BigTV English

Double ISMART: మాస్ సాంగ్ అంటే ఇదేరా.. రామ్ స్టెప్స్ అయితే నెక్స్ట్ లెవెల్

Double ISMART: మాస్ సాంగ్ అంటే ఇదేరా.. రామ్ స్టెప్స్ అయితే నెక్స్ట్ లెవెల్

Double ISMART: ఉస్తాద్ రామ్ పోతినేని- డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కమ్బలో తెరకెక్కుతున్న చిత్రం డబుల్ ఇస్మార్ట్. వీరిద్దరి కాంబోలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ కు ఈ సినిమా సీక్వెల్ గా తెరకెక్కుతోంది. పార్ట్ 1 ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇస్మార్ట్ శంకర్ తరువాత రామ్ కు కానీ, పూరికి కానీ హిట్ పడింది లేదు. దీంతో వీరిద్దరూ అన్ని ఆశలు డబుల్ ఇస్మార్ట్ మీదనే పెట్టుకున్నారు.


ఇక ఈ సినిమాలో డబుల్ ఎంటర్ టైన్మెంట్ కోసం రామ్ తో పాటు బాలీవుడ్ హీరో సంజయ్ దత్ ను కూడా దింపాడు పూరి. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ , సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆగస్టు 15 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్.. వరుసగా లిరికల్ వీడియోలను రిలీజ్ చేస్తూ హైప్ క్రియేట్ చేస్తున్నారు.

తాజాగా డబుల్ ఇస్మార్ట్ నుంచి సెకండ్ లిరికల్ సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. మార్ ముంత.. చోడ్ చింత అంటూ సాగిన ఈ సాంగ్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఇస్మార్ట్ శంకర్ లో కనుక దిమాక్ ఖరాబ్ లాంటి మాస్ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెల్సిందే. ఇక ఇప్పుడు అలాంటి సాంగ్ లానే మార్ ముంత.. చోడ్ చింత కనిపిస్తుంది. రామ్ ఊర మాస్ స్టెప్పులు నెక్ట్ లెవెల్.


ఇక హీరోయిన్ కావ్య థాపర్ అందాల ఆరబోత అయితే సాంగ్ కే హైలైట్ గా నిలిచింది. మణిశర్మ సంగీతం అందించిన ఈ సాంగ్ కు కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించగా..రాహుల్ సిప్లిగంజ్ మరియు కీర్తనా శర్మ మెస్మరైజ్ వాయిస్ తో సాంగ్ కు మరింత హుషారు తీసుకొచ్చారు. మధ్యమధ్యలో మాజీ సీఎం కేసీఆర్ ఏం చేద్దాం అంటావ్ మరి, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సెర్ ఎంజాయ్ పండగో లాంటి డైలాగ్స్ ఆకట్టుకున్నాయి.

ఇస్మార్ట్ శంకర్ సాంగ్స్ ఎలా అయితే చార్ట్ బస్టర్స్ గా మారాయో.. డబుల్ ఇస్మార్ట్ సాంగ్స్ కూడా అలానే చార్ట్ బస్టర్స్ లా నిలుస్తాయని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి కాదు. మరి సాంగ్స్ లానే సినిమా కూడా అంతే విజయాన్ని అందుకుంటుందేమో చూడాలి.

Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×