E-Paper
Advertisement

Vani Jairam: గాయని వాణీజయరాం పాడిన పాటలివే.. అందుకున్న అవార్డులివే..

Vani Jairam: గాయని వాణీజయరాం పాడిన పాటలివే.. అందుకున్న అవార్డులివే..
Advertisement

Vani Jairam: ప్రముఖ గాయని వాణీజయరాం తన ఎనిమిదో ఏటనే సంగీత కచేరీ నిర్వహించి ప్రశంసలు అందుకున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, గుజరాతీ, మరాఠీ, ఒరియా, హిందీ.. ఇలా 14 భాషల్లో దాదాపు 20వేలకు పైగా పాటలను పాడారు. మొట్టమొదటిసారి 1970లో బాలీవుడ్ మూవీ ‘గుడ్డీ’లో ‘బోలే రే’ అనే పాటను ఆలపించారు. అప్పట్లో ఆ పాట సూపర్ హిట్ అయి పలు అవార్డులు కూడా వచ్చాయి.

తమిళంలో బాలచందర్‌ దర్శకత్వంలో వచ్చిన ‘అపూర్వ రాగంగళ్‌’ సినిమా పాటలు ఆమెకు మంచి గుర్తింపుని తెచ్చాయి. తెలుగులో ‘శంకరాభరణం’ సినిమాతో ఆమె పేరు మారుమోగిపోయింది. ఈ పాటలతో జాతీయ అవార్డుని కూడా అందుకున్నారు. దీంతో తెలుగులో మరోచరిత్ర, వయసు పిలిచింది, మంగమ్మ గారి మనవడు, స్వాతికిరణం, శృతి లయలు, స్వర్ణకమలం, సీతాకోక చిలుక..లాంటిఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో అద్భుతమైన పాటలు పాడి ప్రేక్షకులని ఆకట్టుకున్నారు.

Advertisement

14 భాషల్లో పదివేలకిపైగా పాటలు పాడిన వాణీ జయరాం నంది అవార్డులు, వివిధ స్టేట్ అవార్డులు, నేషనల్, ఫిలింఫేర్, సైమా, వివిధ దేశాల అవార్డుల్ని అందుకున్నారు. తాజాగా ఆమెకు భారత ప్రభుత్వం పద్మభూషణ్ ప్రకటించింది. ఇంతలోనే ఆమె తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవటంతో.. కుటుంబీకులు, ఆమె అభిమానులు… శోకసంద్రంలో మునిగిపోయారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×