Vaishnavi Chaithanya : టాలీవుడ్ యంగ్ హీరోయిన్ వైష్ణవి చైతన్య ( Vishnavi Chaithanya ) గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. యూట్యూబ్ యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ క్రేజ్ ని అందుకుంది. ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన బేబీ మూవీ తో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. మొదటి మూవీ తోనే తన అందం అభినయంకు మంచి మార్కులు పడ్డాయి. ఆ సినిమాతో ఒక్కసారిగా యూత్ క్రష్ అయిపోయింది. ప్రస్తుతం వైష్ణవి జాక్ అనే మూవీలో నటిస్తుంది. టాలీవుడ్ స్టార్ హీరో సిద్దు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) హీరోగా నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విమర్శకుల ప్రశంసలు అందుకుంటుంది. సినిమాలో ముద్దు సీన్ హైలెట్ అయ్యేల కనిపిస్తుంది. తాజాగా ఈమె గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతుంది..
ఒక్క మాటతో అడ్డంగా దొరికిన బేబి..
వైష్ణవి చైతన్య చూడటానికి చాలా సాఫ్ట్ గా కనిపిస్తుంది. కానీ నోరు తెరిస్తే మాత్రం బూతులే అని నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. అందుకు కారణం కూడా లేకపోలేదు. ప్రస్తుతం ఈమె జాక్ అనే మూవీలో నటిస్తుంది. ఏప్రిల్ 10 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు టీమ్.. ఈ క్రమంలో మొన్న భీమవరంలో ఏర్పాటు ఈవెంట్ లో ఈమె మాట్లాడింది. అయితే భీమవరం కు బదులు రాజమండ్రి అని ఆ లొకేషన్ ను సంబందించింది. అలా మిస్టేక్ చేశానని ఒక్కసారిగా వేదికపైనే ఓ ఫ..క్ అంటూ మాట్లాడింది. ఒకసారి గా వైష్ణవి చైతన్య అలా మాట్లాడడంతో అందరూ షాక్ అయ్యారు.. బూతులు మాట్లాడుతుంటే నాకు షాక్ అనిపిస్తుందని ఫ్యాన్స్ అంటున్నారు..
Also Read :ఫేక్ ఫోటోలతో సెలబ్రిటీస్ పోస్టులు.. ఇప్పుడు నిజాలు తెలుసుకుని హైరానా..
సారీ చెప్పిన వైష్ణవి..
ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న వైష్ణవి మాట్లాడుతూ.. బొమ్మరిల్లు భాస్కర్ ( Bommarillu Bhashkar) సినిమాలో అవకాశం వచ్చినందుకు నా అదృష్టంగా భావిస్తున్నా.. సినిమా చేసినంతసేపు బాగుంటుంది కానీ షూటింగ్ అయిపోయేటప్పుడు చాలా బాధగా ఉంటుంది. భాస్కర్ సార్ సినిమాలో అవకాశం వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. భాస్కర్ సినిమాలో క్యారెక్టర్లను డిఫరెంట్‌గా చూపిస్తుంటారు. ఈ మూవీ టైం లో ఎప్పుడైన మిమ్మల్ని ఇబ్బంది పెట్టింటే సారీ అని చెప్పింది. ఇప్పటివరకు ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ప్రతి అప్డేట్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మూవీ ఎలా ఉంటుందో చూడాలి.. సిద్దు జొన్నలగడ్డ నటించిన టిల్లు సిరీస్ మూవీస్ మంచి రెస్పాన్స్ ను అందుకున్నాయి. ఆ మూవీ తర్వాత రాబోతున్న ఈ మూవీ పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ మూవీతో ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి.. ఈ మూవీ తర్వాత టిల్లు క్యూబ్ మొదలు పెట్టే అవకాశం ఉంది. త్వరలోనే దాని అప్డేట్ రాబోతుంది.