BigTV English

Valentines Day: వాలెంటైన్స్ డే వీళ్లకే వచ్చినట్టుంది.. ఒక్కరోజే ఇన్ని సినిమాలా

Valentines Day: వాలెంటైన్స్ డే వీళ్లకే వచ్చినట్టుంది.. ఒక్కరోజే ఇన్ని సినిమాలా

Valentines Day: ఈ ఏడాది వాలెంటైన్స్ డేను ఎంతో మంది చాలా గ్రాండ్‌గా జరుపుకున్నారు. సినిమాలు, రెస్టారెంట్లు, పార్కులలో బాగా ఎంజాయ్ చేశారు. ఇలాంటి సమయంలోనే తమ సినిమాలను ప్రకటించాలని కొందరు.. ఇక ప్రకటించిన సినిమాల నుంచి ఫస్ట్ లుక్స్, టీజర్, ట్రైలర్, సాంగ్స్.. ఇలా తమ సినిమాలకు సంబంధించిన అప్డేట్‌లను మూవీ యూనిట్ అందించాలని చూస్తుంది. అయితే వాలెంటైన్స్ డే సందర్భంగా.. మంచి లవ్ కన్సెప్ట్‌ జానర్‌లో ఈ సారి చాలా సినిమాలను అనౌన్స్ చేశారు. దాదాపు అరడజనుకి పైగా సినిమాలను అనౌన్స్ చేయడం విశేషం.


బంగారు గుడ్డు: సంపూర్ణేష్ బాబు, తమిళ నటుడు రోబో శంకర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ద్విభాషా చిత్రం ‘బంగారు గుడ్డు’. లవర్స్ డే స్పెషల్‌గా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ని మేకర్స్ రిలీజ్ చేశారు.

UI : కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర హీరోగా చేస్తూ దర్శకత్వం వహిస్తున్న లేటెస్ట్ మూవీ ‘UI’. ఈ సినిమాను ఆయనే స్వయంగా నిర్మిస్తున్నారు. తాజాగా వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ సినిమా నుండి చీప్ సాంగ్ ప్రోమోని రిలీజ్ చేశారు. ఈ చిత్రం సమ్మర్‌లో రిలీజ్ కానుంది.


రామం రాఘవం: జబర్దస్త్ కమెడియన్ ధనరాజ్ హీరోగా చేస్తున్న మూవీ ‘రామం రాఘవం’. ఈ సినిమాకు తానే స్వీయంగా దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో సముద్రఖని ప్రత్యేక పాత్రలో నటిస్తున్నాడు. ఇక తాజాగా వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన టీజర్ అందరినీ ఆకట్టుకుంటోంది. తండ్రి కొడుకుల నేపథ్యంలో ఫీల్ గుడ్ మూవీ లా ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది.

READ MORE: శ్రీవల్లీతో వాలెంటైన్స్‌ డే ముచ్చట్లు.. పుష్ప 2 అప్డేట్ అడిగిన నెటిజన్లు..

8 వసంతాలు: మను దర్శకుడు ఫణింద్ర డైరెక్షన్‌లో లవ్ స్టోరీగా ఓ మూవీ తెరకెక్కబోతుంది. ఈ సినిమాను ప్రేమికుల రోజున అనౌన్స్ చేశారు. ఈ మేరకు సినిమా నుంచి కాన్సెప్ట్ పోస్టర్‌ని కూడా రిలీజ్ చేసి అందరినీ ఆకట్టుకున్నారు. కాగా మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

పేట రాప్: ప్రముఖ కొరియోగ్రాఫర్ అండ్ నటుడు ప్రభుదేవా హీరోగా నటిస్తోన్న కొత్త సినిమా ‘పేట రాప్’. ఈ సినిమాకు sj సీను దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ తాజాగా రిలీజ్ చేశారు. ఇక ఈ మూవీలో ప్రభుదేవ సరసన వేదిక హీరోయిన్‌గా నటిస్తుంది.

ఉషా పరిణయం: విజయ భాస్కర్.కె చాలా కాలం తర్వాత దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ‘ఉషా పరిణయం’. ఆయన తనయుడు శ్రీ కమల్‌ని ఈ సినిమా ద్వారా హీరోగా పరిచయం చేస్తున్నాడు. వాలెంటైన్స్ డే స్పెషల్‌గా ఈ మూవీ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. ఈ మూవీలో శ్రీకమల్‌కు జోడీగా తన్వి ఆకాంక్ష హీరోయిన్‌గా నటిస్తుంది.

జై గణేష్: మలయాళ స్టార్ హీరో ఉన్ని ముకుందన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘జై గణేష్’. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ టీజర్‌ని ప్రేమికుల రోజున రిలీజ్ చేశారు. ఆగస్ట్ 11న రిలీజ్ కానున్న ఈ సినిమాలో హీరో హ్యాండీ క్యాప్డ్‌గా నటిస్తున్నాడు.

READ MORE: వాలెంటైన్స్ డే.. ప్రేమబంధంతో ఒక్కటైన టాలీవుడ్ కపుల్స్..!

సోలో బాయ్ : ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ 7 ద్వారా మంచి ఫేమ్ అందుకున్న గౌతమ్ కృష్ణ.. సినిమాలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఆయన హీరోగా నటిస్తున్న తాజా సినిమా ‘సోలో బాయ్’. ఈ సినిమా ఫస్ట్ లుక్ గ్లింప్స్‌ను ప్రేమికుల రోజున విడుదల చేశారు.

డియర్ ఉమ : పృథ్వీ అంబార్ హీరోగా సాయి రాజేష్ మహదేవ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న లేటెస్ట్ మూవీ ‘డియర్ ఉమ’. ఇందులో సౌమ్య రెడ్డి హీరోయిన్‌గా నటిస్తుంది. అంతేకాకుండా ఈ సినిమాను తానే నిర్మిస్తుంది. ఇక వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్‌ని రిలీజ్ చేశారు.

భలే ఉన్నాడే: ‘భలే ఉన్నాడే’ మూవీ ఫస్ట్‌లుక్‌ని మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు. ఈ మూవీకి జె. శివసాయి వర్ధన్ దర్శకత్వం వహిస్తుండగా.. n.v కిరణ్ కుమార్ నిర్మిస్తున్నాడు.

Tags

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×