OTT Movies : కొన్ని సినిమాలు హింస, అశ్లీలత, మతపరమైన అంశాల కారణంగా ఇండియాలో నిషేధానికి గురయ్యాయి. థియేటర్ల వరకు ఈ సినిమాలు వెళ్లలేదు. ఈ సినిమాలలో శృతి మించిన అడ*ల్ట్ కంటెంట్ ఉండటంతో పాటు, మతపరమైన విద్వేషాలు కూడా ఉండటంతో వీటిని నిషేధించారు. అయితే ఇప్పుడు ఏ సెన్సార్ నిబంధనలు లేకుండానే, ఓటీటీ లో ఈ సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. వీటి వివరాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం
1. ‘ది డా విన్సీ కోడ్’ (The Da Vinci Code)
2006 లో వచ్చిన ఈ మూవీ వివాదాస్పద థ్రిల్లర్ సంచలనం గా మారింది. మత వర్గాలలో, ముఖ్యంగా క్రైస్తవ వర్గాలలో కలకలం రేపింది. దేవుణ్ణి కించపరిచే విధంగా ఉండటంతో, అనేక భారతీయ రాష్ట్రాల్లో ఈ మూవీ నిషేధానికి గురైంది. ఇది ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ (Netflix), (Zee5), ప్రైమ్ వీడియో(Prime Video)లలో స్ట్రీమింగ్ అవుతోంది.
2. ‘ఫిఫ్టీ షేడ్స్ ఆఫ్ గ్రే’ (Fifty Shades of Grey)
2015 లో వచ్చిన ఈ మూవీలో శృంగారభరితమైన కంటెంట్ మరీ ఎక్కువగా ఉండటంతో, ఇండియాలో ఈ మూవీషేధించబడింది. థియేట్రికల్ గా కూడా దీనిని ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్ళే విధంగా ఉండదు. అంతలా బోల్డ్ సీన్స్ ఉంటాయి కాబట్టే నిషేధించారు. అయితే నెట్‌ఫ్లిక్స్ (Netflix), జియో సినిమా (JioCinema), జీ5 (Zee5) ఓటీటీ లో ఇది అందుబాటులో ఉంది.
3. ‘ది గర్ల్ విత్ ది డ్రాగన్ టాటూ’ (The Girl with the Dragon Tattoo)
2011 లో వచ్చిన ఈ మూవీ ‘బెస్ట్ సెల్లింగ్’ నవల ఆధారంగా రూపొందించబడిన ఈ థ్రిల్లర్ సినిమా. తీవ్రమైన లైంగిక హింస కారణంగా, భారతదేశంలో థియేటర్లలో విడుదలకు నిరాకరించబడింది. కానీ మీరు ఇప్పుడు సెన్సార్ చేయని పూర్తి వెర్షన్ ను ఓటీటీ లో చూడవచ్చు. ప్రైమ్ వీడియో(Prime Video), జీ5 (Zee5) లలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.
4. ‘అన్‌ఫ్రీడం’ (Unfreedom)
2014 లో వచ్చిన ఈ మూవీ మతపరమైన తీవ్రవాదం, లెస్బియన్ సంబంధాలు ఉన్నందున, ఈ మూవీని థియేటర్లలో పూర్తిగా నిషేధించారు. ఇప్పుడు ఇది సెన్సార్ చేయకుండానే నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది.
5. ‘గండు’ (Gandu)
2010 లో వచ్చిన ఈ మూవీ, ఇప్పటివరకు నిర్మించిన అత్యంత వివాదాస్పద భారతీయ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. అశ్లీలత ఎక్కువగా ఉండటంవల్ల దీనిని నిషేధించారు. అయితే ఇప్పుడు సెన్సార్ చేయకుండానే నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో అందుబాటులో ఉంది.
6. ‘పర్జానియా’ (Parzania)
2005 లో వచ్చిన ఈ మూవీలో, గుజరాత్‌లో జరిగిన 2002 అల్లర్ల ను తెరకెక్కించారు. ఇందులో మతపరమైన అల్లర్లు, అఘాయిత్యాలు వివాదాస్పదంగా మారాయి. ఈ కారణంగా దీనిని గుజరాత్‌లో నిషేధించారు. ఈ మూవీ డిస్నీ+ హాట్‌స్టార్ (Disney+ Hotstar) లో స్ట్రీమింగ్ అవుతోంది.
Read Also : కమ్ముకొచ్చే మేఘాలు, అందులో అడుగు పెడితే పార్ట్స్ పార్ట్స్ గా… సస్పెన్స్ తో పిచ్చెక్కించే మూవీ
7. ‘వాటర్’ (Water)
2005 దీపా మెహతా ఈ సినిమా నిర్మిస్తున్న సమయంలోనే హింసాత్మక నిరసనలను ఎదుర్కొంది. ఆశ్రమాలలో నివసిస్తున్న వితంతువులను, హిందూ సంప్రదాయాలను వక్రీకరించే విధంగా ఉండటం వల్ల, ఇది కూడా ఇండియాలో నిషేధించబడింది. ఇది చివరికి అంతర్జాతీయ వేదికగా విడుదలైంది. ఇప్పుడు యూట్యూబ్ (YouTube) లో అందుబాటులో ఉంది.