BigTV English

VaniJayaram: వాణీజయరాం మరణం.. ప్రమాదమా? అనుమానాస్పదమా?

VaniJayaram: వాణీజయరాం మరణం.. ప్రమాదమా? అనుమానాస్పదమా?

VaniJayaram: ప్రముఖ గాయని వాణీజయరాం మరణం సినీ పరిశ్రమలో విషాదం నింపింది. ఇటీవలే కేంద్రం పద్మభూషణ్ ప్రకటించగా.. ఆ ఆనందంలో ఉండగానే అప్పుడే అనంత లోకాలకు వెళ్లిపోయారు. 19 భాషల్లో 20వేలకు పైగా పాటలు పాడి.. యావత్ దేశాన్ని తన గానామృతంతో ఓలలాడించిన ఆ గాన..వాణీ ఇకలేరనే విషయం అందరితో కంటతడి పెట్టిస్తోంది. ఇలాంటి సమయంలో ఆమె మరణంపై వస్తున్న వార్తలు మరింత దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి. అసలేమైంది? వాణీజయరాం ఎలా చనిపోయారు? అనే ఆరాటం పెరిగింది.


ఆసుపత్రికి తీసుకెళ్లే సమయంలో వాణీజయరాం నుదురు, ముఖంపై బలమైన గాయాలు ఉన్నాయి. ఎప్పటిలానే పనిమనిషి ఇంటికి వెళ్లగా లోపలి నుంచి గడియ పెట్టి ఉంది. కాలింగ్ బెల్ కొట్టినా ఎవరూ తీయకపోవడంతో ఆందోళన చెంది బంధువులకు ఫోన్ చేసింది.

బంధువులు వచ్చి డోర్ బద్దలు కొట్టి లోపలికి వెళ్లగా.. రక్తపు మడుగులో పడి ఉన్నారు వాణీ జయరాం. ముఖంపై తీవ్ర గాయాలతో స్పృహ కోల్పోయిన స్థితిలో కనిపించారు వాణీ జయరాం. హుటాహుటిన ఆమెను హాస్పిటల్ కి తరలించారు. చికిత్స పొందుతూ వాణీజయరాం చనిపోయారు.


వాణీజయరాం తన ఇంట్లో కాలు జారీ పడి ఉంటారని అంటున్నారు. నేరుగా గ్లాస్ టేబుల్ మీద పడటంతో.. ముఖానికి బలమైన గాయాలు అయి.. తీవ్ర రక్తస్రావంతో చనిపోయినట్టు భావిస్తున్నారు.

పోలీసులు వాణీ జయరాం ఇంటిని ఆధీనంలోకి తీసుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు.

Vani Jairam: మూగబోయిన వాణీ… సినీ ప్రస్థానం సాగిందిలా..

VaniJayaram: గాయని వాణీజయరాం కన్నుమూత.. ఇటీవలే పద్మభూషణ్..

More More Live Updates :-

Tags

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×