.
ముగిసిన అమెరికా అధ్యక్ష ఎన్నికలు..
అసలు విషయంలోకి వెళితే.. అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ రసవత్తరంగా సాగింది. రిపబ్లికన్ డొనాల్డ్ ట్రంప్, డెమోక్రాట్ కమల హారిస్ లలో ఒకరిని అధ్యక్షులుగా ఎన్నుకోవడం కోసం ఓటింగ్ జరిగింది. ఈ ఎన్నికల ఫలితాల కోసం యావత్ ప్రపంచ దేశాలన్నీ ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఇక గత కొన్ని గంటల క్రితం యూఎస్ ఎలక్షన్ పోలింగ్ కూడా ముగిసింది. అయితే ఈ ఎలక్షన్స్ సమయంలో ఊహించని పరిణామం ఒకటి అందరిని ఆశ్చర్యంతో పాటు నవ్వుల్లో ముంచేసింది అని చెప్పవచ్చు. అసలు విషయంలోకి వెళితే.. సాధారణంగా మన ఇండియాలో అయితే ఈవీఎం పద్ధతిలో ఓటు వేస్తారు. కానీ అమెరికాలో అలా కాదు. పోస్టల్ బ్యాలెట్ తోనే ఓటింగ్ జరుగుతుంది.
అమెరికా అధ్యక్ష ఎన్నికలలో బాలయ్యకి ఓటు..
ఈ క్రమంలోనే ఒక ఓటర్.. ఓటింగ్ స్లిప్ పై తన ఓటు బాలయ్యకు అని రాశాడు. ఈ విషయం తెలిసి అందరూ ఆశ్చర్యపోతూ.. నవ్వుకుంటున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలలో ప్రముఖ సినీ నటుడు, రాజకీయ నేత బాలయ్య పేరు రావడంతో ఈ విషయం కాస్త ఇప్పుడు సంచలనంగా మారింది. మాస్ హీరోగా భారీ పాపులారిటీ దక్కించుకున్న బాలయ్యను ఇప్పుడు అమెరికా అధ్యక్షుడిగా చూడాలనుకుంటున్నాడేమో సదరు ఓటర్ అంటూ నేటిజన్స్ సరదాగా కామెంట్లు చేస్తున్నారు.. ముఖ్యంగా బాలయ్యకే నా ఓటు అంటూ ఆ ఓటర్ ..స్లిప్ పై రాయడం కాస్త నవ్వు తెప్పిస్తోందని చెప్పవచ్చు.. ఇకపోతే ఈ ఘటన ఫ్లోరిడాలో జరిగింది. అమెరికా అధ్యక్ష ఎన్నికలలో అమెరికా చరిత్రలో ఇలాంటి ఓటు పడడం ఇదే తొలిసారి. ఏదిఏమైనా లిస్టులో లేని వ్యక్తి పైగా ఇండియాకు చెందిన వ్యక్తిని అమెరికా అధ్యక్షుడిగా చూడాలని బలంగా కోరుకోవడంతో ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు. అమెరికాలో బాలయ్య ఫ్యాన్స్ ఏ రేంజ్ లో ఉన్నారో అంటూ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. ఇక ఈ విషయం బాలయ్య వరకు వెళ్లిందో లేదో తెలియదు కానీ బాలయ్య అభిమానులు మాత్రం సంతోషం వ్యక్తం చేస్తూ ఈ విషయాన్ని తెగ వైరల్ చేస్తున్నారు.