BigTV English
Advertisement

Lucky Bhashkar Collections : బాక్సాఫీస్ వద్ద దున్నెస్తున్న దుల్కర్ మూవీ.. 100 కోట్ల క్లబ్ లోకి చేరినట్లేనా..?

Lucky Bhashkar Collections : బాక్సాఫీస్ వద్ద దున్నెస్తున్న దుల్కర్ మూవీ.. 100 కోట్ల క్లబ్ లోకి చేరినట్లేనా..?

మొత్తం బాగుందనే టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమా మరో రెండు మూడు రోజుల్లోనే వంద కోట్ల క్లబ్ లోకి చేరుకోబోతుందనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా ఇప్పటివరకు ఎంత రాబాట్టిందో పూర్తి వివరాలు తెలుసుకుందాం..


మలయాళ లెజెండరి స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన లక్కీ భాస్కర్ దీపావళి కానుకగా అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజైంది.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్ సినిమాస్‌ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా లక్కీ భాస్కర్ చిత్రాన్ని నిర్మించారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రచార కార్యక్రమాలు, ఇతర ఖర్చులు కలుపుకుని లక్కీ భాస్కర్‌ మూవీ బడ్జెట్ రూ.100 కోట్లుగా ఫిలింనగర్ టాక్. ఇందులో దుల్కర్ సల్మాన్ కు జోడిగా లక్కీ హీరోయిన్ మీనాక్షి చౌదరి నటించింది.. రామ్‌కీ, మానస చౌదరి, హైపర్ ఆది, సచిన్ ఖేడేకర్, సాయి కుమార్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పించిన ఈ మూవీని తెలుగు, మలయాళం, తమిళం, హిందీ, కన్నడ బాషల్లో రిలీజ్ అయ్యింది.

లక్కీ భాస్కర్ మూవీ అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ కలెక్షన్స్ ను అందుకుంటుంది. ఇక లక్కీ భాస్కర్ మూవీ కలెక్షన్ విషయానికొస్తే..మొదటి రోజు కంటే రెండో రోజు ఎక్కువ వసూళ్లు వచ్చాయి. రెండో రోజు 14 కోట్ల రూపాయల కంటే ఎక్కువ వసూళ్లు వచ్చాయి. రెండు రోజుల్లో లక్కీ భాస్కర్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 26 కోట్ల రూపాయల కంటే ఎక్కువ కలెక్ట్ చేసింది.. అలాగే మూడో రోజు కూడా భారీగానే రాబట్టింది. నాలుగు రోజులకు గాను 40 కోట్ల వరకు రాబాట్టింది. ఇక ఐదో రోజు 55 కోట్ల గ్రాస్ ను రాబట్టింది. ఇక 6వ రోజు దుల్కర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 4.50 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. మరి ఏడో రోజైన బుధవారం లక్కీభాస్కర్ ఎలాంటి కలెక్షన్స్ సాధిస్తుందో చూడాలి. ఈ వారం వసూళ్లను బట్టి ఈ సినిమా రిజల్ట్ ఏంటో తెలియనుంది. ఇదే జోరు కొనసాగితే మాత్రం వంద కోట్ల క్లబ్ లోకి చేరడం పక్కా.. అటు భారీ ధరకు ఓటీటీ  డీల్ ను కుదుర్చుకుంది.. త్వరలోనే ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ గురించి అప్డేట్ రాబోతుందని సమాచారం.. ఇక దుల్కర్ తెలుగులో నటించిన నాల్గొవా సినిమా కూడా భారీ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.. ఈ సినిమా హిట్ టాక్ ను అందుకుంది.. నెక్స్ట్ కూడా తెలుగులో సినిమాలు చెయ్యనున్నాడని ఓ వార్త టాలీవుడ్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. దీని పై త్వరలోనే క్లారిటీ రావాల్సి ఉంది..


Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×